Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక కథలు - శ్రీరామ కోటి
#77
"ఇలాంటి వారు సర్వ మత సహనం అంటూనే ఏదో ఒక సందర్భంలో మన మతాన్ని గొయ్యి తీసి పాతిపెడదాం అని చూస్తారు. హే అల్లా హే రాం అంటూనే శ్రీరాముడు పెళ్ళాన్ని నిందించిన భయస్తుడు అంటారని పరిహసించాడు. 



విషయాన్ని రచ్చబండ దగ్గరకు తీసుకువచ్చాడు. 



 "ఒక '' మహిళ హిందూ దేవాలయ నిర్మాణ సహకారానికి ముందుకు రావడం వెనుక ఏదో మర్మం దాగి ఉందన్నాడు. 



నాగేంద్ర మాటలను ఊరివారంత ఖండించారు. "మనసు మంచిదైతే మంచి చేయడానికి మతం అడ్డు రాదన్నారు. అయినా నాగేంద్ర వారి మాటలను సమర్థిం చలేదు. 



" ఊరివారంత రామమందిర నిర్మాణానికి సహకరించినా, రామమందిర నిర్మాణ కమిటీ లో ఒక '' మహిళ ఉందంటే పరాయి ఊరువారు సహకరించక పోవచ్చును " అని అన్నాడు. 



"ఇవన్నీ అవకాశవాదులు, స్వార్థ పరులు, కుతంత్ర వ్యాపారస్తులు చేసే పనులు. వాటిని అసలు పట్టించు కోవద్దని ఊరివారందరితో రామసేన తండ్రి అన్నాడు. 



రామసేన నెల తప్పింది. హసీనా అక్బర్ రామసేన యింటనుండే ఆమె ఆలనా పాలనా చూసుకోసాగింది. 
రామసేన, దశరథరామయ్య, రామసేన తండ్రి, హసీనా అక్బర్ ఖాళీ సమయంలో రామమందిర నిర్మాణం ఎలా ఉండాలనే అంశం మీదనే ఎక్కువగా ముచ్చటించుకునే వారు. 



ఒకనాడు "రామమందిరం గోడలు రామాయణ గాధ ను తెలపాలి. రామమందిరం రామనామాలతో మారు మ్రోగాలి" అంటూ నలుగురు రామమందిర నిర్మాణం గురించి రకరకాల మాటలను చెప్పుకున్నారు. ఆపై అందరూ విశ్రాంతి పడుకున్నారు. 



 ఒకగంట అనంతరం హసీనా అక్బర్ కు మెలకువ వచ్చింది. హసీనా అక్బర్ కు గదిలో కిలకిల నవ్వులు వినిపించాయి. ఎవరా అని హసీనా అక్బర్ చుట్టూ చూసింది. ఆమెకు ఎవరూ కనపడలేదు. చివరికి హసీనా అక్బర్ రామసేన కడుపు వైపుకు చూసింది. అక్కడ నుండే కిలకిల నవ్వులు వస్తున్నాయని హసీనా అక్బర్ గమనించింది. రామసేన మంచం దగ్గరకు వచ్చింది. రామసేన గర్భంలోని శిశువు అభిమన్యుడు లా "జైశ్రీరామ్.. రామమందిరం లో ముందుగా అమ్మ కౌసల్య దేవి ఆలయం ఉండాలి. ఆలయంలో అందరూ లక్ష్మణ స్వామి గురించే తలచుకోవాలంటే లక్ష్మణ స్వామి విగ్రహరూపంలో కాక ఛాయా రూపంలో ఉండాలి. " అని అంది. 



"అదెలా సాధ్యం?" శిశువును హసీనా అక్బర్ అడిగింది. 
"అది సుసాధ్యం కావాలంటే మీ మీ త్యాగఫలం అక్కడ ప్రతిష్టించబడాలి. ఏమిటా త్యాగం అనేది కాలం చెబు తుంది. మీరు కరుణాహృదయంతో త్యాగాన్ని మీ పరం చేసుకోండి. మీలో ఎవరి పరం అవుతుందనేది దేవ రహస్యం. నేను నీకు విషయాలు చెప్పినట్లు ఎవరికి చెప్పకు. కౌసల్యా మందిరాదుల నిర్మాణం నీ అభిప్రాయం అన్నట్లే చెప్పు" అని హసీనా అక్బర్ తో అంది శిశువు. 



 హసీనా అక్బర్ అందరూ నిద్రలేచాక రామమందిర నిర్మాణం లో కౌసల్యామందిరం గురించి, లక్ష్మణ స్వామి గురించి అందరికి చెప్పింది. శిశువు గురించి మాత్రం చెప్పలేదు. 



రామసేన పండంటి మగబిడ్డ కు జన్మనిచ్చింది. రామసేన తండ్రి శిశువుకు "రఘురామానుజవల్లభ్" అని పేరు పెట్టాడు. రఘురామానుజవల్లభ్, అచ్చం తండ్రి ప్రజారాం లాగానే ఉన్నాడని కొందరన్నారు. కాదు తల్లి రామసేన లా ఉన్నాడని కొందరన్నాడు. దైవాంశ సంభూతుడని హసీనా అక్బర్ అనుకుంది. రామసేన తండ్రి ఆవూరికి రామానుగ్రహంతో ఎలా వచ్చింది. రామాపాదం వూరు ఎలా ఏర్పడింది అందరికీ చెప్పా డు. రఘు రామానుజవల్లభ్ పుట్టిన పది నెలలకు రామసేన తండ్రి, అతని భార్య లోకాన్ని వదిలారు



 శివరాత్రి పండుగ వచ్చింది. రామపాదం పక్క వూరివారు ఎడ్ల పందాల పోటీలు పెట్టారు. పక్కవూరికి పది మైళ్ళ దూరంలో ఉన్న శివాలయం చుట్టూ ప్రభతో ఉన్న ఎడ్లబండి ని తిప్పుకు తీసుకు రావాలి. ఎవరు గెలిస్తే వారికి ఆరెకరాల పొలమన్నది పందెం. పందెం లో ఆడమగ ఎవరైన పాల్గొనవచ్చును అన్నది నియమం. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - పంచమ వేదం - by k3vv3 - Yesterday, 09:09 AM



Users browsing this thread: 1 Guest(s)