Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#68
మా మనసు చెప్పిన తీర్పు - 3
మా మనసు చెప్పిన తీర్పు - [font=var(--ricos-font-family,unset)]3/3 - [/font]
[font=var(--ricos-font-family,unset)] [/font]



తెల్లవారి ఉదయం పదిగంటల సమయం లో సుజాత టిఫెన్ తిని నెమ్మదిగా వచ్చి సోఫాలో కూర్చుంది. రెండు సంవత్సరాల క్రితం చేసినట్లుగా సుజాత గబ గబా పనులు చెయ్యలేక పోతోంది. చిన్న పాప నిద్ర పోయింది. పెద్దవాడు తన ఎదురుగా బొమ్మలతో ఆడుతున్నాడు. కూతురు, అల్లుడు ఉదయం ఎనిమిదికి ఆఫీస్ కు వెళ్ళి పోయారు. 



 అదే సమయంలో సుధాకర్ సుధీర్ ఇంట్లోనుండి సుజిత ఇంటికి వచ్చి సుజాతను పిలిచాడు. సుజాత తలుపు తీస్తే సుధాకర్తో పాటు వేలు పట్టుకొని పెద్దపాప కూడా వచ్చింది. చిన్నవాడు ఇంట్లో నిద్ర పోతున్నాడు. కొడుకు, కోడలు ఇద్దరూ ఆఫీస్ కు వెళ్ళారు. 



రోజూ లాగే వాకిట్లో నిలబడి మాట్లాడకుండా సుధాకర్ లోపలికి వచ్చాడు. నిన్న రాత్రి పెద్దపాప ఏడుస్తోందనీ పాప దగ్గరే పడుకోమని కూతురు చెప్తే అక్కడే పడుకున్నాడు. వృద్ధాశ్రమం గురించి సుజాతతో చెప్పడం కుదరలేదు. అందుకని కొద్దిసేపు కూర్చొని మాట్లాడాలనుకున్నాడు. 
 అతను లోపలికి రావడం చూసి చిన్నవాడు ఇంట్లో వొక్కడే అవుతాడేమో అంది సుజాత. 



ఒక ఫోన్ విడియో కాల్ చేసి పక్కన దిండు మీద పెట్టి వచ్చాలే. ఒకటి నా చేతిలో వుంది అన్నాడు ఫోన్ చూపిస్తూ. 



 అది చూసి సరే అంటూ లోపలి వచ్చింది. పెద్దవాడితో కలిసి పెద్ద పాప ఆడుకుంటోంది. 



నిన్న కూరగాయలకు వెళ్ళినప్పుడు సోమశేఖర్ గారితో కలిసి వృద్ధాశ్రమం చూడటానికి వెళ్ళాను అని సుధాకర్ చెప్పగానే, 
అవునా!? సావిత్రి గారెలా వున్నారు? చాలా రోజులైంది వాళ్ళు ఇక్కడికి వచ్చి అంది సుజాత సోమశేఖర్ గారి భార్య గురించి అడుగుతూ. 



వాళ్ళు మనకంటే చాలా సంతోషంగానే వున్నారు. నేను మనగురించి హోం లో మాట్లాడటానికి వెళ్ళాను అని సుధాకర్ చెప్తూ వుండగానే 
వద్దులెండి. నాలుగు రోజులు ఉంటే జ్వరం తగ్గిపోతుంది అంటూ సుజాత సోఫాలో పడుకుంది, సుధాకర్ ఇంతకు ముందు సినిమాకో, టూర్ కో వెళ్దామని చెప్పినట్లు చెప్పగానే. 
సారి మనం తప్పకుండా వెళ్తున్నాము. జ్వరం ఇప్పుడు తగ్గుతుంది. మళ్ళీ రాదనే నమ్మకం లేదు. నిన్ను నువ్వు చూసుకోవడం లేదు. పిల్లలకు కొంచెం దూరంగా ఉంటేనే నీ ఆరోగ్యం బాగుంటుంది. ఇంక నువ్వు రానని చెప్పకు. నీ పిల్లలను నువ్వు చూశావు గదా? అలాగే వాళ్ళ పిల్లలను వాళ్ళు చూసుకుంటారు. 



ఎక్కడైనా మనం డబ్బు ఇస్తూనే ఉన్నాము, ఏదో ఒక రూపంలో. అదే డబ్బు అక్కడ కడతాము అంతే. నువ్వింక కాదనకు. హోమ్ వాళ్ళతో మాట్లాడాను. పిల్లలందరితో రేపు మాట్లాడి ఎల్లుండి ఆదివారం మనం వెళ్ళే ఏర్పాట్లు చేశాను. మనకు కావలసిన వస్తువులు, బట్టలు రేపు సర్దాలి అన్నాడు సుధాకర్. 



అంతావిని సుజాత కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి, తాము వెళ్ళిపోతే చిన్నపిల్లలతో తమ పిల్లలు ఎంత కష్టపడతారో అనుకొని. 



అనుకున్నట్లుగానే సుధాకర్ ఆదివారం రోజు తమ పిల్లలను, కోడలిని, అల్లుడినీ సమావేశపరిచి తాము వృద్ధాశ్రమానికి వెళ్తున్నట్లు చెప్పాడు. 
ఏం మామయ్యా, ఇక్కడ మీకు ఇబ్బంది గా వుందా? శామ్యూల్ అడిగాడు. 
అతనికి ఇంట్లో ఎలా జరుగుతోంది అని పని వివరం తెలియదు. ఆఫీస్ పని మాత్రమే అతని లోకం. 



అవును శ్యామ్యూల్. మేము మీ పిల్లలను చూసే ధ్యాసలో పడి మా ఆరోగ్యాలను చూసుకోలేక పోతున్నాము. ఇద్దరికీ విశ్రాంతి తక్కువవుతోంది. అందువల్ల ముందు మీ అత్తయ్యగారు చాలా నీరసంగా వుంటున్నారు. డాక్టర్ గారు విశ్రాంతి కావాలంటున్నారు అన్నాడు సుధాకర్. 



సరే మామయ్యా. మీకు అక్కడేమైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే ఇక్కడికి వచ్చేయ్యండి అని చెప్పి రూం లోనికి వెళ్ళిపోయాడు శామ్యూల్. 



అతను వెళ్ళే వైపు సుజాత నిర్లిప్తంగా చూసింది. 



అత్తయ్యగారికి బాగాలేక పోతే మందులు వాడుకోవాలి గానీ ఇలా ఇల్లొదిలి వెళ్తారా? అంది కోడలు నిష్టూరంగా. వాళ్ళు వెళ్ళిపోతే రేపట్నుంచి ఇంట్లో ఎంత ఇబ్బందీ అని కోడలు కంగారు పడుతోంది. 



నిజమే. కానీ మందుల దారి మందులదీ. మీ అత్తగారి ఆరోగ్యం దారి ఆరోగ్యందీ అయ్యింది కదా. మందులు వాడటమే కాదు. విశ్రాంతిగా కూడా వుండాలి అంటారు డాక్టర్ గారు. ఎదురుగా పిల్లలను చుస్తూ వాళ్ళ అవసరాలను తీర్చకుండా మీ అత్తగారు చూస్తూ కూర్చోలేరు. డాక్టర్ గారు స్థలం మార్పు కావాలన్నారు కూడా అన్నాడు సుధాకర్. 
ఏమ్మా! నీకు బాగా లేనప్పుడు మందులు వాడి విశ్రాంతి తీసుకోవచ్చుగా. ఎందుకిలా అందరినీ కంగారు పెడతావు? చెయ్యగలిగిన పనులే చెయ్యొచ్చు కదా? ఇప్పుడు చూడు.. అందరూ అన్నిపనులూ చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడాలో? అన్నాడు సుధీర్. 



అదేమిట్రా, అలాగంటావు? మీ పిల్లల పనులు మీరు చేసుకోలేరా! కొడుకువైపు వింతగా చూస్తూ అన్నాడు సుధాకర్. 



మేము ఇంట్లో అన్నీ పనులూ చేసి మళ్ళీ ఆఫీస్ కు వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది? అమ్మ కూడా వుంటే అందరం తలా ఒక పని చేసుకుంటాము కదా? విసుక్కుంటూ అన్నాడు సుధీర్. 



పనులు సరే. కొడుకు, కూతురూ వుండి కూడా వీళ్ళు వృద్ధాశ్రమానికి ఎందుకు వెళ్తున్నారూ?.. అని చుట్టుపక్కల వాళ్ళు మమ్ములను ఎంత చులకనగా చూస్తారు? మేము మీకేదో అన్నం పెట్టకుండా వేధిస్తున్నట్లు మీరు ఇల్లు వదిలి వెళ్ళి పోవడం ఏంటి? కోడలు కూడా విసుక్కుంది. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 2/3 - by k3vv3 - 13-04-2025, 09:12 AM



Users browsing this thread: 1 Guest(s)