Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#74
శ్రీరామ కోటి
[Image: image-2025-04-02-090247135.png]
[font=var(--ricos-font-family,unset)] [/font]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు

రామపాదమొకప్పుడు చిన్న కుగ్రామం. కుగ్రామం చుట్టూ పంటపొలాలు ఉన్నప్పటికీ అది సరైన వసతులు లేని కుగ్రామం. ఆధునిక వసతులు అసలు లేని కుగ్రామం. ఆహ్లాదకరమైన పాడి పంటల పంటపొలాల కళకళలతో పాటు విష సర్పాలు, తేళ్ళు, దోమలు, క్రిమికీటకాలు విపరీతంగా ఉన్న కుగ్రామం. ఆకు పచ్చని చేల మాటు ఆకు పచ్చని పాములు వంటి జుగుప్సాకర విష జీవులున్న కుగ్రామం. 



మట్టి రోడ్లే మహా గొప్ప రోడ్లనుకునే అమాయక జనమున్న కుగ్రామం. ఎడ్లబండ్లతో పాటు గాడిద బండ్లు కూడా ఉన్న కుగ్రామం. 



 అలాంటి రామ పాదం కుగ్రామం ఇప్పుడు రాజ ధానిని మించిన పేరుప్రతిష్టలతో అందరి దృష్టిలో పడిం ది. ఒకసారి రామపాదం ను దర్శించుకుంటే చాలు సగం పైగా దరిద్రం తీరి ప్రశాంత జీవనానికి మార్గం మంచిగా కనపడుతుంది అని అనేకమంది రామ భక్తులు అను కునే స్థాయికి ఎదిగిన కుగ్రామం రామపాదం. అందుకు ప్రధాన కారణం అక్కడ కొలువు తీరిన శ్రీసీతారామాంజనేయ దేవాలయం. పూర్వ జన్మ వాసనలను నశింపచేసే పూజ అక్కడ జరుగుతుందరు అక్కడికి వచ్చే భక్తులందరూ నమ్ముతారు. 



  దైవం ఎప్పుడు ఎక్కడ ఎలా వెలసి, మహిమ చేస్తుందో ఎందరిని ఆదరిస్తుందో మరెందరి ప్రాణాలనులను కాపాడుతుందో, మరెందరిని మూఢ భక్తులను చేస్తుందో, యిలలో ఎవరు చెప్ప లేరు. 



 బ్రహ్మ రాత బ్రహ్మకు కూడా తెలియదని కొంద రంటారు. రాత రాసిన విధాతకు తను వ్రాసిన రాత గురించి ఎందుకు తెలియదంటే, విధాత జీవి రాత రాయగానే తన బాధ్యత తీరిపోయినట్లు రాత మూలాలను మరిచిపోతాడు. మరో జీవి రాత మీద దృష్టి పెడతాడు. అందుకే భూమి మీద మనిషికి వాన రాకడ ప్రాణం పోకడ తెలియదంటారు. ఇక ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? 



 చిన్న కుగ్రామమైన రామపాదం మీద అనేక మంది రామ భక్తులు అనేక భజన కీర్తనలు వ్రాసా రు. అందు 



"సుందర మతిసుందరము రామపాదము. 
అంబర మంటే రామపాద రామమందిరము.. 
శ్రీ రాముని హృదయం మెచ్చిన పుణ్య నివాసము. 
శ్రీకౌసల్యామాతకదే సుపుత్ర నిలయం. 
లక్ష్మణ స్వామి నివాసం.. 
కథల కథల విన్యాసం 
కలియుగ త్రేతాయుగ శ్రీరామవాసము. 
సదా మహోన్నత నివాసం.
అబ్బబ్బ తనువును తబ్బిబ్బు చేసే సుర నివాసము. 
రామపాదమ మనోహరం మనోహరం " 



అంటూ రామ భక్తులు పాడే భజన కీర్తనలు అందరిని ఆకట్టుకుంటాయి. 



చిన్న కుగ్రామం ను మహా రాజధానిని చేసిన శ్రీ సీతారామాంజనేయ దేవాలయం లోనికి ప్రవేశించగానే, 
ముందుగా చిన్న గుడిలో శ్రీకౌసల్యామాత కొలువై ఉంటుంది. అటుపిమ్మట ప్రధాన ఆలయంలో శ్రీసీతారామాంజనేయ స్వామి కొలువై ఉంటారు. ఇక్కడ సీతా రాముల దగ్గర లక్ష్మణుడు కూడా ఉన్నాడు. 



అతగాడు అందరికి కనపడడు అంటారు. అతనిని చూచిన వారే పుణ్యాత్ములు అంటారు. పైకి చూడటానికి మాత్రం సీతారాముల దగ్గర లక్ష్మణ స్వామి కొలువై ఉండే ప్రదేశం ఖాళీగా కనపడుతుంది. 



అక్కడ ఆలయంలోకి ప్రవేశించాక ముందుగా కౌసల్యామాత దర్శనం చేసుకోవాలి. అటుపిమ్మట సీతా రామాంజనేయ లక్ష్మణులను దర్శనం చేసుకోవాలి. 



ఆలయంలోకి ప్రవేశించనవారందరూ, "సహజంగా నాకు లక్ష్మణ స్వామి కనపడ్డాడు" అనే చెబుతారు. కనపడ లేదంటే వారిని పాపాత్ములు అనుకుంటారనేది వారి భయం. 
 దేవాలయంలో భక్తులు లేనప్పుడు, అర్చక స్వా మి ప్రశాంతంగా ఉన్నప్పుడు లక్ష్మణ స్వామి గురించి అర్చక స్వామిని అడిగితే, " లక్ష్మణ స్వామి ఇంత వరకు నాకే కనపడలేదు. ఆయన ఎవరికీ కనపడకుండా ఉండి "శ్రీరామ కోటి " వ్రాసుకుంటున్నారేమో అని నాకు అనిపి స్తుంది" అని చిరునవ్వు తో అంటారు. అదేమిటంటే అదంతే అంటూ ఉంటారు. 
 "కదిలే కాలం నీతో కలిసి వస్తుంటే నీకు కావల్సిన వన్నీ నీ కళ్ళముందే కనపడతాయి. కలసిరాని కాలంలో నువ్వేం చేసిన తాడే పామై కరచినట్లు నీ పనులే నిన్ను చుట్టుముట్టి నిన్ను అధః పాతాళంలోకి తోసేస్తాయి. దేవళ దర్శనం చేసుకుంటే కాలంతో పాటు నువ్వు కదులుతున్నావని అర్థం. లక్ష్మణ స్వామి కనపడితే కాలమే నిన్ను అనుసరిస్తుందని అర్థం. అంత అదృష్టం శ్రీరామ చంద్రమూర్తికే కలగలేదు. ఆయన కాలంతో పాటే కదిలారు. పడాల్సిన కష్టాలన్ని పడ్డారు. దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసారు. " అని అర్చక స్వామి తనదైన వేదాంతం వల్లిస్తారు. 



 కొందరు అర్చక స్వాములు అక్కడి జానపదులతో కలిసి లక్ష్మణ స్వామి మీద కొన్ని జానపద గేయాలను కూడా రచించారు. 



అందులో
"అయ్యా ఓరయ్యా లక్ష్మణా.. 
అన్నమాట జవదాటని ముద్దుల తమ్ముడా.. లక్ష్మణా.. 
గుడిలోన దొంగాటలు ఆడుతున్నవా? 
నీ వదినమ్మకు నాకు ముదముప్పొంగ ఆడుతున్నవా? అయ్యా ఓరయ్య లక్ష్మణా.." వంటివి ఉన్నాయి. 



  దేవళానికి రఘురామానుజవల్లభ్ వంశానికి దేవతలు సహితం విడదీయరాని సంబంధం ఉంది. రఘు రామానుజవల్లభ్ వంశం వారు లేనిదే దేవళం లేదనే చెప్పాలి. మాటకు వస్తే వూరే లేదని చెప్పాలి. 
 రఘురామానుజవల్లభుని అందరూ "అనుజ వల్లభ్ అనుజవల్లభ్" అని పిలుస్తారు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - పంచమ వేదం - by k3vv3 - 02-04-2025, 09:04 AM



Users browsing this thread: 1 Guest(s)