06-04-2025, 10:08 AM
దీప్తి, ఈశ్వర్లు ఒకరి ప్రక్కన ఒకరు నిలబడ్డారు. సిద్ధంగా ఉంచిన ఎర్రనీళ్ళ పళ్ళాన్ని చేతికి తీసుకొంది లావణ్య. ఆ ఇరువురినీ సమీపించి దిష్టి తీసింది. పళ్ళాన్ని ప్రక్కనే నిలబడి వున్న పనిమనిషి మంగకు అందించింది.
"రండి లోపలకి" అంది లావణ్య.
ఈశ్వర్, దీప్తి.. వరండాలోకి ప్రవేశించారు.
"నాకు తెలుసు. నా కొడుకు నా కోడలితో కలిసి వస్తాడని!" చిరునవ్వుతో సగర్వంగా అంది భర్త ముఖంలోకి చూస్తూ లావణ్య.
"నాకూ తెలుసు" నవ్వాడు హరికృష్ణ.
పనిమనిషి మంగ ఎర్రనీళ్లను పారబోసి దీప్తిని సమీపించి
"కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రండి చిన్నమ్మగోరూ!" నవ్వుతూ చెప్పి మంగ ఇంట్లోకి వెళ్ళిపోయింది.
నలుగురూ వరండాలో కూర్చున్నారు.
"నాన్నా!.. ఏమన్నాడు మీ మామయ్య?" అడిగింది లావణ్య.
అక్కడ జరిగిన సంభాషణ తల్లితండ్రికి వివరించాడు ఈశ్వర్.
"మూర్ఖుని మనస్సును రంజింప చేయలేము కదా అండీ!.." భర్త ముఖంలోకి చూస్తూ అంది లావణ్య.
"అవును.. లావణ్యా!.. సరే.. జరుగవలసింది జరిగింది.. పదండి లోపలికి!" అన్నాడు హరికృష్ణ.
నలుగురూ ఇంట్లోకి నడిచారు. దీప్తి కళ్ళల్లో శతకోటి వెలుగులు.
====================================================================
ఇంకా వుంది..

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ