Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#64
మా మనసు చెప్పిన తీర్పు - 2
మా మనసు చెప్పిన తీర్పు - [font=var(--ricos-font-family,unset)]2/3 - [/font]



సుజాత వెళ్ళిన తరువాత ఒక వారం రోజులకు కోడలు కూడా గర్భవతి అని తెలిసింది. ఒక పదిరోజుల తరువాత సుధాకర్ కూడా పిల్లల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ సుజాత తలమునకలయ్యే పనులల్లో ఉంది. రెండు ఇళ్ళల్లో ఇద్దరు గర్భవతులను కూర్చోబెట్టి చేసి పెడుతోంది. సంతోషంగా వాళ్ళకు జాగ్రత్తలు చెప్తూ యాభై సంవత్సరాల వయసులో గిరగిరా తిరుగుతోంది.



 ఒక రెండు రోజులకు సుధాకర్ కు అర్థమైంది. సుజాత కూతురినీ, కొడలినీ వదిలి రాలేని పరిస్థితులలో ఉందని. అందుకే అప్పట్నుంచీ సుధాకర్ నంద్యాలకు, బెంగుళూర్ కు వారానికీ, పదిరోజులకూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు.



  సారి వచ్చినప్పుడు సుధాకర్ ఒక విషయం గమనించాడు. నెలలు నిండిన గర్భవతులు ఇద్దరూ అపార్ట్మెంట్ బయట నెమ్మదిగా వాకింగ్ చేస్తున్నారు గానీఇంట్లో ఎప్పుడూ సోఫాలోకూర్చోనో, బెడ్ మీద పడుకొనో ఉంటున్నారు, రెస్ట్ పేరుతో. సుజాత రెండు ఇళ్ళల్లోకీ పరుగులు పెట్టీ వారికి సేవలు చేస్తోంది. 



 సుధాకర్ నంద్యాల నుంచి రాగానే సాయంత్రం నాన్నా, నా బెడ్ కొంచెం విదిలించి బెడ్షీట్, పిల్లో కవర్స్ మారుస్తావా? అంది కూతురు సుజిత. వింటున్న శామ్యూల్ ఏమీ మాట్లాడలేదు. ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు.



 “అలాగే మారుస్తాలే అన్నాడు సుధాకర్. ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో పని చేశాడు. 



 “అదేమిటి నాన్నా, మ్యాచింగ్ కవర్స్ వెయ్యాలి కదా? అంది మొహం విసుగ్గా పెడ్తూ.
 సుధాకర్ ఏమీ మాట్లాడలేక పొయ్యాడు.



 రాత్రి కొడుకింట్లోకి వెళ్ళినప్పుడు సుధీర్ నాన్నా, రోజు పని మనిషి రాలేదు. నేను గిన్నెలు కడిగాను. నువ్వు వాటిని సర్దిపెడ్తావా అన్నాడు. 



 కోడలు సోఫాలో కూర్చొని టి.వి. చూస్తోంది. పెడతాలే అన్నాడు సుధాకర్. అతను ఓపిగ్గా బుట్టెడు గిన్నెలూ రాక్ లలో సర్ది పెట్టాడు. 



 కానీ ఒక పది నిముషాల తరువాత సుధీర్ వచ్చి ఏంటి నాన్నా ఇది. చిన్న ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్సన్నీ రాక్ లో కుప్పలాగా పోసేశావు అన్నాడు విసుక్కుంటూ.



 సుధాకర్ ఏమీ చెప్పలేకపోయాడు. అలా సుజాతతో పాటు సుధాకర్ కూడా వాళ్ళకు సహాయం చేసేవాడు. అయినా వాళ్ళకు సంతోషం లేదు.



 ఆరోజు ఉదయం సుధాకర్ అపార్ట్మెంట్ బైట వరండాలో పిట్ట గోడను ఆనుకొని నిలబడి రాత్రి జరిగిన విషయం ఆలోచిస్తూ ఉండగా లిఫ్ట్ దిగి వస్తూ సోమశేఖర్ గారు కనపడ్డారు. అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. పోయిన ఆదివారం రోజు ఇక్కడే కలిశాడతను. తమ కొడుకు, కోడలు థర్డ్ ఫ్లోర్ లో ఉంటారని చెప్పాడు.



 “సుధాకర్ గారూ బాగున్నారా? అన్నాడు హుషారుగా నవ్వూతూ.



 సుధాకర్ కూడా తన ఆలోచనలను పక్కన పెట్టీ నవ్వు మొహానికి పులుముకొని బాగున్నామండీ అన్నాడు.



 “ఏమిటీ దిగులుగా వున్నారు? మీ పిల్లలంతా ఇక్కడే వున్నారని చెప్పారు కదా! అంతా బాగున్నారా? ఏమీ ఇబ్బంది లేదు కదా? అన్నాడతను పరిశీలనగా సుధాకర్ ను చూస్తూ.



 “.. . అంతా బాగున్నారండీ అన్నాడు సుధాకర్. 



 “మేము ఇప్పుడే వచ్చాము, ఊర్లోనే ఉన్న ఓల్టేజ్ హోం నుంచి అని చెప్పాడతను, అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంటూ. సుమారు అరవై సంవత్సరాలు ఉంటాయతనికి.



 సుధాకర్ ప్రశ్నార్థకంగా చూశాడతన్ని. పోయిన సారి కలిసినప్పుడు ఆటో లో వచ్చినందుకు వొళ్ళు పట్టేసిందని చెప్తే వేరే ఊరు నుండి రైలు లో వచ్చి స్టేషన్ నుంచి ఆటో లో వచ్చారని అనుకున్నాడు సుధాకర్.



 “మీరు కరెక్ట్ గానే విన్నారు. మేము కొడుకుల ఇంట్లో ఉండము. అప్పుడప్పుడూ వస్తుంటాము. మాకు ఇద్దరు కొడుకులు. ఇంకో కొడుకు, కోడలు, పిల్లలు బాంబేలో ఉంటారు. ఇక్కడి కొడుక్కు ఇద్దరు పిల్లలు ప్రశాంతమైన మొహం తో చెప్పాడతను. 



 “మేము అందరితో కలసి వుంటే, ఇంటి పనులతో నా కంటే మా ఆవిడ బాగా అలసిపోతుంది. తన పిల్లలకు ఇష్టమైన వంటలే కాదు, వాళ్ళ పిల్లలకు ఇష్టమైన స్నాక్స్ కూడా చేస్తూనే వుంటుంది. అలా చేయకుంటే కోడళ్ళు ఏమనుకుంటారో నని మొహమాట పడ్తూ వుంటుంది. అందుకని కొంచెం దూరంగా వుంటే ఆవిడ సుఖ పడ్తుందనిఅక్కడ వుంటాము అన్నాడాయన గొంతులో ఎలాంటి బాధ కనపడనీయకుండా.



 సుధాకర్ నిజమే అన్నట్లు మౌనంగా తల ఊపాడు, మనసులో అయోమయాన్ని మొహం లో కనిపించనియ్యకుండా. తరువాత కాసేపు వివిధ విషయాలు మాట్లాడుకొని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు.



 ఆరోజు సుజాతా, నీకు బాగా పని పెరిగింది కదూ? అన్నాడు సుధాకర్ జాలిగా.



 “ ఏముంది లెండి. మన పిల్లలకేగా చేస్తున్నాను అంది అదేమంత పెద్ద విషయం కాదన్నట్లు. 
 సుధాకర్ ఇంకేమీ చెప్పలేక పొయ్యాడు. కానీ సుజాత కొంచెం సన్నబడినట్లుగా అతనికి అనిపించింది.



 ఒక నెల రోజులకు ఇద్దరూ ప్రసవించారు. కోడలి తల్లితండ్రులు వచ్చి నామకరణం జరిగిన తెల్లవారి వెళ్ళిపోయారు. వియ్యపురాలికి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వున్నాయి అని చెప్పారు. దాంతో మొత్తం ఇద్దరూ బాలింతలు, ఇద్దరూ పసిపిల్లల పని సుజాత మీద పడింది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 1/3 - by k3vv3 - 06-04-2025, 12:59 PM



Users browsing this thread: