Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#69
మీరిద్దరూ అనవసరంగా ఎవరైనా ఏమో అనుకుంటారని ఆవేశపడవద్దు. మా ఇష్ట ప్రకారమే మేము వెళ్తున్నాం. మీకు తెలుసు.. మాకు పిల్లలు ఇష్టమని. మా ఎదురుగా వాళ్ళు ఇబ్బంది పడ్తుంటే చూడలేము. అందుకే కనీసం మేమింకా ఆరోగ్యంగా మిగలాలంటే మాకు ఇపుడు విశ్రాంతి అవసరం అని నెమ్మదిగానే చెప్పాడు సుధాకర్. 
అమ్మా, నీకు బాగలేకుంటే మేము పని చెయ్యమని చెప్తామా? రెస్ట్ కావాలని నువ్వు చెప్పొచ్చుగా? మాకేం తెలుస్తుంది? అందరూ వుండి కూడా ఎవరూ లేనట్లు ఇప్పుడిలా మీరు ఆశ్రమానికి వెళ్ళడం ఎందుకు? పోనీ నంద్యాలలో మన ఇంటికే వెళ్ళండి అంది సుజిత కోపంగా ఏడుస్తూ. 



మాటలకు నిస్సహాయంగా చూసింది సుజాత. 



నంద్యాలకు వెళితే తనకు రెస్ట్ ఉండదు కదా? పని వాళ్ళు ఉన్నా మళ్ళీ ఇంట్లో పనులు చేస్తుంది. అందుకే విశ్రాంతిగా వుంటుందనే ప్రస్తుతానికి ఆశ్రమానికి వెళ్తున్నాం. మాకు ఆరోగ్యం కుదుట పడిన తరువాత నంద్యాల లో మనింటికి వెళ్తాము. 



మిమ్ములను పెంచాము. మీ పిల్లలను కూడా పెంచే శక్తి మాకు లేదు. అందరూ ఇలా ఇల్లు వదలి ఆశ్రమానికి వెళ్ళమని నేను చెప్పడం లేదు. మేము విశ్రాంతి కోసం వెళ్తున్నాం. పూర్వం లాగా అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ముల లాంటి బంధువుల ఇళ్ళకు వెళ్ళి నెలలు నెలలు ఉండే పరిస్థితి లేదు కదా! తరువాత నేను ఒకరిద్దరు పనివాళ్ళను ఏర్పాటు చేసుకుని అమ్మకు రెస్ట్ ఇవ్వాలి. మీరు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళండి, చాలు అని చెప్పాడు సుధాకర్. 



వింటున్న ముగ్గురూ ఇంకేమీ మాట్లాడలేక పొయ్యారు. ఎవరి ఆలోచనలలో వారున్నారు. తాము మరీ ఎక్కువగా వాళ్ళను ఇబ్బంది పెట్టామా? అని కూడా వాళ్ళకు అనిపిస్తోంది గానీ వొప్పుకోవడానికి మనసు రావడం లేదు. అహంకారం అడ్డు వస్తోంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లయ్యింది వాళ్ళపని. 



పిల్లల గురించి ఇంక ఆలోచించకుండా రేపు ఉదయం తాము చేరబోయే తీరం తమకు ప్రశాంతతను చేకూర్చాలని భగవంతుని కోరుకుంటూ సోఫాలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నారా పండుటాకుల లాంటి దంపతులు. 
===================================================================
సమాప్తం
===================================================================
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 2/3 - by k3vv3 - 13-04-2025, 09:13 AM



Users browsing this thread: 1 Guest(s)