Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#67
 సుధాకర్ సాయంత్రమే అనుకున్నాడు, సుజాత రోజు లాగా లేదు అని. నుదురు తాకి చూసి ఒక టాబ్లెట్ ఇచ్చి ‘‘జ్వరం వుంటే అమ్మాయితో చెప్పొచ్చుగా’’ అన్నాడు. వాళ్ళు చాలా బిజీ గా వున్నారు అంది సుజాత పడుకుంటూ. అమ్మతో రెండు ముక్కలు మాట్లాడలేనంత బిజీ కూతురు అనుకుంటూ నిట్టూర్చాడు సుధాకర్.



 రాత్రి సుజాత నిద్రపోయినా సుధాకర్ చాలాసేపు మేలుకొని వున్నాడు. ఇలా ఎన్ని రోజులు జరగాలి? తమకు విశ్రాంతి ఎక్కడా? తమ ఆరోగ్యాలు క్షీణిస్తూన్నాయి. కొడుకు, కూతురు తమ పనులు జరిగితే చాలన్నట్లు ఉన్నారు. తమ ఇంట్లో వుండకుండా వీళ్ళు ఎక్కడికీ పోలేరని వాళ్ళ ధైర్యం. పెద్దవాళ్ళ గురించి ఆలోచించే సమయం వాళ్ళకు లేదు.



 అందుకే తమకు తామే తమ గురించి ఆలోచించాలి. ఇన్ని రోజులు తమ పిల్లలకు సహాయం చెయ్యడం తమ బాధ్యత అనుకున్నారు. అది వాళ్ళకు అలుసుగా అయ్యింది. ఎవరికోసం చేస్తారన్నట్లు అల్లుడు, కోడలు అనుకుంటేకొడుకు, కూతురు తమ పిల్లలకు చేయడం కోసమే తల్లితండ్రులు ఉన్నారన్నట్లు అనుకుంటూ ఉన్నారు.



 ‘అవసరమైతే సర్వెంట్లను, ఆయాలను డబ్బిచ్చి ఏర్పాటు చేసుకుంటారు. లేకుంటే పిల్లలను క్రెచ్ లలో చేర్చుకుంటారులే అని సుధాకర్ మనసు దిటవు చేసుకొన్నాడు. ఇక్కడి నుండి తాము నిష్క్రమించడం ఒక్కటే తమ ఆరోగ్యం బాగుపడటానికి మార్గంగా కనిపిస్తోంది అని నిర్ణయించుకుని కళ్ళు మూసుకున్నాడు.



 రెండురోజుల తరువాత మార్కెట్ లో కూరలు కొంటున్న సుధాకర్ కు సోమశేఖర్ గారు పళ్ళు కొనుక్కుంటూ కనిపించారు. మొన్నటి నుంచీ సుధాకర్ మనసులో ఉన్న సందేహం తీర్చుకోవాలని అనిపించి అతనితో పాటుగా ఆశ్రమానికి వెళ్ళాడు.



 అక్కడి వాతావరణం ఆశ్రమంలో లాగా అనిపించలేదు. మన ఇంట్లో మనుషులు తిరుగుతున్నట్లుగానే మామూలుగా వుంది.



 అప్పుడు సోమశేఖర్ గారు ఇలా చెప్పారు. 
 “ మా ఆశ్రమంలో మామూలుగా కొడుకులు, కోడళ్ళ దగ్గర ఉంటే ఉండే మానసిక సంఘషణలు, ఉండవు. ఎత్తిపొడుపు మాటలు, విసుక్కోవడాలు లేవు. ఆదరణ పూర్వకమైన చిరునవ్వులు ఉన్నాయి. కాకపోతే మనం డబ్బుతో ఇక్కడి సౌకర్యాలను కొనుక్కోవాలి అన్నాడు సోమశేఖర్.



 పాలిపోయిన మొహం తో చూశాడు సుధాకర్. అవును. ప్రతి రోజూ స్వంత పిల్లలే వాళ్ళ పనులు జరగడం కోసం తల్లితండ్రులను, అత్తమామలను ఈసడించుకొని మాట్లాడుతూ ఉంటే గుండెల్లో పొంగే దుఃఖం బైటికి కనిపించకుండా అదిమి పెట్టుకొని పిల్లల దగ్గరే కుంగిపోతూ బ్రతికే కంటే ఇంతమంది ఫ్రెండ్స్ దగ్గర వుండటం చాలా సంతోషంగా వుంటుంది అన్నాడు మళ్ళీ.



 ‘నిజమే. ప్రతిరోజూ రాత్రి కాగానే ఉదయం నుంచీ వాళ్ళ చేత పడిన మాటలన్నీ కళ్ళనీళ్ళతో గుర్తుచేసుకొని పొగిలి, పొగిలి ఏడ్చేకంటే అదేమేలు కదా. నా కంటే సుజాత ఎక్కువ మాటలు పడ్తోంది అనుకుంటూ సుధాకర్ ఓల్డేజ్ హోం లోపలికి సోమశేఖర్ వెంట నడిచాడు, అక్కడ ఎలాంటి సౌకర్యాలున్నాయో చూడటానికి. 



 అంతా చూసిన తరువాత నలుగురితో కలిసిపోతూ అందరూ ఇంట్లో లాగే మసలుతూ ఉండటం గమనించి సంతోషమే వేసింది. కుటీర పరిశ్రమల లాగా కొన్ని పనులు కూడా ఇష్టమైతే చేసుకోవచ్చు. దానివల్ల కొంత సంపాదన కూడా ఎవరికి వారే చేసుకోవచ్చు. సేల్స్ ఆశ్రమం వాళ్ళే చూసుకుంటారు. ఇది కూడా నచ్చింది సుధాకర్ కు. అయినా మనమేం ఎక్కువ రోజులు ఆశ్రమంలో ఎక్కువరోజులు ఉండటం లేదు కదా! అందువల్ల డబ్బు గురించి ఇబ్బంది ఉండదులే అనుకున్నాడు.



===================================================================
ఇంకా ఉంది...
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 1/3 - by k3vv3 - 06-04-2025, 01:04 PM



Users browsing this thread: 1 Guest(s)