06-04-2025, 09:58 AM
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 18
ఆ సాయంత్రం.. నాలుగు గంటల ప్రాంతం.. ప్రజాపతి ఫ్యాక్టరీ నుండి ఇంటివైపుకు, హరికృష్ణ ఇంటి నుంచి పాలఫ్యాక్టరీ వైపుకు కార్లో వెళుతున్నారు. రెండు కార్లు సమీపించాయి. ఆలమంద రోడ్డు ఆక్రమించి ముందుకు నడుస్తూ వుంది. డ్రైవర్లు కార్లను ఆపారు.
హరికృష్ణ ప్రజాపతిని.. ప్రజాపతి హరికృష్ణను చూచుకొన్నారు. ప్రజాపతి ముఖం చిట్లించి కారు దిగి పశువుల కాపరులను ఉద్దేశించి..
"రేయ్!.. ప్రక్కకు తోలండ్రా!" అన్నాడు.
హరికృష్ణ కారు దిగాడు.
’వాడి ఇంటికి పోయి మాట్లాడే దానికంటే.. ఎదురుపడ్డాడు కాబట్టి ఇప్పుడే పలకరించి మాట్లాడటం మంచిది. మాటలు తేడాగా వెలువడినా!.. మా ఇద్దరి మధ్యనే వుంటాయి. అది వాడికి గౌరవం. నాకూ గౌరవం’ అనుకొన్నాడు. ప్రజాపతిని సమీపించాడు. అతను తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు.
"ప్రజా!" ప్రీతిగా పలకరించాడు హరికృష్ణ.
ఏం అన్నట్లు తలెగరేసి హరికృష్ణ వైపుకు చూచాడు ప్రజాపతి.
"మన శివరామకృష్ణ.. మన వూరికి వస్తున్నాడు."
"ఆ విషయం.. నాకెందుకు?"
"వాడికి సంబంధించిన ఇల్లు ప్రస్తుతం నీ స్వాధీనంలో నీ గోడౌన్గా వుంది కాబట్టి. అందులోని సామాగ్రిని నీవు వేరే చోటుకు మార్చి ఆ ఇల్లు ఖాళీ చేయాలి ప్రజా!"
"వాడు ఎందుకు వస్తున్నాడు?"
"మనతో కలిసి తన శేష జీవితాన్ని తాను పుట్టిన ఊరిలో గడపడానికి వస్తున్నాడు"
"విషయాన్ని నాకు తెలియజేయలేదే!"
"హుఁ.. వాడిమీద నీకు వున్న అభిమానం అడ్డుపడింది."
"నన్ను హేళన చేస్తున్నావా"
"లేదు. ఉన్న యదార్థ విషయాన్ని చెప్పాను."
ప్రజాపతి కొన్ని క్షణాలు శూన్యంలోకి చూస్తూ మౌనంగా వుండిపోయాడు.
"నీ మౌనం.. సమ్మతానికి నిదర్శనం అనుకొంటున్నా!.. రెండుమూడు రోజుల్లో ఆ ఇంటిలోని సామాగ్రిని వేరేచోటుకి మార్పించు."
"నాకు పదిరోజులు సమయం కావాలి"
"ఏమిటీ పదిరోజులా!"
"అవును.. వున్నట్లుండి ఖాళీ చేయమంటే.. ఎలా వీలవుతుంది."
"మూడురోజుల వ్యవధిలో ఖాళీచేయమన్నానుగా."
"కుదరదు. నాకు పదిరోజులు కావాలి. అసలు.. నేను నీమాట ప్రకారం ఎందుకు ఖాళీ చేయాలి. వాడు వచ్చి నన్ను అడగనీ అప్పుడు ఖాళీ చేస్తాను."
"నీకు నా మాటల మీద విశ్వాసంలేదా"
"లేదు"
"ప్రజా! నీవు గతాన్ని పూర్తిగా మరిచిపోయావు.. మారిపోయావు అది నీకు మంచిది కాదు."
"నా మంచిచెడ్డల గురించి నాకు బాగా తెలుసు. వాటిని గురించిన నీ ఉపదేశం.. నాకు అనవసరం."
"ఇది ఉపదేశం కాదు.. నాకు తోచిన మంచిమాట!"
"నీ మాటలను వినేదానికి నేను నీ ఫ్యాక్టరీ వర్కర్ను కాదు."
"నీవు ఫ్యాక్టరీ వర్కర్వి కావు. నా బావమరిదివి. నాకు అయినవాడివి.."
"ఆ బంధం మన మధ్యన తెగిపోయింది."
"కాదు.. అహంకారంతో నీవే తెంచేశావు."
ప్రజాపతి తీక్షణంగా హరికృష్ణ ముఖంలోకి చూచాడు.
"అవును.. నేనే తెంచేశాను. నీవంటే నాకు గిట్టని కారణంగా. ఇంకా ఎప్పుడూ నాతో మాట్లాడకు. నేను నీకు శత్రువును. నీవు నాకు శత్రువు" వేగంగా వెనుదిరిగి కార్లో కూర్చున్నాడు ప్రజాపతి. "పోనీరా!" అన్నాడు. ఆలమందలు ప్రక్కకు తొలిగాయి. ప్రజాపతి కారు వేగంగా ముందుకు వెళ్ళిపోయింది.
సాయంత్రం ఏడుగంటలకు ఇంటికి తిరిగి వచ్చిన హరికృష్ణ.. ప్రజాపతికి తనకు జరిగిన సంభాషణను గురించి లావణ్య, ఈశ్వర్లతో చెప్పాడు.
అంతా విన్న లావణ్య నిట్టుర్చి..
"ఇది నేను వూహించినదే!.." అంది.
చిరునవ్వుతో భార్య ముఖంలోకి చూచాడు హరికృష్ణ. క్షణం తర్వాత “నా ప్రయత్న ఫలితం తెలిసిపోయింది ఈశ్వర్!.. నీ ప్రయత్నా ఫలితం ఎలా వుంటుందో చూడాలి."
"ఆ ఫలితం కూడా ఇలా వుండబోతుందండీ!.. నాన్నా!.. నీవు వాడిని కలవవద్దు" తీక్షణంగా చెప్పింది లావణ్య.
"అమ్మా!.."
"అవును ఈశ్వర్ వద్దు"
"లావణ్యా!"
"ఏమిటండీ!"
"వాడి ప్రయత్నాన్ని వాణ్ణి చేయనీ!"
"నా కొడుకు వాడిముందు అవమానపడటం.. నాకు ఇష్టం లేదండీ!"
"ఈశ్వర్ మాటలకు వాడి మనస్సు మారుతుందేమో!.. మరో చివరి అవకాశాన్ని నా బావమరిదికి ఇవ్వు లావణ్యా!" ప్రాధేయపూర్వకంగా చెప్పాడు హరికృష్ణ.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ