11-04-2025, 05:03 PM
ఆప్యాయంగా ఆహ్వానించే వీధి అరుగు, గదులు, మధ్యలో విశాలమైన మండువ, వరండా, వెనుక వసారి, ఓ పెద్ద వంట గది, సువిశాలమైన ప్రాగణం. ఇంట్లోకి రమ్మని మనసారా స్వాగతించే చేతి పంపు కుళాయి.
పెద్ద పెద్ద మేడలు కోసం ఎగబడుతున్న ఈ రోజుల్లో, నాకీ పెంకుటిల్లు లాంటి ఇల్లు నిర్మించాలని ఉందని చెప్తే అందరూ వింతగా చూస్తారు. పాతకాలపు వాడనని హేళన చేస్తారు.
అయినా... మండువా లోగిళ్ళలాంటి ఇంటిని నిర్మించాలనేది నా చిరకాలపు వాంఛ!
ఇక అమ్మ తరుపు బంధువులు, వాళ్ళ పిల్లలతో ఇల్లంతా కళకళలాడుతుండేది. దాదాపు ఒక పదిహేను మంది వరకూ పిల్లలు, మా అల్లరి తట్టుకోవడం ఇంట్లో పెద్ద వాళ్ళందరికీ ఒకింత సవాలుతో కూడుకున్నదే. ఆ అల్లరిని అదుపు చేయడం ఎవరి తరమయ్యేది కాదు, ఒక్క ఆ హిట్లర్ కి (చిన్న మామయ్య) తప్ప. ఇక ఆ చిన్న మావయ్య పేరు (ఆది బాబు) వింటేనే ప్యాంట్లు తడిచేవి మాకందరికీ.
కానీ, అమ్మమ్మకి మాత్రం ఆ మాత్రం చూడముచ్చటగా ఉండేది. తను చెప్పిన కథలు, పాడిన జోలలు ఇప్పటికీ నన్ను అంటి పెట్టుకునే ఉన్నాయి.
పెద్ద, రెండో మావయ్యలదీ హోటల్. పెద్ద మావయ్యది ఎంటి దగ్గరే అయినా, రెండో మావయ్యది మాత్రం ఎక్కడో మైలు దూరాన సినీ టాకీస్ ఎదురుగా, అక్కడే వాళ్ళ ఇల్లు కూడా. ఆ పక్కనే చిన్న మావయ్య బడ్డీ దుకాణం.
మేమొ ఆ ఊరు వెళ్తే వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే వుండేవాళ్ళు. ఒక్కోసారి.. మేమంతా కలిసి అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడున్న టాకీస్ ఆ ఊరికి అదొక్కటే. టీవీ లో ప్రసారమయ్యే పాత సినిమాలే అందులో ఆడినా, మా సరదాల కోసం రెండో మావయ్య ఆ టాకీస్ కి పంపేవారు.
కొత్త సినిమాలైతే, వాళ్ళకున్న డీవీడీ ప్లేయర్లోనే చూసేవాళ్ళం.
ఆ రోజుల్లో అవి చాలా కొద్ది మందికి మాత్రమే ఉండేవి. చిరంజీవి ఇంద్ర సినిమా ఎన్ని సార్లు చూశామో లెక్కేలేదు.
హోటల్ పని ఒత్తిడి వల్ల అసలు ఇంట్లో పెద్ద వాళ్ళకి ఎక్కువ తీరిక ఉండేది కాదు. మధ్యాహ్నం మాత్రం అందరూ ఆ మండువా(హల్) లో సేదతీరుతూ, చిన్నా పెద్ధా తేడా లేకుండా ఆట పాటలతో సరదాగా గడిపేవాళ్ళం.
వేసవంటే ఎప్పుడో కానీ, వర్షించని మేఘాలు. ఆ మండువా తెర ద్వారా మేఘాల నుండి జారే వర్షపు జలపాతంలో తడుస్తూ గోల చేయడమంటే మాకొక మధురానుభూతది.
వడగళ్ల వానలో తడుస్తూ, ఆ ఐసు ముక్కలను పోటీపడి మరీ ఏరుకోవడం మహా సరదా...
వీధి అరుగుపై కూర్చుని , వచ్చి వెళ్ళే కార్లను లెక్కపెట్టడం సాయంత్రపు కాలక్షేపం.
శ్రీనుగాడి అమాయకత్వం, నాగ్గాడి చలాకి తనం, చిన్ని గాడి కష్ట పడే తత్వం, (అంతా నాకు అన్నయ్యలే).
పెద్ద బావ గడుసు తనం, చిన్నోడి తింగరితనం(పెద్ద మావయ్య గారి అబ్బాయిలు), ఫణిగాడి (రెండో మేనమామ గారి అబ్బాయి) స్నేహాభావం. పల్లవి, దీపక్ (హిట్లర్ కూతురు, కొడుకు) ల పెంకితనం, అల్లరితనం. ఫణి, వెంకీ(లక్ష్మక్క పిల్లలు) ల కల్లా కపటతత్వం...
మా దేవక్క (పెద్దనాన్న గారి అమ్మాయి) చేసే ఆవకాయ ఇడ్లీ గోరుముద్దలు, ఇందు అక్క నేర్పిన దాగుడు మూతలు, చిన్న బుజ్జక్క ఆడించే అష్ట చెమ్మా, పెద్ద బుజ్జక్క పంచిన మమకారం, లక్ష్మక్క చెప్పే ఊసులు, ఉన్న ఒక్క మరదలితో (రెండో మావయ్య గారి అమ్మాయి) మిగిలిన పిల్లలంతా ఆట పట్టిస్తుంటే సిగ్గుపడిన సరదా క్షణాలు ఎన్నో.. ఎన్నెన్నో...
పెద్దమ్మల ఆప్యాయతలు, పెదనాన్నల అనురాగాలు,
మేనమామాలతో సరదాలు, మేనత్తలతో వేళాకోళాలూ
వీటన్నింటికీ తోడు అమ్మమ్మ చూపే ఎనలేని గారాబం.
పొద్దస్తమాను మా అన్నదమ్ములకు (నాకు , ఆ చిన్ని గాడికి) ఆ మావయ్య ల హోటల్ లోనే చాకిరేవు సరిపోయేది. అరె! పాపం చెల్లెళ్ళు గార్ల పిల్లలు, ఎప్పుడో కానీ రారు, చుట్టం చూపుకు వచ్చారు! అని జాలి కూడా ఉండేది కాదు వాళ్ళకి. పొద్దు పొద్దున్నే లేపేవారు. నేనింకా పర్లేదు వేసవి లో మాత్రమే, చిన్ని గాడు(పెద్దమ్మ గారి అబ్బాయి) కాలేజ్ జీవితం అంతా, అక్కడ దానికే సరిపోయింది. అంత చేసినా, చిన్న తప్పు చేస్తే కసిరేవారు, తిట్టేవారు. అప్పట్లో అవి భయాన్ని, కోపాన్ని కలిగించినా, ఈ రోజు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటున్నాం అంటే అది వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే. వాళ్ళ పడ్డ ప్రతి కష్టం మాకు ఆదర్శమే.
పెద్ద మావయ్య దగ్గర నుండి అలవరుచుకున్న సంస్కారం.
నడి మావయ్య నేర్పిన సహనం, ఓపిక.
చిన్న మావయ్య పెట్టిన క్రమశిక్షణ.
అందరికీ మేనమామ పోలికలోస్తాయి అంటారు కదా!!, మాకు మాత్రం గుణ గణాలు కూడా వారు పెట్టిన భిక్షే.!
ఇక అక్కడ నెల్లాళ్ళు పాటు జరిగే గ్రామ దేవత పల్లాళ్ళమ్మ ఉత్సవం ఒక విశిష్టత. జాతరలో దర్శనమిచ్చే బొమ్మల కొలువులు, సర్కస్లు, రంగుల రాట్నాలు, మిఠాయి దుకాణాలు, ఊరేగింపులు, అబ్బో చెప్తుంటే తనివి తీరదు.. మళ్ళీ అక్కడికి వెళ్ళినా.. ఆ రోజులైతే తిరిగి చేరుకోలేము.
పిల్లల్లో ఎవరికేం కొన్నా ఒక్కటే కొనాలి, లేకపోతే ఒక మహా యుద్దమే. ప్రశాంతత తో కూడిన ఆ ఇల్లు కాస్తా వేసవిలో యుద్ద వాతావరణాన్ని తలపించేది మా అల్లరితో.
ఇంతలో జూన్ రెండో వారం రానే వచ్చేది,
సెలవులు అయిపోయాక అక్కడి వాతావరణాన్ని, అమ్మమ్మని విడిచి రావాలంటే మా అందరి కళ్ళు, కన్నీటి సంద్రంలా తడిచి ముద్దయ్యేవి. తనని పట్టుకుని బోరున విలపించేవాల్లం. మా వేదన విని అమ్మమ్మతో పాటు ఆఖరికి ఆ ఆకాశం కూడా ఓర్చుకోలేక ఆ కాలంలోనే వర్షాన్ని సృష్టించి తమ గోడును వెళ్ళబుచ్చుతున్నయా అన్నట్టనిపించేది.
ఇంకా ఎన్నో, ఎన్నెన్నో చెరపలేని మధురానుభూతులు మరుపురాని జ్ఞాపకాలుగా ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉన్నాయి.
అందుకే అమ్మమ్మగారిల్లు ఎప్పటికీ "ఓ భూలోక స్వర్గధామమే."

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ