Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - "అమ్మమ్మ వ్యధ "
#2
"అమ్మమ్మగారిల్లు"
[Image: image-2025-04-11-170055466.png]
 ఆప్యాయత   అనురాగం   మమకారం 

"ఒరేయ్ పండు.. లేరా!
బారెడు పొద్దెక్కిన ఇంకా మొద్దు నిద్ర వదలవు".
అని అమ్మ పిలుపు నా కమ్మటి నిద్రలోకి చేరుకుంది.
"అబ్బా!! కాసేపు ఉండమ్మ", అని నేను బద్దకంగా...
"ఏదో కాలేజ్ ఉన్నట్టు అప్పుడే లేపుతావు, నిన్నటి నుండి కాలేజ్ కి వేసవి సెలవలు కూడా ఇచ్చేశారు కదా వాడికి, కాసేపు పడుకోని వాడిని" అని నాన్న.
"హా.. మీదెం పోయింది! ఎక్కడో గోదారి అవతలకి వెళ్ళాలి మా పుట్టింటికి. సుమారు నాలుగైదు గంటల ప్రయాణం భానుడి ప్రతాపం తట్టుకుని, బస్సులు మారుతూ ఉరుకులు పరుగులతో వెళ్ళాలంటే, నొప్పి వీళ్ళని తీసుకెళ్ళి ఆక్కడ దింపి వచ్చే నాకు తెలుస్తుంది, మీకేం మీరు బాగానే మాట్లాడతారు.
నిన్నటి వరకూ ఎప్పుడెప్పుడు తీసుకెళ్తావ్ అని పేచీ పెట్టీ మరీ విసిగించాడు. ఇప్పుడేమో చడీ చప్పుడు లేకుండా ఎలా పడుకున్నాడో?. నాకేం మీకిష్టం లేకపోతే ఇందులో ఇక నా బలవంత మేముంది". అని అమ్మ
"అబ్బబ్బా ఇక చాలు ఆపవే నీ నస.." అని నాన్న
చర్చంత విన్న నేను నిద్ర లో నుండి ఉలిక్కి పడి లేచి, కింద మంచం వైపు చూశాను. దాని పై చెల్లి లేదు, మంచం కాలిగా ఉంది. ఆదమరుపుగా పక్కకి తిరిగే లోపు, అది వేరే గదిలో నుండి వస్తూ నుండి అప్పటికే ప్రయాణానికి సిద్దమవుతూ కనిపించింది.
"ఏరా..!! నువ్వు రావా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి" అని అది,
"వాడు రాడేమో? మీరు వెళ్లి రండి" అని నాన్న. అసలే నన్ను నిద్ర లేపకుండా అమ్మతో తిట్టించింది కాక, వాళ్ళ వెటకారపు మాటలకి, అప్పటికే నెమ్మదిగా తెరుచుకుంటున్న నా కళ్ళు రెండూ పెద్దవయ్యాయి. చూసింది చాల్లే! ఇక వెళ్లి తొందరగా ప్రయాణమవ్వు అన్నట్టు వాళ్ళ చూపులు.
బస్ కూడా హార్న్ కొడుతూ ఊళ్ళోకి వెళ్ళింది. దాంతో అమ్మ "ఇక వీడితో పెట్టుకుంటే రోజు ప్రయాణం సాగినట్టే." అన్న మాటలు నా చెవులను తాకాయి. అది తిరిగి వచ్చే లోపు నేను రెఢీ అవ్వాలి. లేదంటే రోజు బస్ మిస్ అయితే, మళ్లీ రేపటికి వాయిదా పడుతుంది ప్రయాణం అన్న భయం నాలో.
అదరబాదరా గా ఎలానో రెఢీ అవ్వక తప్పేదే కాదు.
అంతిష్టం మాకు మా అమ్మమ్మగారి ఊరు వానపల్లి అంటే.
అసలు మాకు వేసవంటే ఊరు, అక్కడికి వచ్చే అమ్మ తరుపు బంధువులు. నాకు, మా చెల్లికి ప్రతీ వేసవి విడిది, స్వర్గాన్ని తలపించే ప్రదేశమే.
అమ్మ చెప్పినట్టు ఎక్కడో గోదారి అవతల,
తూర్పు గోదావరి జిల్లా వానపల్లి.
బస్సు ఎక్కింది మొదలు, అక్కడికి చేరేవరకు ఎప్పుడెప్పుడు చేరుతామా అన్న ఆలోచనలతోనే ప్రయాణం కొనసాగేది.
పదుల సంఖ్యలో ఊళ్ళని, పట్టణాలను దాటుకుంటూ వెళ్లాల్సి వచ్చేది.. అక్కడుండే పరిసరాలలో పట్టణాల్లోనీ మేడలు, పల్లెల్లో కాపుకొచ్చిన పంట, పాడి పశువులు, అరటి తోటలు, ఇటుకల బట్టీలు, ఫ్యాక్టరీలు, వాగులు - వంకలు, గుళ్ళు - గోపురాలు ఒకటా రెండా..ఎన్నో భూలోక అందాలన్నీ, మా రెండూళ్ళ మధ్యలోనే ఉన్నట్టనిపించేవి.
వెళ్లి వచ్చే ప్రతిసారీ పెరవలి హనుమంతుని భారీ కాయ విగ్రహానికి, బస్సు అద్దాల నుండి మేము మొక్కని కోరికలంటూ లేవు. ఇక సిద్ధాంతం రాగానే గోదారి బ్రిడ్జి పై వెళ్తుంటే, గోదావరి నీటిపై నుండే వీచే చల్లటి గాలి బస్సు కిటికీల ద్వారా మా మనసు లోగిళ్ళలో దూరి కితకితలు పెడుతుంటే అనుభూతి వర్ణించగలమా..??
అల.. బస్సు కిటికీ అద్దాలనుండి చూస్తూ ప్రతీ అనుభూతిని ఆస్వాదిస్తూ సాగేది మా ప్రయాణం.
అమ్మమ్మ వాళ్ళ ఊరి పొలిమేర రాగానే, ప్రతి గడప చూస్తూనే ఉండేవాళ్ళం. వాళ్లిల్లు రోడ్డు పక్కనే, అందరి ఇల్లుల్లు (పెంకుటిల్లు) ఒకేలా ఉండడం వల్ల మాకు కనుక్కోవడం కొంచెం కష్టంగానే అనిపించినా.
అమ్మకి పుట్టినిల్లు కాబట్టి తనకి సునాయాసమే.
ఆటో లోనుండి దిగగానే విశాలమైన పెంకిటింటిని చూసి మనసు తరించి పోయేది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM



Users browsing this thread: