Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఇంకెంత సేపు
#66
దీపావళి మజా – రాగతి రమ
 
[Image: image-2025-04-15-133443635.png]
 
"ఏమండోయ్ దీపావళికి నాకు కొత్తచీర తెచ్చారా"? అడిగింది శ్రీలత తన భర్త గోపాల్ ని"అయ్యో మర్చిపోయానే" అన్నాడు నాలికర్చుకుంటూ గోపాల్. రేపు తేకపోతే మీతో మాటలు బంద్" అంటు వార్నింగ్ ఇచ్చింది. "అది కాదే వారం తర్వాత మాట్లాడతావు కదా హమ్మయ్య ఫర్వాలేదు .."అన్నాడు "పర్వాలేదా... ఏమంటున్నారు..? మళ్లి మాట్లాడితే నెలంతా మాట్లాడను.!
"ఓసి  ఓసి .. ఓసి ఎంత మంచిమాటన్నావు - గోపాల్ నీదేరా  - అదృష్టం అంటే.!. మనసులో అనుకోబోయి పైకే అనేసాడు.
"నోరు మూసుకోండి " గట్టిగా అరచింది శ్రీలత. గోపాల్ నోటికి చేయి అడ్డంగా పెట్టుకొని లోనికి నడిచాడు. "ఏమండీ.." గట్టిగా అరిచింది శ్రీలత. గతుక్కుమన్నాడు గోపాల్ "ఏమిటి ఆ?"అన్నాడు దగ్గిరగా వచ్చి... మళ్లీ ఏంచావొచ్చిందిరా బాబూ అనుకుంటూ.
"ఏమండి దీపావళి దగ్గరగా వచ్చేస్తోంది - ఇల్లు దులపాల ఇల్లంతా కడగాల - పండక్కి తీపి బూందీ జంతికలూ చేయులనుకుంటున్నా ... ఆ సామగ్రంతా తోమాలి ఇంకా బోల్డన్ని పనులున్నాయి.. అందుకని వారం రోజులు "ఆఫీసుకు సెలవు పెట్టండి" గోముగా అడిగింది. "అమ్మ బాబోయ్ నా వల్ల కాదు .. కావలిస్తే ఆఫీసులొ
గొడ్డు చాకిరీ చేస్తాను గానీ ఇంట్లో ఈ గాడిద చాకిరీ నేను చేయలేనే !"
"అయితే నాకేనా పట్టింది బాధ గాడిద చాకిరీ చెయ్యడానికి మీరు హెల్ప్ చేయక పోతే *నోపండగ*
'అబ్బ రాక్షసీ నా ప్రాణాలు తీస్తున్నావు కదే!"అంటూ గొణుక్కున్నాడు
"ఏమంటున్నారు? నన్ను రాక్షసి అంటున్నారు కదూ అనండి అనండి మరేం పర్వాలే
దీనికేంటి మనసులో మాట తెలిసి పోతోంది . అనుకుంటూ బెడ్ రూం లోకి నడిచాడు.
డాడీ డాడీ అంటూ వాళ్ల పిల్లలిద్దరూ పరిగెత్తు కుంటూ వచ్చారు. "డాడీ మాకు మందుగుండు సామాను తెచ్చారా?" అన్నాజు దిలీప్. దిలీప్ 9 వ తరగతి చదువు తున్నాడు . "తొందరగా కొని తెండి నాన్నా" అంది స్వర్ణ 7వ తరగతి చదువుతోంది.
రేపు తప్పదర్రా - కొనేస్తా అన్నాడు. పిల్లలిద్దరూ సంతోషపడ్డారు.
మర్నాడు ఆపీసుకు లీవ్ పెట్టాడు. ఉదయాన్నేలేచి స్నానపానాలు కానిచ్చి కాఫీ టిఫెన్ కడుపులో పడేసుకొని - 8 గంటలకల్లా మందు గుండు సామాన్లు అమ్మెషాపుకి. అన్నిరకాలు కొని 5 వేలు కొట్టు వాడికి సమర్పించి సంచితో పాటు ఇంటికొచ్చాడు. పిల్ల లిద్దరూ సంచి లాక్కొని బోర్లించారు - కాకరపువ్వొత్తులు, మతాబాలు ,భూ చక్రాలు, టపాసులు, పాంబిళ్లలు బైట పడ్డాయి "ఏరా నచ్చిందా" అని అడిగాడు గోపాల్ "నచ్చ లేదు" అరిచింది స్వర్ణ .
"నచ్చలేదా క్రిందటి సారి లాగే అన్నీ తెచ్చానుగా....?" అన్నాడు గోపాల్ విస్తుపోతూ.
మేం బాంబులు కాలుస్తాం. మాకు తారా జువ్వలు, బాంబులే కావాలి. చిన్నపిల్లల్లగా పాం బిళ్లలూ కాకరపువ్వొత్తులు ఏంటిడాడి అవి మేం కాల్చం " అన్నాడు దిలీప్.
అవును డాడీ నేనూ అవే కాలుస్తాను. సీమటపాసులు కూడా కాలుస్తాను. అంది అంది స్వర్ణ .
ఔరా పిల్లలు 7 వ క్లాసుకే ఎంత ఎదిగి పోయారు అన్న గోపాల్ మాటకు గలగలా నవ్వింది శ్రీలత. మీలాగ బాంబులు కాల్చడం భయమనుకుంటే ఎలా...? బాంబులూ, జువ్వలు తీసుకురండి స్వర్ణ బాంబులు  అవీ తీసుకు వచ్చే వరకూ ఏమీ తిననని అలిగి కూర్చుంది" అంది శ్రీలత. అంతా తల్లి పోలికే మనసులోనే  అనుకున్నాడు. అంతా తల్లి పోలికే అంటూ నన్ను తిట్టు కుంటున్నారు కదూ ఉంటూ శ్రీలత నవ్వింది గతుక్కుమన్నాడు గోపాల్. శ్రీలత కెలా తెలిసి పోతోంది నా మనసులోని మాట అనుకుంటూ సంచి తీసుకొని బాంబులు తేవడానికి బయలు దేరాడు
బాంబులు, తారాజువ్వలు కొనుక్కొని పనిలో పనిగా మెగా బట్టల షాపులలో దూరి తన కిష్టమైన ఎల్లో కలర్ అద్దాల చీర కొనుక్కొని ఇంటి కొచ్చాడు గోపాల్. పిల్లలిద్దరూ సంతోషపడి పోయారు అవి చూసి“నీ చీర "అంటూ భార్యకు అందించాడు బ్యాగ్. శ్రీలత ప్యాకెట్టులో వున్న చీరని తీసి చూసింది.
విసురుగా అతని వేపు విసిరింది "పట్టు చీర తెస్తారనుకున్నా. పక్కింటి పంకజాక్షి, ఎదురింటి ఎల్లాదేవి చీరల కంటే నా చీర ధగాధగా మెరిసి పోవాలి,సరే శ్రీలతా ఈ చీరెచ్చేసి, పట్టు చీర తెస్తా అన్నాడు ఏడుపు మొఖం తో.
సరే ఈ చీర తిరిగి ఏమిస్తారు గానీ -ఈ చీరని పండగ ముందు రోజు కట్టుకుంటా సరేనా" అంటూ అతని చేతి లోని  చీరను లాక్కుంది.
ఓరి శ్రీమతి ఎన్నివేషాలే అనుకుంటూ బైటికి నడిచాడు.ఆరోజే దీపావళి. ఇంటి అందరూ స్నానాదులు పూర్తి చేసారు. శ్రీలత, గోపాల్ కలిసి బొబ్బట్లు చేసారు. ఇంకా పాయసం, పులి హోర పూర్తి అయ్యాయి. శ్రీలత గ్రీన్ పట్టు చీర గోపాల్ పండక్కి- కొన్నది కట్టుకుంది. పక్కింట్లో ఎదురిల్లు ఇంకా చాలానుంది దగ్గర నుంచి గ్రీన్ పట్టుచీరకు చాలా బాగుందని ప్రశంసలు లభించాయి. గాల్లో తేలిపోతోంది శ్రీలత. సాయంత్రం లక్ష్మీ పూజ చేసారు. ఇద్దరూ కలిసి ప్రమిదలు వెలిగించి ఇల్లంతా పేర్చారు. బైట పిల్లలు అప్పుడే బాంబులు, తారాజువ్వలు కాల్లేస్తు న్నారు .
"*ఏనుండి* ఆ పెద్ద బాంబు మీరు కాల్చవలసిందే." హూంక రించింది శ్రీలత. "ఒన్ మినిట్ అంటూ పాడవైన వెదురు కర్రకి కాకరపువ్వొత్తి తాడుతో కట్టి పెద్ద బాంబూ వెలిగించ బోయడు.
"ఏమండి పక్కింటి పంకజాక్షి మిమ్మల్ని చూసి నవ్వుతోం దండి నేను సహించను. మీరు అగ్గిపుల్లతోనే బాంబూ కాల్చాలి అంటు
 వెదురుకర్రను దూరంగా విసిరేసి భర్తని లాక్కుంటూ పోయింది బాంబు దగ్గిరకు. బాంబు వెలిగించగానే-ఢాం అంది. బాబోయ్ అంటూ ఎగిరి పడ్డాడు. వీరవనితలా పట్టు వదలని విక్రమార్కుడిలా బాంబులు కాల్పించింది. శ్రీలత. భయం తగ్గింది గోపాల్కి. పంకజాక్షి మూతి ముడచుకుంది. అది చూసి కిలకిలా నవ్వింది శ్రీలత. పండగ చాలా బాగా గడిచింది అంతా భార్య వల్లే అని అనుకుంటూ పైకి అన్నాడు. మరో సారి కిలకిల నవ్వింది శ్రీలత.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - దీపావళి మామగారు - by k3vv3 - 15-04-2025, 01:36 PM
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM



Users browsing this thread: 1 Guest(s)