Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#65
ఇక సుజాత అక్కడే ఉండిపోవలసి వచ్చింది. చిన్న పిల్లల పనులతో ఒక్క క్షణం తీరికలేకుండా గడుస్తోందామెకు. ఒక్కోసారి నిద్ర కూడా తగ్గుతోంది. కూతురూ, కోడలూ తమకు కావలసినవి సరిగ్గా ఇవ్వలేదని విసుగును ప్రదర్శించినా పట్టించుకోనట్లు నవ్వు మొహం తోనే తిరుగుతూ ఉండేది. 
 ఇదంతా చూస్తే సుధాకర్ కు కొంచెం ఇబ్బందిగా ఉండేది. సుజాత మొదట్నుంచీ ఎవరైనా ఏమైనా అన్నా తల వంచుకుని పోయే రకం. ఎదిరించి వాదించదు, ఎవరికీ చెప్పదు. అది వీళ్ళు ముగ్గురూ అలుసుగా తీసుకొని సుజాతకు పనిమనిషికి చెప్పినట్లు పనులు చెప్తున్నారు. శామ్యూల్ ఎవరితో పెద్దగా మాట్లాడడు, ఎవరికీ పనీ చెప్పడు.



 సుజాత ఇబ్బందిని ఎలా తప్పించాలా?. అని సుధాకర్ బాధపడ్తున్నాడు. పైగా సుధాకర్ నంద్యాల నుండి వచ్చినప్పుడు సుధాకర్ కూడా సుజాత లాగే పని చేస్తున్నాడు.



 ఒకరోజు సాయంత్రం అమ్మా, ఏంటిది? వీడి బట్టలు అన్నీ కుప్పలాగా ఇలా మడతేశావు? అన్నీ షర్ట్స్, టి.షర్ట్స్, ఒన్ సీ లు, రాంపర్స్, ప్యాంట్స్, నిక్కర్లు, డ్రాయర్ లు, ఇన్నర్స్ అన్నీ విడి విడిగా పెట్టాలి కదా? అని సుజిత అరుస్తోంది. తన ఎనిమిది నెలల పిల్లవాడి బట్టలు చూస్తూ. 



 సుజాత పరుగు పరుగున వచ్చి, సుజిత దగ్గర నిలబడింది. అన్నీ జానెడు బట్టలు. ఏది ఏమిటో కొంచెం త్వరగా అర్థం కాదు. అన్ని రకాలూ విడివిడిగా గా పెట్టాలంటే స్పేస్ చాలదు. కానీ సుజాత ఇవేవీ కూతురితో చెప్పదు. మౌనంగా వినింది.



 “ సారి సరిగ్గా పెడతాలే సుజీ అని చెప్తూ పిల్లవాడి బట్టలు మార్చేసి వెళ్ళింది.



 రాత్రి కోడలు పాపకు పెట్టే అన్నంలో ఒక స్పూన్ క్వినోవా వెయ్యాలి కదండీ అంది .ఎందుకు వెయ్యలేదు అన్నట్లు. 



 ఎనిమిది నెలల పాప. రెండు రోజులనుంచి అజీర్ణంగా ఉందని కోడలు అనుకుంటూ ఉందని ఈరోజు అన్నం కొద్దిగానే చేసింది. కొంచెం లో క్వినోవా ఎందుకులే అనుకుంది.



 “రేపు వేస్తాలే సురేఖా. పూటకు అన్నం లో చారు కలిపి పెడతాను అంటూ వెండి గిన్నెలో చారన్నం కలిపి అందులో కొంచెం బెల్లం ముక్క, కొంచెం నేతి చుక్క వేసి పాపకు తినిపించింది. 
 ఇదంతా చూస్తున్న సుధాకర్ మా అమ్మ కూడా సుజాత ను ఇలా మాటలు అనలేదు అనుకొని దిగులు పడ్డాడు. అపార్ట్మెంట్ బైట వాచ్మెన్ తొట్లల్లో ఉన్న చెట్లకు నీళ్ళు పెడుతుంటే చూస్తూ. కొంతమంది చెట్ల పూలు కోసుకుంటూ ఉన్నారు.



 అదే సమయంలో సోమశేఖరం గారు చెట్లకు ఎరువులు తెచ్చి ఇచ్చారు వాచ్మెన్ కు. సుధాకర్ ను చూసి పలకరింపుగా నవ్వాడు. 



 “ఎప్పుడొచ్చారు? అన్నాడు సుధాకర్.



 “మేమొచ్చి ఇరవై రోజులయ్యింది అన్నాడతను కుర్చీలో కూర్చుంటూ.



 “అవునా! అన్ని రోజులనుంచీ కొడుకు దగ్గరే ఉన్నారా? అన్నాడాశ్చర్యంగా సుధాకర్ కూడా కూర్చుంటూ, ఆదివారం మాత్రమే ఉంటామని ఇంతకుముందు చెప్పింది గుర్తొచ్చి.



 “అవును పండక్కు వచ్చాము. ఇంకా వెళ్ళలేదు. ఆరోగ్యం బాగుంటే అప్పుడప్పుడూ ఇలా ఒక నెల వుంటాము. కొంచెం ఇబ్బంది అనిపించినా వెంటనే వెళ్ళి పోతాము, మాత్రం మొహమాటపడకుండా. రెస్ట్ గా వుంటాము. మన ఆరోగ్యం, సంతోషం మనమే చూసుకోవాలి. మన గురించి ఆలోచించే టైం మన పిల్లలకు లేదు. అందుకే నిర్ణయం. అయితే ఇదంతా ఎవరికీ చెప్పం. మీరొక్కరికే చెప్తున్నా. ఎందుకంటే మీరూ నాలాగే ఇబ్బందుల్లో ఉన్నారని అనిపించింది అన్నాడు సోమశేఖర్.
  మాటలకు సుధాకర్ మొహం లో మళ్ళీ బాధ కనిపించింది. కానీ నోరు తెరచి ఏమీ చెప్పలేడు.
 “సరే. సరే. మీరేం చెప్పకున్నా నాకర్ధమయ్యింది. జాగ్రత్తపడండి, చాలు అంటూ అతను వాచ్మెన్ దగ్గరకు లేచి వెళ్ళాడు.



 సుధాకర్ సాలోచనగా అతను వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు. 



 తరువాత ఒక రోజు సుజాతతో మనం కొద్దిరోజులు నార్త్ ఇండియా టూర్ వెళ్ళి వద్దామా? అన్నాడు.



 “అమ్మో. ఇప్పుడు టూరా? చిన్న పిల్లలతో వీళ్ళు చేసుకోలేరు కదా? అంది ఆశ్చర్యంగా.



 “ఒక పది రోజులు వెళ్ళి వద్దాము. ఫరవాలేదులే అన్నాడు సుధాకర్.



 పిల్లలకు నాలుగోనెల వున్నప్పుడు వీళ్ళిద్దరూ సినిమాకు వెళ్ళారని కోడలు ఎవరిగురించో మాట్లాడినట్లు ఎగతాళి మాటలు మాట్లాడిన విషయం గుర్తొచ్చింది సుజాతకు.



 కూతురు ఇంట్లో చిన్న పిల్లలతో మేము అవస్థ పడుతుంటే నువ్వు హ్యపీగా సినిమా కు ఎలా వెళ్ళావమ్మా? అని అడిగింది.



  విషయం సుధాకర్ కు కూడా చెప్పలేదామె. కానీ మళ్ళీ ఇంకోసారి సినిమాకు పిలిచినప్పుడు వద్దని చెప్పేసిందామె.



 అది గుర్తొచ్చింది సుజాతకు.
 అందుకే వద్దు. వద్దు. పిల్లలు కొంచెం ఎడపిల్లలు కానివ్వండి. కనీసం వాళ్ళకు ఒక సంవత్సరం నిండితే అప్పుడు మనం సినిమాకేకాదు, నంద్యాలకే వెళ్ళవచ్చు అంది నిక్కచ్చిగా.



 సుధాకర్ ఇంకేమీ మాట్లాడలేకపోయ్యాడు.
 అలా రోజులు గడిచిపోతూ పిల్లలకు ఫస్ట్ బర్త్ డే జరిగేటప్పటకి ఒక వారం తేడాగా వీళ్ళిద్దరూ రెండవసారి గర్భవతులు అయినట్లు డాక్టర్ రిపోర్ట్ వచ్చింది. నిజానికి పిల్లలకు మూడవ సంవత్సరం వచ్చేవరకు ఇప్పుడు అమ్మాయిలు తరువాతి గర్భం గురించి ఆలోచించడం లేదు. కానీ కోడలి అమ్మగారు 11 నెలలో పిల్లలకు పుట్టువెంట్రుకలు తీసిన ఫంక్షన్ కు వచ్చినప్పుడు సురేఖకు ఒక ఉపాయం చెప్పింది.



 ఆమె దగ్గరికి మనవడు పాక్కుంటూ వచ్చాడు. వీడు ఇంక నడిచేస్తాడు. వీడికొక తమ్ముడో, చెల్లెలో పుడితే నీ పని పూర్తవుతుంది అంది.



 “అదేంటీ? వీడికి థర్డ్ ఇయర్ రావాలి కదా!? అంది సురేఖ ఆశ్చర్యంగా.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 1/3 - by k3vv3 - 06-04-2025, 01:00 PM



Users browsing this thread: 1 Guest(s)