Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - శిఖండి
#75
అనుజవల్లభ్ శ్రీ రామ భక్తుడు. అతను ఏపని చేసిన జైశ్రీరామ్ అనుకునే పని మొదలు పెడతాడు. అందరి దేవుళ్ళ భక్తులను గౌరవిస్తాడు. అందరి దేవుళ్ళని ప్రార్థిస్తాడు. 
దేవతలను సంతోష పెట్టే అర్చన చేస్తాడు. గత జన్మ పాపాలను పోగొట్టి, జీవుడిని దేవుడిని చేసే జపం చేస్తాడు. దివ్య భావాన్ని కలిగించే దీక్ష చేస్తాడు. 



అయితే అనుజవల్లభ్ సీతారామాంజనేయ స్వామి అంటే ప్రాణం ఇస్తాడు. అనుజవల్లభ్ దేవాలయ బాధ్యత లన్నిటిని తనే తలకెత్తుకున్నాడు. శ్రీరామ నవమి వంటి వేడుకలకు తనే దగ్గరుండి జరిపిస్తున్నాడు. కొందరు అనుజవల్లభ్ ని వూరిలో నడిచే, అందరికి కనిపించే లక్ష్మణ స్వామి అని అంటారు. 



"తన తలిదండ్రులు ఉన్నప్పుడే అనుజవల్లభ్ కు వివాహం అయ్యింది. వివాహానికి అందరూ హాజరయ్యారు. పెళ్ళి కూతురు అనుజవల్లభ్ కు తప్ప ఎవరికి కనపడలేదు. వూరి వారంతా ఇదేం చిత్రం అనుకున్నారు. 



 అనుజవల్లభ్ తల్లిదండ్రులు కాలం చేసారు. అనుజవల్లభ్ అందరికీ కనపడని అమ్మాయి తోనే కాపురం చేస్తున్నాడు. కానీ అమ్మాయిని వూరి వారు ఎవరూ చూడలేదు. అనుజవల్లభ్ ఆనందంగా ఉన్నాడు.. ఆవూరివారు అనుజవల్లభ్. ఆనందంలోనే అమ్మాయిని చూసి తృప్తి పడతారు. 



 అనుజవల్లభ్ ని పరిశీలించిన వైద్యులు, "ఆద్యాత్మిక వేత్తలు అనుజవల్లభ్ ని దైవాంశ సంభూతుడు అని అంటారు. మేం అనుజవల్లభ్ తను నిర్మించుకున్న సుందరలోకంలో యువతితో ఆనందంగ జీవిస్తు న్నాడు. అతను అలా ఆనందంగా జీవించడానికి ప్రధాన కారణం దేవళంలోని లక్ష్మణ స్వామి అని చెప్పవచ్చు ను. అతని వాలకం వలన ఊరిలో ఎవరికీ నష్టం లేదు. లాభం తప్ప" అని అన్నారు.



ఎవరేమన్నా అనుజవల్లభ్ తన మార్గం లో తాను శ్రీరామ సేవ చేస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. దేవాలయం ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళినప్పటికి అక్కడ అనుజవల్లభ్ మాటే చెల్లుతుంది. 



 అనుజవల్లభ్ తల్లిదండ్రులు రామసేన, ప్రజా రాం లే దేవాలయ నిర్మాణానికి పునాది వేసారు. 



అనుజవల్లభ్ అక్షరాభ్యాసం నాడు రామసేన అనుజవల్లభ్ తో, " మః శి వా యః లతో పాటు శ్రీరామ శ్రీరామ శ్రీరామ" అని మూడుసార్లు వ్రాయించింది. తర్వాత తనకు ఖాళీ ఉన్నపుడల్లా అనుజవల్లభ్ తో "శ్రీరామకోటి" వ్రాయిం చడం మొదలు పెట్టింది. 



"శ్రీరామ శ్రీరామ శ్రీరామ" అని ఖాళీ ఉన్నపుడల్లా శ్రీరామకోటి వ్రాసి, శ్రీరామ కోటి పుస్తకాన్ని భద్రాచల దేవాలయానికి, లేదా అయోధ్య రామునికి సమర్పిస్తే, దాని వలన ఎలాంటి పుణ్యమూ రాదు. మరెలాంటి మోక్షము రాదన్నది రామసేన నమ్మకం. ప్రగాఢ విశ్వాసం. అందుకే రామసేన "శ్రీరామ కోటి" వ్రాయలేదు. తన భర్తతో వ్రాయించలేదు. రామసేన శ్రీరామ భక్తురాలు అయిన ప్పటికీ తను "శ్రీరామ కోటి" వ్రాయ కపోవడానికి, భర్తని వ్రాయమని ప్రోత్సహించక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అలాగే తన కుమారుడు అనుజవల్లభ్ తో శ్రీరామకోటి వ్రాయించడానికి అనేక కారణాలు ఉన్నాయి. 



 రామసేన పుట్టినప్పుడు రామపాదం చిన్న కుగ్రామం. ఎంత చిన్న కుగ్రామం అంటే అసలు దానిని కుగ్రామం అనికూడా అనకూడదు. గోదారి రహదారి నడుమ పదిళ్ళున్న ప్రాంతం అంటే సరిపోతుంది అని కొందరు అనేవారు. రామసేన కుటుంబానికి పదిళ్ళ ప్రాంతానికి విడదీయలేనంత అవినాభావ సంబంధం ఉంది. రామసేన తండ్రి అక్కడికి బతకడానికి వచ్చిన వారందరికీ అంతో ఇంతో ఎంతో కొంత ఏదో ఒక సహాయం చేసేవాడు. అలా అలా అదొక కుగ్రామం అయ్యింది. 



 రామసేన తండ్రే ప్రాంతానికి రామపాదం అని పేరు పెట్టాడు. వూరికి తనకి జన్మజన్మల సంబంధం ఉందని అతనికి అనిపించింది. 



 అక్కడికి వచ్చి బతికేవాళ్ళకి యిల్లు వేసు కోవడానికి స్థలాలను, తాటి తోపుల్లో తాటాకులను ఉచితంగా ఇచ్చాడు. గోదారి కొంచెం దూరంగా ఉందని ఊరివారంతా కలిసి గోదారినుండి వారి ఊరికి చిన్న కాలువ తవ్వి గోదారి నీళ్ళను వారి ఊరికి దగ్గర చేసారు. 



 రామసేన బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు ఒకసారి ఒక విచిత్రం జరిగింది. ఒకచోట కాలువ గట్టున రామ చిలుకల గుంపు ఒక చిత్రం చుట్టూ తిరగ సాగాయి. రామసేన చిలకల గుంపుల నడుమకు వెళ్ళి చిన్నగా గంతులు వేయసాగింది. అది చూసిన ఆమె తల్లిదండ్రులు రామచిలుకల మాటున ఉన్న శ్రీరామ చంద్రుని విగ్రహం చూసారు. దానిని అక్కడే పరిశుభ్రం చేసి పూజచేయసాగారు. 



రామసేన తండ్రి అనేకమంది పండితులను, స్వామీజీలను పిలిచి ప్రదేశాన్ని చూపించాడు. అందరి అభిప్రాయాలను స్వీకరించాడు. కడకు అక్కడే దేవళం కట్టాలను కున్నాడు. 
 మంచి ఉన్నచోటే చెడుకూడ ఉంటుంది. అది సృష్టి ధర్మం. రామసేన తండ్రి ఉన్న ఊరిలోనే నాగేంద్ర కుటుం బం కూడా ఉంది. అయితే కుటుంబం రామసేన తండ్రి ద్వారా రాలేదు. పాముల బసవయ్య ద్వారా నాగేంద్ర కుటుంబం అక్కడకు వచ్చింది. 



రామసేన తండ్రి కి రామసేన ఒక్కతే కుమార్తె. రామసేన తండ్రి ప్రజారాం ను ఇల్లరికం తెచ్చు కున్నాడు. తన పదెకరాల భూమిని అల్లుడి చేతిలో పెట్టాడు. అలాగే "ఊరిని పెద్దది చెయ్యాలి. ఊరిలో దేవళం నిర్మించాలి" అనే తన కోరికలను అల్లుడికి చెప్పాడు. 



 ప్రజారాం కష్టజీవి. పనిపాటలతో కాలం గడిపే వ్యక్తి. తన కష్టం తో మామగారిచ్చిన ఆస్తిని నాలుగు రెట్లు పెంచాడు. అవకాశం వచ్చిన ప్పుడల్లా మామగారి కోరికలను తీర్చాలన్న నిర్ణయానికి వచ్చాడు. 



 రామసేన పొలంలో భర్తకు సహాయం చేస్తూ ఆడవారికి కర్రసాము నేర్పేది. 



"వెనక నడకతో నాటులు. 
ముందు నడకతో కోతలు. 
కుప్పలమ్మ కుప్పలు. 
బంగరు వన్నెల కుప్పలు 
పల్లెమాత సిరి సంపదలశోభలు" 



అంటూ ఆటపాటలతో ఆనందిస్తూ, అందరిని ఆనందింప చేసేది. ఆమె వస్త్రధారణ చూసి పల్లెమాత పరవసించి పోయేది. 
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - పంచమ వేదం - by k3vv3 - 02-04-2025, 09:06 AM



Users browsing this thread: