06-04-2025, 10:04 AM
ఈశ్వర్.. చిరునవ్వుతో ప్రజాపతి ముఖంలోకి చూచాడు. ఆవేశంతో అతని చేతులు, పెదవులు వణుకుతున్నాయి. క్రోధంగా ముఖం నిండా చెమట.
"మామయ్యా!.. మీకు నేను పదినిమిషాల టైమ్ ఇస్తున్నాను. సావధానంగా ఆలోచించి.. మంచి నిర్ణయానికి రండి.." చిరునవ్వుతో చెప్పాడు ఈశ్వర్.
"నాకు నీవు టైమ్ ఇస్తావా"
"అవును మామయ్యా!.. మీరు పెద్దవారు కదా!.. మీలా నేను ఆవేశపడకూడదు."
"ఏ విషయ్ంలో రా!.."
"మిమ్మల్ని ఎదిరించే విషయంలో!"
"నీవు నన్ను ఎదిరిస్తావా!"
"తొమ్మిది నిముషాలు మిగిలి వున్నాయి మామయ్యా!.."
"ఒరే ప్రజా!.. నీవు నన్ను గురించి ఏమనుకొన్నా.. నేను నీ మేలు కోరేవాణ్ణి. ఈశ్వర్ చెప్పిన మాటల్లో నీతి, న్యాయం, ధర్మం వున్నాయిరా. దీప్తి, ఈశ్వర్ల వివాహానికి అంగీకరించరా!" ప్రాధేయపూర్వకంగా చెప్పాడు మాధవయ్య.
"రేయ్ ఎక్కడ చచ్చార్రా! లోనికి రండి" పిచ్చివాడిలా ఆవేశంతో అరిచాడు ప్రజాపతి.
నలుగురూ పరుగున ఆ గదిలో ప్రవేశించారు.
"ఒరేయ్!.. వాణ్ణి లాక్కుపోయి రోడ్లో త్రోసి గేటు మూయండిరా!" శాసించాడు ప్రజాపతి.
"ప్రజా!.. తప్పు నిర్ణయం తీసుకొన్నావు. అది నీకు మంచిది కాదు.." బ్రతిమాలుతూ చెప్పాడు మాధవయ్య.
"రేయ్!.. ముందు ఈ ముసలి పీనుగును ఎత్తుకొనిపోయి వీధిలో పడేయండ్రా!"
నలుగురూ.. ఈశ్వర్, మధవయ్యల ముఖాల్లోకి దీనంగా చూచారు.
"అన్నయ్యలారా!.. మీకు ఆ శ్రమ అవసరం లేదు. మూడు నిముషాల సమయం మిగిలివుంది. అయిపోగానే మేమే వెళ్ళిపోతాం" చిరునవ్వుతో చెప్పాడు ఈశ్వర్.
హాల్లో కూర్చొని ప్రజాపతి, ఈశ్వర్, మాధవయ్యల సంభాషణ వింటున్న ప్రణవి.. దీప్తిలు భయంతో దిగాలు పడిపోయారు.
"మామయ్యా!.. చివరి రెండు నిమిషాలు.." చెప్పాడు ఈశ్వర్.
ఆ క్షణంలో అతని పెదాలపైన చిరునవ్వు మాయమైంది.
ప్రజాపతి ఆవేశంగా కుర్చీ నుంచి లేచి.. ఆ నలుగురినీ సమీపించి వారి చెంపలు వాయకొట్టాడు.
"నేను చెప్పిన పని చేయకుండా కొయ్యబొమ్మల్లా నిలబడతార్రా. మీకు కూలి ఇచ్చేది నేనా.. వాడా!" ఆవేశంతో ఊగిపోయాడు ప్రజాపతి.
"మామయ్యా! చివరి నిముషం. అమాయకులైన వారికి ఎందుకు కొట్టావు మామయ్యా!.. తప్పు కదూ!" అన్నాడు.
"ప్రజా! నీ చావు నువ్వు చావు. నీవు బాగుపడబోవు నే వెళుతున్నా!.." మాధవయ్య వేదనతో గదినుంచి బయటికి వచ్చాడు.
"మాధవయ్య మామయ్యా! కొన్నిక్షణాలు ఆగండి.."
మాధవయ్య ఆగి.. ఈశ్వర్ ముఖంలోకి చూచాడు.
"మామయ్యా!.. అయిపోయాయి పదినిముషాలు. ఇప్పుడు చూడండి" వేగంగా హాల్లోకి వచ్చాడు. దీప్తిని సమీపించాడు.
దీప్తి, ప్రణవి కన్నీటితో దీనంగా ఈశ్వర్ ముఖంలోకి చూచారు.
ఈశ్వర్ దీప్తి చేతిని తన చేతిలోని తీసుకొన్నాడు. "అత్తయ్యా! దీప్తి నాది. నా జీవితాంతం.. నా ప్రాణ సమానంగా చూచుకొంటాను" అని ఈశ్వర్ వేగంగా దీప్తితో కలిసి వీధిగేటు వైపుకు నడిచాడు. దీప్తి అతని ప్రక్కన లేడి పిల్లలా పరుగెత్తింది. ఇరువురూ కార్లో కూర్చున్నారు. కారు వెళ్ళిపోయింది. హాల్లోకి వచ్చిన ప్రజాపతి.. వెళుతున్న దీప్తి, ఈశ్వర్లను శిలాప్రతిమలా నిలబడి చూడసాగాడు.
ప్రణవి.. మాధవయ్యల కళ్ళల్లో కన్నీరు. అవి కన్నీరు కాదు. ఆనందభాష్పాలు.
ప్రజాపతి ఆవేశంతో పళ్ళు కొరుకుతూ నిలబడిపోయాడు. ఆవేశంతో కొన్ని క్షణాలు వూగిపోయాడు. నిట్టూర్చి వేగంగా మేడపైని తన గదికి వెళ్ళి తలుపు మూసుకొన్నాడు.
ఆ క్షణంలో.. అతనికి ఎంతో దుఃఖం వచ్చింది. కళ్ళ నుండి కన్నీరు ధారగా చెక్కిళ్ళపైకి జారాయి. అవమానంతో అతని హృదయంలో ఆవేదన, బాధ.
కనీ పెంచి పెద్దచేసి తన ఇష్టానుసారంగా చదివించి నా ప్రాణ సమానంగా చూచుకొన్న నా కూతురు దీప్తి నన్ను లెక్కచేయకుండా తన ఇష్టానుసారంగా ఆ ఈశ్వర్ గాడితో వెళ్ళిపోయింది. దీనికంతటికి కారణం వాడు.. ఆ నీచుడు.. ఈశ్వర్!.. వాణ్ణి బ్రతకనివ్వకూడదు. చంపెయ్యాలి!.. చంపెయ్యాలి!.. చివరి మాటలు ఆవేశంతో వున్న ప్రజాపతి నోటినుంచి పెద్దగా వెలువడ్డాయి.
అహంకారం.. స్వాతిశయం.. స్వార్థం.. మనిషిలోని మానవత్వాన్ని, వివేకాన్ని చంపేస్తాయి. మూర్ఖత్వం మంచిని సమాధి చేస్తుంది. ప్రస్తుత ప్రజాపతి ఆస్థితిలో వున్నాడు.
పగ.. ద్వేషం.. ప్రతికారాలు.. పర్యవసానం.. నష్టాన్ని, వేదనను కలిగించేవి కాని.. మంచిని పెంచలేవు.
క్రింద.. మాధవయ్య ప్రణవితో చెప్పి వెళ్ళిపోయాడు. ఎంతో ఆనందంగా దీప్తి, ఈశ్వర్ల గురించి ఆలోచిస్తున్న ప్రణవి కళ్ళముందు ప్రజాపతి ప్రత్యక్షమైనాడు.
ఆమె మనస్సున ప్రజాపతి తన గదిలో ఏం చేస్తున్నాడనే అనే ఆందోళన.. చెడ్డవాడో!.. మంచివాడో!.. అతను ఆమె భర్త. ఆ పదానికి ఒక స్త్రీ మనస్సులో వుండవలసిన గౌరవం.. అభిమానం ప్రజాపతి పట్ల ప్రణవి హృదయంలో ఇంకా మిగిలివున్నాయి. ఆ కారణంగా మెల్లగా మెట్లు ఎక్కి అతని గదిని సమీపించి తలుపును త్రోసింది. లోన గడియ బిగించిన కారణంగా అది తెరువబడలేదు. నిట్టుర్చి మౌనంగా క్రిందికి వచ్చింది ప్రణవి.
ఈశ్వర్, దీప్తి హరికృష్ణ ఇంటికి చేరారు. ఇరువురూ కారు దిగి వరండాను సమీపించారు.
అక్కడే వున్నందున హరికృష్ణ.. లావణ్యలు చిరునవ్వుతో ఎంతో ప్రీతిగా వారిని చూచారు ఆ దంపతులు.
"ఆగండిరా!.." అంది లావణ్య.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ