Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక కథలు - శ్రీరామ కోటి
#76
 "మాలక్ష్మి మహలక్ష్మి మావూరి సిరిసంపదల శ్రీలక్ష్మి.. సాగతమమ్మ సుస్వాగతం.. 
తూరుపుంటి బాల భానుడు శ్రీమన్నారాయణుని బంగారు వెలుగున తులసికోట ముందు ప్రణమిల్లిన భాగ్యలక్ష్మి స్వాగతం సుస్వాగతం" 



అంటూ రామసేనను చూచిన జానపద కవులు కవితలల్లేవారు. 
రామసేన పయిటను గిర్రున తిప్పి అల్లంత దూరంలో ఉన్న ఎదుటివాడి మెడకేసి కొట్టిందంటే వాడు పరలోకానికి వెళ్ళవలసిందే. రామసేన వందకేజీల వడ్లబస్తాని పైకెగరేసి కాలితో తంతే అది వడ్లబండి మీద పడి కుదురుగా కూర్చునేది. రామ సేనకు ఆవులను గేదెలను పెంచడమంటే మహా యిష్టం. వాటి పొదుగు మీద ఆమె చెయ్యి పడితే చాలు పశువులు పాలధారలను కురిపించేయి. మరెవరి చెయ్యన్న పడితే వెనక కాళ్ళు రెండూ ఎత్తి జాడించి కొట్టేయి. 



రామసేన ప్రాణ స్నేహితురాలు హసీనా అక్బర్. 



రామసేన పెళ్ళికాకమందే రామసేన, హసీనా అక్బర్ ఇద్దరూ కలిసి ఊరికి చివరన ఉన్న చంద్రకోన లో చిక్కు కున్న కామధేనువు లాంటి ఆవును కాపాడారు. 



చంద్రకోన ఒక విచిత్రమైన కోన. పౌర్ణమి నాటి చంద్ర కిరణాలకు కోనలోని కొన్ని చెట్ల ఆకులు కరుగు తాయి. అలా కరిగిన ద్రవం మరుసటి రోజు సూర్య కిరణాలు తాకగానే రకరకాల ఆకారాల్లో రకరకాల రంగు ల్లో గడ్డ కడడతాయి. ఆకారాలన్ని రకరకాల దేవుళ్ళ స్వరూపాలను కలిగి ఉంటాయి. 



ఒకప్పుడు నాగేంద్ర కన్ను రామసేన మీద పడింది. రామసేనను పెళ్ళి చేసుకుని రామసేనతో పాటు, హసీనా అక్బర్ ని కూడా నాగేంద్ర తన స్వంతం చేసుకో వాలనుకున్నాడు. రామసేన తండ్రి నాగేంద్రకు తన కూతురునిచ్చి పరిణయం చేయడానికి సమ్మతించ లేదు. రామసేన తండ్రి ఊరి పెద్ద అవ్వడంతో నాగేంద్ర తలవంచుకు వెళ్ళిపోయాడు. 



రామసేన వివాహం ప్రజారాం తో జరి గాక ఒకసారి గడ్డివాము చాటున నాగేంద్ర హసీనా అక్బ ర్ భుజం మీద చెయ్యి వేసాడు. అది చూసిన ప్రజారాం నాగేంద్ర జుట్టు పట్టుకుని రచ్చబండ ముందు నాగేంద్ర ను నిలబెట్టాడు. అప్పుడు రామసేన తండ్రి నాగేంద్ర తో హసీనా అక్బర్ యింట పది నెలల వెట్టి చాకిరీ చేయిం చాడు. అప్పటినుండి నాగేంద్ర రామసేన కుటుంబం పై పగబట్టాడు. ఏదో ఒక రకంగా ప్రజారాం ను మంచి చేసు కుని అతని ఆస్తి సమస్తం తన వశం చేసుకోవాలనే ఎత్తుగడతో నాగేంద్ర ప్రవర్తించసాగాడు. 



 నాగేంద్ర చూడటానికి నాలుగు కళ్ళ మనిషిలా ఉంటాడు. అతను చిన్నప్పుడు ఒక కొండ మీదనుండి కిందికి దొర్లి పడ్డాడు. అప్పుడు అతని నుదురు మీద కళ్ళ పైన రెండు పెద్ద గాయాలు అయ్యాయి. గాయా లు మాని మాని రెండు పెద్ద కళ్ళలా తయారయ్యాయి. దానితో చూసేవారికి నాగేంద్ర నాలుగు కళ్ళ రాక్షసుడు లా కనపడతాడు. అతనికి దేవుడిచ్చిన రెండు కళ్ళు నిరంతరం రుధిర జ్వాలల్లా ఉంటాయి. 



రామసేన తండ్రి ప్రోత్సాహం తో రామసేన, ప్రజారాం లు ఊరిలో శ్రీసీతారామాంజనేయ దేవళ నిర్మా ణానికి శ్రీకారం చుట్టారు. వారికి హసీనా అక్బర్ కూడా తోడుగా నిలిచింది. చిన్నప్పటి నుండి ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకున్న రామసేన, హసీనా అక్బ ర్ లు రకరకాల కార్యక్రమాల ద్వారా ధనం రాబట్టి రామ మందిర నిర్మాణ వేగం పెంచాలనుకున్నారు. హసీనా అక్బర్ రామసేన కు రామమందిర నిర్మాణ విషయంలో సహకరించడం చూచిన '' పెద్దలలో కొందరు, . 



"బేటీ హసీనా అక్బర్ నువ్వు రామసేన ఎంత ప్రాణ దోస్తులో మాకు తెలుసు. రామసేన మన '' పండు గలప్పుడు పర మతం అని అనుకోకుండా మన పండు గలకు రకరకాల సహాయసహకారాలు అందిస్తుంది. 



ఇది ఊరంతటకు తెలిసిన సత్యం. కాకపోతే మన ఊరి ''లు, '' పెద్దలందరూ నిన్ను సపోర్ట్
చేస్తే చేయవచ్చు. కానీ మనవూరికి అప్పుడప్పుడు వచ్చే మనకంటే గొప్ప వాళ్ళయిన '' మతాన్ని పెంచి పోషించే '' పెద్దలకు నీ తీరు నచ్చడం లేదని తెలిసింది. ఇలాగైతే నీకు షాదీ అవ్వడం కూడా కష్టమ వుతుంది అని వారు అంటున్నారు. " అని అన్నారు. 



 '' పెద్దల మాటలను విన్న హసీనా అక్బర్, "మీరంతా నాకు అల్లాతో సమానం. అయితే వూరు ఇంత అవ్వడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలందించింది నా ప్రాణానికి ప్రాణమైన రామసేన తండ్రి. ఆయన నాకు అల్లాలా కనపడతారు. నన్ను కూడా ఆయన "బేటీ.. బేటీ" అనే పిలుస్తారు. మనమంతా మనుషులం. దేవుడు చేసిన మనుషులం. 
దేవుడు రాముడు కావచ్చు. అల్లా కావచ్చు. మాధవుడు కావచ్చు. జీసస్ కావచ్చు. కనకదుర్గ కావచ్చు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కావచ్చు. బీబీ నాంచారమ్మ కావచ్చు. వారాహి మాత కావచ్చు. 



అంతా సమానమే. 



భగవంతుడు మనకు ప్రాణం పోసాడు. మన కర్మాను సారం మనకు కష్టసుఖాలను ప్రసాదించాడు. దేవుడు మంచిని ఇచ్చా డు. మనసును ఇచ్చాడు. మానవత్వాన్ని ఇచ్చా డు. మతాన్ని ఇచ్చాడు. కులాన్ని ఇచ్చాడు. ప్రతి మతం లో ప్రతి కులంలో మంచిని, మానవత్వాన్ని, మానవ ధర్మాన్ని భద్రపరిచాడు. 



 అయితే కొందరు స్వార్థపరులు కొందరు కుహనా పండితులతో కలిసి కులంలో మతంలో కుళ్ళుని నింపించారు. వారి ధనాభివృద్ధికి, వారి వారి అధికా రాభివృద్ధికి వాటిని వాడుకుంటున్నారు. అలాంటి వారి మాటలను నమ్మి కత్తులు పట్టి ప్రాంతాల మీదకు పోరాదు. 
 దేవుడు చేసిన మనుషులు దేవుడు లాంటి మనుషులుగా ఉండాలి. పిచ్చి పిచ్చి మాటలతో రాక్ష సులు గా ఉండాలనుకోకూడదు. 



ఎవరి మతంలో వారుండి పరమత దేవుని ప్రార్థించడం తప్పుకాదు. నేను అల్లాని ఎంత భక్తితో ప్రార్థిస్తానో రామ భజన అంత భక్తితో చేస్తాను. 
  మతం వారికైన, కులం వారికైన పవిత్ర అవ కాశాలు అన్ని వేళల రావు. వచ్చిన అవకాశాన్ని కులమతాతీత సదాలోచనలతో సద్వినియోగం చేసుకోవాలి గానీ దుర్వినియోగం చేసుకోరాదు. మత మారణ హోమం లో జ్వాలలు కాకండి. " అన్న హసీనా అక్బర్ మాటలు '' మత పెద్దలకు నచ్చాయి. 



 హసీనా అక్బర్ రామమందిర నిర్మాణ విషయంలో రామసేనకు తోడుగుండటాన్ని నాగేంద్రకు అసలు నచ్చలేదు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - పంచమ వేదం - by k3vv3 - Yesterday, 09:07 AM



Users browsing this thread: