Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#62
రెండవ సంవత్సరం లో శివరాత్రి పండుగ టైం లో వీళ్ళ పిల్లలతో పాటు వివేక్ కూడా నంద్యాలకు వచ్చాడు. 



 “అమ్మా, శివరాత్రి రోజు మనం నంద్యాలకు పేరు రావడానికి కారణమైన నవ నందులను చూసి వద్దామా? ఒకటి రెండు చూశాము గానీ అన్నీ పండుగ రోజే చూడలేదు అన్నాడు సుధీర్.



అలాగే. కొన్ని చోట్లకు బస్ లు ఉండవేమో. కారు మాట్లాడుకొని వెళ్దాము. నంద్యాలలో ఉన్న మహానందీశ్వర స్వామి దేవళం తో మొదలు పెడదాము. అన్నీ చూసుకొని రాత్రికి ఇంటికి చేరవచ్చు అని సుధాకర్ చెప్పాడు. 



అనుకున్నట్లుగా శివరాత్రి రోజు ఉదయం బయలుదేరి నంద్యాల చుట్టుపక్కల ఉన్న తొమ్మిది నందీశ్వరాలయాలను దర్శించుకొని వచ్చారు. ఇందువల్లనే ఇంగ్లీష్ వారు నంది ఆల్ ను నంద్యాలగా పిలిచారని గుర్తుచేసుకున్నారు.



సుజిత జుట్టు చూసి సుందరమ్మ అయ్యో ఇదేమిటే? జుట్టంతా ఇలా అయిపోయింది. ఎర్రగా, చివరలంతా చిట్లిపోయి ఉంది. షాంపూలతో తలకు పోసుకుంటే ఉన్న జుట్టు ఇలాగే పాడైపోతుంది అంటూ సుజితకు నలుగు పెట్టి శనగపిండితో తలకు పోసింది.



సుధీర్ ను చూడగానే నా తండ్రే. హాస్టల్ తిండి తిని ఎంత చిక్కి పోయావురా? అంటూ సుధీర్ కు స్పెషల్ గా మినప సున్ని ఉండలు చేసి పెట్టింది.



పిల్లలు ఇంట్లో కూడా ఒక సిస్టమ్ కొని పెట్టారు. చెరొక లాప్టాప్ ఉండనే ఉంది. సుధాకర్, సుజాతలు ఇప్పుడు ఇంకో సిస్టమ్ ఎందుకు? డబ్బులు వేస్ట్ కదా? అన్నారు.



టీ.వి. లో కాకుండా ఇందులో సినిమాలు చూసుకోవచ్చు అని చెప్పారు పిల్లలు. వారం వారం చేసే వీడియో కాల్ సిస్టమ్ లో ఐతే బాగా వుంటుందని కూడా చెప్పారు. 
 వీళ్ళు థర్డ్ ఇయర్ కు వచ్చేటప్పటికి వివేక్ వేద విద్య పూర్తయ్యింది. సుజన వివేక్ పెళ్ళి సుజితతో చేస్తే బాగుంటుందని అనుకుంటోంది. కానీ పౌరోహిత్యం లో నిలకడ లేని ఆదాయం ఉంటుంది అని సుధాకర్ అభిప్రాయపడ్డాడు. వీళ్ళిలా మధన పడ్తున్న సమయంలో పిల్లలిద్దరూ సెలవులకు ఇంటికి వచ్చారు. 
 అప్పుడు పిల్లలతో విషయం కూడా చర్చించారు. సుజాత మేనరికం చేసుకొంటే కొత్తగా వచ్చే అత్తగారితో ఇబ్బందులేమైనా వచ్చే అవకాశముండకపోవచ్చని అనుకుంది. సుందరమ్మ కూడా కోడలి వైపే మాట్లాడింది. కానీ సుజిత తన క్లాస్మేట్ శామ్యూల్ ను ప్రేమించాననీ, ఇద్దరం పెళ్ళి చేసుకుందామని అనుకున్నామని గట్టిగా చెప్పేసింది.



హాస్టల్ లో చేర్పించింది మీరు ఇంట్లో డిస్ట్రబెన్స్ లేకుండా చదువుకుంటారని. అంతేగానీ ఇలా ప్రేమ, దోమ అంటారని కాదు అంటూ సుజాత కోప్పడింది. 



అందులోనూ వర్ణాంతర వివాహానికి సుజాత బాగా కంగారు పడింది. 



సుజితా, ఎంత సర్డుబాటుచేసుకున్నా ఎన్ని కలహాలు వస్తాయో? అప్పుడు వాళ్ళ తల్లి తండ్రులు మన మాట వినక పోవచ్చు. ఇబ్బంది అవుతుంది అంటూ సుధాకర్ కూడా నచ్చ చెప్పాలని చూశాడు.



అయినా సుజిత వినలేదు. సరేనని వీళ్ళే వెళ్ళి అబ్బాయి తల్లితండ్రులతో మాట్లాడారు. వాళ్ళు ససేమిరా వప్పుకోలేదు. 
మా అబ్బాయిని మీ అమ్మాయి వల్లో వేసుకుంది. పెళ్ళి జరిగితే మేము ఇద్దరినీ ఇంట్లోకి రానివ్వము అని అబ్బాయి తల్లి కేకలు పెట్టింది.



పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు కదా! పెళ్ళి చేద్దామండీ అని వీళ్ళెంతో నచ్చచెప్పాలని చూసినా వాళ్ళు వినలేదు.



తొందరపడవద్దనీ, కొద్దిరోజులకు వాళ్ళు వప్పుకోవచ్చనీ ఇద్దరికీ సుధాకర్ నఛ్చచెప్పాడు.



వివేక్ కు కడపలోనే ఇంటర్మీడియెట్ చదివిన అమ్మాయితో పెళ్ళి చేశారు, సుజాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు. సుజాత కూతుర్ని చేసుకోవాలనుకున్నా అందని ద్రాక్ష పుల్లన సామెత ను రుజువు చేస్తూ అమ్మాయికి వేరే వూర్లో ఉద్యోగం వస్తే వివేక్ కు అక్కడ మళ్ళీ పౌరోహిత్యం వెతుక్కోవాలి కదా? అన్నారు, సుజాత కూతురి ప్రేమ విషయం కొంచెం చెప్పగానే. 



సుజాతకు కళ్ళ నీళ్ళు వచ్చేశాయా మాటలకు.
నాలుగో సంవత్సరం లో క్యాంపస్ సెలక్షన్ లో వాళ్ళిద్దరికీ, శామ్యూల్ కు కూడా ఉద్యోగాలోచ్చాయి. పరీక్షలు పూర్తవగానే ఎవరికీ చెప్పకుండా సుజిత ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకుంది. అబ్బాయి తల్లి తండ్రులు వీళ్ళను ఇంట్లోకి రానివ్వలేదు. అబ్బాయి మౌనంగా వుండిపోయాడు.



 “వాళ్ళ తప్పేమీ లేదు. భయం లేకుండా ఇంట్లో చెప్పకుండా పిల్లలు పెళ్ళి చేసుకుంటే ఇలాగే చెయ్యాలి. ఇన్ని సంవత్సరాలు పెంచిన కొడుకు ఇంట్లో చెప్పకుండా పెళ్ళి చేసుకుంటే ఎవరైనా ఇలాగే చేస్తారు అని సుధాకర్ శామ్యూల్ కు సర్ది చెప్పాడు.
ఇప్పుడా పిల్లకు అత్తగారింటి అండదండలు దొరకవు. సంసారం ఎలా గడుస్తుందో? అని సుందరమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.



ఇక అన్నింటికీ మనమే ఆదుకోవాలి నిసృహాగా అంది సుజాత.



సుధీర్ పెళ్ళి కూడా త్వరగా చేద్దాం. లేదంటే మంచి సంబంధం వాళ్ళు పిల్లను ఇవ్వరు అన్నాడు ఆలోచనగా సుధాకర్. 



ముగ్గురూ బెంగుళూరు లో ఉద్యోగాలలో చేరారు. శ్రీరామా ఇన్ లో ఒకే ఫ్లోర్ లో పక్కపక్కనే రెండు అపార్ట్మెంట్స్ తీసుకొన్నారు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - అందిన ద్రాక్ష తియ్యన - by k3vv3 - 31-03-2025, 02:40 PM



Users browsing this thread: 1 Guest(s)