Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#80
శిఖండి పూర్తి జీవిత కథ
[font=var(--ricos-font-family,unset)][Image: image-2025-04-15-134253148.png][/font]
 

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య






శిఖండి మహాభారతంలో ఒక విచిత్రమైన పాత్ర. పట్టుదల, పౌరుషం గల పాత్ర. మహారథుడు. ప్రతీకారంతో భీష్ముని మరణానికి కారణమైనవాడు శిఖండి. 



శిఖండి ముందు జన్మలో స్త్రీ. కాశీరాజు పెద్ద కుమార్తె, యువరాణి. పేరు అంబ. కాశీరాజు ముగ్గురు కుమార్తెలలో మిగతా ఇద్దరు అంబిక, అంబాలిక. వీరికి యుక్త వయసు రాగానే కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరానికి నానాదేశపు రాజులతో పాటు సాళువరాజు, భీష్ముడు కూడా వచ్చారు.



ఆహ్వానితులైన వివిధ దేశాల రాకుమారులు ఆశీనులై ఉన్న సభా భవనంలోకి కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలను స్వయంవర వేదిక పైకి రప్పించాడు. రాకుమార్తెలు రాగానే రాకుమారులలో కలకలం రేగింది. ఎవరికి వారు తామే సొంతం చేసుకోవాలని ఒకరి పై ఒకరు సంకుల సమరానికి దిగారు. 



భీష్ముడు తన ఆసనంపై నుంచి లేచి స్వయంవరం వేదిక పైకి పోయి, సకల రాజన్యులను ఉద్దేశించి 
"రాకుమారులారా! రాకుమార్తెలను నా సోదరుడు విచిత్రవీర్యుడికి వివాహం చేయడానికి తీసుకెళ్ళుతున్నాను. మీలో ఎవరైనా నన్ను ఎదిరించి రాకుమార్తెలను దక్కించుకోవచ్చు! అని ప్రకటించగానే రాకుమారులంతా ఒక్కుమ్మడిగా భీష్మునితో తలపడగా, వారందరినీ తృటిలో దునుమాడినాడు భీష్ముడు. 



సాళ్వుడు భీష్ముని ఎదుర్కోన రాగా అతనిని కూడా పడగొట్టి, రాకుమార్తెలు ముగ్గురిని రథంపై వేసుకుని, వాయువేగంతో హస్తినాపురం దిశగా రథాన్ని పరుగులు పెట్టించాడు భీష్ముడు. 



హస్తినాపురం చేరాక మువ్వురు రాజకుమార్తెలలో పెద్దదైన అంబ భీష్ముడితో " మహాత్మా! నేను సాళ్వభూపతిని ప్రేమించాను. స్వయంవరంలో నేను అతనినే వరించే దానిని. ఇంతలోపల నన్ను బలవంతంగా తెచ్చారు. మనువు ఒకచోట మనసు ఒకచోట ఉండడం సరైనది కాదు కదా! కావున నన్ను సాళ్వుడి దగ్గరకు చేర్చండి. నా సోదరీ మణులను మీ సోదరుడికి వివాహం జరిపించండి. " అని విన్నవించింది.
 
భీష్ముడు ఆమె కోరికను మన్నించి సాళ్వుడి సన్నిధికి పంపాడు. సాళ్వుడు "నన్ను ఓడించి గెలుచుకున్న నిన్ను నేను పరిగ్రహించను. నీవు అతని సొంతం. నాకు వలదు వెళ్లిపో " అని ఆమెను తిరస్కరించాడు. 



అంబ భీష్ముడి దగ్గరకు తిరిగి వచ్చి "నా ప్రేమను నాశనం చేశావు గనుక నీవే నన్ను వివాహం చేసుకో " అన్నది.



అందుకు భీష్ముడు "నేను వివాహం చేసుకోనని, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిన బూనాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పతిజ్ఞ నియమాన్ని ఉల్లంఘించను. " అన్నాడు.. 



అంబ భీష్ముడిని బతిమిలాడిలాడింది, బంగపోయింది, దూషించింది, శాపనార్థాలు పెట్టింది. అయినా భీష్ముడు ససేమిరా కాదు పొమ్మన్నాడు. అంబ భీష్ముడి గురువైన పరశురాముడిని ఆశ్రయించింది. పరశురాముడు ఆశ్రయమిచ్చి అభయమిచ్చాడు. 



భీష్ముడిని రప్పించి "నీ వలనే అంబ వివాహ జీవితం సర్వనాశనం అయ్యింది కనుక నువ్వే వివాహం చేసుకుని ఆమె జీవితాన్ని సరిచేయి. నీకు శస్త్రాస్త్రాలు నేర్పిన గురువుగా నిన్ను శాసిస్తున్నాను" అన్నాడు పరశురాముడు. 



"గురువర్యా! నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను. ప్రాణమైనా వదులు కుంటాను గానీ మాట తప్పను. ఆమెను పెళ్ళాడడం తప్ప ఏమైనా అడగండి. మీ శిష్యునిగా తలదాల్చి నిర్వర్తిస్తాను" వినమ్రంగా బదులిచ్చాడు భీష్ముడు. 



 "అట్లైన నాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది గాంగేయా! " పరుషంగా గద్దించాడు భార్గవ రాముడు. 



"గురువర్యా! ఆమెను పెళ్ళాడి నియమం తప్పే కన్న, మీతో యుద్ధానికి సిద్ధపడి మీ చేతుల్లో మరణించడమే మేలు"
 
"అయితే సమరానికి సిద్ధపడు" అని ధనుర్బాణాలు అందుకున్నాడు పరశురాముడు. 



భీష్ముడు కూడా విల్లంబులు అందుకున్నాడు. ఇద్దరి మధ్య భీకర రణం సాగింది. ఒకరిపై ఒకరు శర పరంపరలు సంధించుకున్నారు. అంతకంతకు యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. మహాశక్తివంతమైన అస్త్రాలు ప్రయోగించు కున్నారు. యుద్ధం ఇరవై రెండు దినముల పాటు కొనసాగింది. పరశురాముడు వయోభారంతో అలసి పోయాడు.



 యుద్ధం విరమించి అంబతో "అంబా! భీష్ముడు మహావీరుడు. భూమండలంలో ఇతన్ని జయించువాడు మరొకడు లేడు. అంతే గాక నాకు వార్ధక్యం మీదపడింది. నేను నీకు సహాయం చేయలేక పోతున్నాను" అని పలికాడు.
 
అప్పుడు అంబ భీష్ముడితో "భీష్మా! నిన్ను జయించు వీరుడే లేడని అహంకారంతో ఉన్నావు కదూ. ఎప్పటికైనా నిన్ను నేనే సంహరిస్తాను. ఇది సత్యం " అని మహా కోపోద్రిక్తురాలై శపథం చేసింది. 



అది విన్న భీష్ముడు " నీవు ఆయుధంను చేపట్టి యుద్ధానికి సిద్ధపడితే, నేను అస్త్ర సన్యాసం చేస్తాను " అని పలుకుతాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - జ్ఞానము నీవే వారాహీ - by k3vv3 - 15-04-2025, 01:44 PM



Users browsing this thread: 1 Guest(s)