06-04-2025, 01:03 PM
“ఆ మాట నిజమే కానీ…ఒక మూడేళ్ళల్లో ఇద్దరూ కాలేజ్ కు వెళ్ళే వాళ్ళవుతారు. నువ్వింక రెస్ట్ గా నీ కెరీర్ పనులు చేసుకోవచ్చు. ఈ ‘పిల్లలు కనడం ‘ అనే పని పూర్తవుతుంది. అందులోనూ మీ అత్తగారు ఉన్నప్పుడే మన పని అవ్వాలి. లేదంటే ఇంత చాకిరీ చెయ్యాలంటే పనిమనుషులు చాలా డబ్బు అడుగుతారు. అందులోనూ ఒకరు చాలరు. ఇద్దరిని ఏర్పాటు చేసుకోవాలి. అందుకని ఆమె తిరుగుతూ ఉన్నప్పుడే నీ పని పూర్తి చేసుకో” అని గీతోపదేశం చేసింది.
సురేఖ ఆ విషయాన్ని సుజితకు సింపుల్ గా చెప్పింది.
“సుజీ, మన కెరీర్ కూడా చూసుకోవాలి కదా! మన పిల్లలను మూడు సంవత్సరాల వరకు మనం దగ్గరుండి చూసుకుంటే వాళ్ళు కాలేజ్ కు వెళ్ళేటప్పటికి మనం మన కెరీర్ లో బిజీ అవ్వొచ్చు. అందుకే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి నేను డాక్టర్ సలహా కోసం వెళదాం అనుకున్నాను. నువ్వూ వస్తావా?” అంది సురేఖ.
సుజిత కూడా తనతో పాటూ ప్రెగ్నంట్ అవుతే మొదటి సారి లాగే రెండవసారి కూడా అత్తగారు ఇద్దరికీ సహాయంగా వుంటారు. తను ఒకతే ప్రెగ్నెంట్ అయితే తనకు సరిగా చెయ్యదేమో అని సురేఖ ఆ రకంగా చెప్పింది.
సునీతకు కూడా ఈ పద్ధతి నచ్చింది.
“సరే. నేను కూడా వస్తాలే. నేనూ ఎం.బి. ఏ. చెయ్యాలి. పిల్లలకు ఒక రెండు సంవత్సరాలు వస్తే వాళ్ళు కాలేజ్ కు వెళ్తారు. నేను చదువుకోవచ్చు” అంది సుజిత.
అలా సురేఖ, సుజాత శ్రమను దోచుకోవడానికి సుజితను వెపన్ లాగా ఉపయోగించుకుంది. ఫలితంగా సుజాత నంద్యాల ప్రయాణం మళ్ళీ సుదీర్ఘంగా వాయిదా పడింది.
ఇంకో సంవత్సరానికి ఇద్దరూ ప్రసవించి నామకరణాలు జరిగాయి. ఇప్పుడు సుధాకర్ కు కూడా ఇంతకు ముందు లాగా ఆరోగ్యం సహకరించక పోవడం తో నంద్యాలకూ, బెంగుళూర్ కు ఎక్కువ తిరగలేక బెంగుళూర్ లోనే వుంటున్నాడు.
కానీ అది కూడా ఒక సమస్యే అయ్యింది. కోడలు ఇంటి ఖర్చులు లెక్కపెట్టి, గొణగటం మొదలుపెట్టింది.
“అదేమిటీ? సరుకులు తెచ్చి ఇరవై రోజులేగా అయ్యిందీ. అప్పుడే ఎలా అయిపోతాయి?” అంటూ సుజాతను నిలదీసింది.
“అవును సురేఖా. నెలాఖరు లోపల మళ్ళీ కొంచెం సరుకులు తెప్పించాలి. అన్నీ కొంచెం కొంచెమే వున్నాయి” అంది సుజాత.
“అదే నా ప్రశ్న. పోయిన నెల లాగే ఈ నెల కూడా తెప్పించాను” అంటూ విసుక్కుంది.
సుజాత బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉండిపోయింది.
వింటున్న సుధాకర్ కు ఈ సారి తను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం వల్ల సరుకులు అయిపోయాయని కోడలు అంటోందని అర్థం అయ్యింది.
అప్పుడప్పుడూ కూతురి ఇంట్లో కూడా సుధాకర్ భోజనం చేస్తున్నాడు. మరి అక్కడ కూడా వాళ్ళకు కోపంగా వుందేమో అనే ఆలోచన కూడా వచ్చింది.
ఈ సారి ఆదివారం సోమశేఖర్ గారు వాకింగ్ కు వెళ్ళినప్పుడు సుధాకరే అడిగాడు.
“మీరు వచ్చి కొడుకు ఇంట్లో వుంటారుకదా? అప్పుడు ఇంటి ఖర్చు పెరిగితే వీళ్ళు ఇబ్బంది పడతారాండీ?” అని.
ఈ సారి సుధాకర్ మాటలకు అతను పకపకా నవ్వాడు. “పెళ్ళయిన తరువాత మన పిల్లలు కూడా మనకు పరాయి వాళ్ళే. వాళ్ళ ప్రేమను మనం డబ్బుతో కొనుక్కోవాలి” అన్నాడు నవ్వు ఆపి.
సుధాకర్ అతని వైపు అర్థం కానట్టు చూశాడు. “వాళ్ళకు కావలసిన వస్తువులు వెండి బంగారాలు, బట్టలు లాంటివి గిఫ్ట్ గా ఇస్తూ వుండాలి అప్పుడప్పుడూ. మన దగ్గర డబ్బుందని వాళ్ళకు తెలుసుగా. ఆ డబ్బు మొత్తం ఇవ్వమని అడగలేరు. మనం వాళ్ళకు భారమని వాళ్ళు బాధ పడకూడదు” అన్నాడు నెమ్మదిగానే ఒకింత బాధగా కూడా.
సుధాకర్ ‘అవును. నిజంగా ఇది మంచి పనే’ అన్నట్లు తల వూపాడు.
ఈ మధ్యనే మహానంది దగ్గర వున్న రెండెకరాల పొలం అమ్మారు. ఆ డబ్బు సుధాకర్ దగ్గరే ఉంది. బహుశా ఆ డబ్బు కొడుక్కు ఇచ్చెయ్యలేదని కోడలికి కోపంగా వుందేమో. ‘అది మనసులో పెట్టుకొని ఇలా సాధిస్తోందా’ అనిపించింది కూడా.
అందుకే తరువాతి నెలలో వచ్చిన పండుగకు అందరినీ బట్టలు తీసుకొమ్మని చెరి పదివేలు ఇస్తే కోడలు సంతోషించింది. అల్లుడు మొహమాటంగా ‘ఎందుకండీ?’ అన్నాడు.
అలా పనులు చేస్తూ కూడా పండుగా, పబ్బాలకు ఎదురు డబ్బులు ఇస్తూ రోజులు నెట్టుకొస్తున్నారు. ఈ చిన్న పిల్లలకు కూడా సంవత్సరం నిండబోతోంది.
ఒకరోజు ఉదయం సుజాత జ్వరంతో లేవలేక పోయింది. పిల్లల ఏడుపులు, ఆఫీస్ కు వెళ్ళే హడావిడి లతో ఇల్లు కంగాళిగా అయ్యింది. సుధాకర్ సుజాతను హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాడు. “మామూలు జ్వరమేగా. ఈ రోజు ఇంట్లో టాబ్లెట్ వేద్దాం” అంది కోడలు. అయినా సుధాకర్ తీసుకొని వెళ్ళాడు. డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చి, బాగా రెస్ట్ గా కూడా వుండమని చెప్పాడు. ఇక ఇంట్లో తకధిమితక అన్నట్లుగా ఉండింది ఒక వారం రోజులు.
మళ్ళీ మామూలే. సుజాతకు జ్వరం కొంచెం నెమ్మదించగానే అన్ని పనులూ చేయడం మొదలు పెట్టింది. చెయ్యొద్దని ఎవరూ చెప్పడం లేదు. అలా చెయ్యడం సుజాతకు మామూలయి పోయింది. అందరూ కూడా అలాగే అలవాటై పొయ్యారు.
ఆ రోజు మళ్ళీ సుజాత ఒళ్ళు బాగా వేడిగా వుండి కళ్ళు మూతలు పడుతున్నట్లుగా ఉంటే, నెమ్మదిగా రాత్రి వంటింటి పనులు ముగించుకొని వచ్చి, దిండుకు జారిగిలబడి మంచం మీద కూర్చుంది.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ