Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
"కనీసం... గుడికి" మెల్లగా తలదించుకొని అడిగింది ప్రణవి.



"వెళ్ళకూడదు" శాసించినట్లు హెచ్చుస్థాయిలో చెప్పాడు ప్రజాపతి.



"అలాగేనండీ!..." మెల్లగా చెప్పింది ప్రణవి.



"ఇక నీవు వెళ్ళవచ్చు!..."
ప్రణవి కుర్చీ నుంచి లేచి... వేగంగా బయటికి నడిచింది. ఫ్యాక్టరీలో పనిచేసే వారిలో తనకు నమ్మకస్తులైన నలుగురిని ఇంటి కాపలాకు వుంచాలని నిర్ణయించుకొన్నాడు. గది నుండి బయటికి నడిచి కార్లో నూనె ఫ్యాక్టరీకి బయలుదేరాడు ప్రజాపతి.
రోజు ఉదయం ఈశ్వర్ హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాడు. స్నానం, టిఫిన్ అయిన తర్వాత హాల్లో కూర్చుని హిందూ న్యూస్ పేపర్ను చూస్తున్న ఈశ్వర్ను హరికృష్ణ లావణ్య సమీపించారు. ఎదుటి సోఫాలో కూర్చున్నారు. వారిని చూచిన ఈశ్వర్ నవ్వుతూ "నాన్నా!... అమెరికా నుండి అండ్ స్పెషలిస్ట్ డాక్టర్ బ్రౌన్ చెన్నైకి వచ్చారట. వారంరోజులు వుంటారట. పేపర్లో చదివాను. వారికి మన విష్ణును చూపించాలని నా అభిప్రాయం. మీరేమంటారు నాన్నా!..."



"నీ నిర్ణయం మంచిదే ఈశ్వర్" అన్నాడు హరికృష్ణ.



వాకిట్లో పోస్ట్ మెన్....
"సార్ పోస్టు!..." పిలుపు.



ఈశ్వర్ వేగంగా వెళ్ళి అతను అందించిన కవర్ను చేతికి తీసుకొన్నాడు. వ్రాసింది శివరామకృష్ణ.



"నాన్నా!... మామయ్య వ్రాశారు" ఉత్తరాన్ని హరికృష్ణకు అందించబోయాడు.



"కూర్చో!... విప్పి నీవే చదువు" అన్నాడు హరికృష్ణ.



ఈశ్వర్ కవర్ చించి ఉత్తరాన్ని బయటికి తీశాడు.
"ఉత్తరం చాలా పెద్దదిగా ఉంది. విషయం ఏమై ఉంటుందండీ!" సందేహంతో అడిగింది లావణ్య.



"వాడు చదువుతాడుగా విను..." చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.



ప్రియాతి ప్రియమైన హరికి...
పెదనాన్నగారి మాటను కాదని వూరిని, అయినవారినీ వదిలాను. చెన్నైకి వెళ్ళిపోయాను. మనిషికి ధన సంపాదనే ముఖ్యం అని భావించాను. వ్యాపారాభివృద్ధి కోసం వైజాగ్ చేరాను. రేయింబవళ్ళు కష్టపడ్డాను. డబ్బును సంపాదించాను. పిల్లలను వారి ఇష్టానుసారంగా బాగా చదివించాను. సముద్రాలను దాటించి వారి ఇష్టానుసారంగా విదేశాలకు పంపాను. రెక్కలొచ్చిన పక్షులు గూటిని విడిచి ఆకాశానికి ఎగిరిన రీతిగా వారు దేశాన్ని, నన్ను, నా భార్యని వదలి సుదూర తీరాలకు వెళ్ళిపోయారు. వారి ఇష్టానుసారంగా వివాహాలు చేసుకొన్నారు. 



వారి దృష్టిలో మేము తల్లిదండ్రులుగా కాకుండా చుట్టాలుగా మారిపోయాము. ఎప్పుడో... నిశిరాత్రిలో ఫోన్లో నాలుగు మాటలు... అంతే. మమ్మల్ని గురించి పట్టించుకోవలసిన బాధ్యతను వారు మరిచిపోయారు. మగపిల్లలే కాదు... ఆడపిల్లలూ అలాగే మారిపోయారు.



చచ్చేంతవరకూ... వారిని విషయంలోనూ చేయి చాచి అడగకూడదని స్నేహితునితో కలిసి వ్యాపారాన్ని పెంచాను. ఎంతో శ్రమించాను. లక్ష్యాన్ని సాధించాను. ఇదంతా చేసింది విష్ణు కోసం. వాడి శేష జీవితం ఆనందంగా సాగాలనే లక్ష్యంతో... కానీ... దురాశ దుఃఖమునకు చేటు అన్నట్లు నేను ఎంతగానో నమ్మిన నా పాట్నర్, హితుడు దండాయుధపాణి నన్ను మోసం చేశాడు. 



తను వారిని కంపెనీలో ప్రవేశపెట్టి తన బలాన్ని పెంచుకొన్నాడు. లెక్కను తారుమారుచేశాడు. కాంట్రాక్ట్ వ్యాపారం నష్టాల పాలైందని మొసలి కన్నీరు కార్చాడు. చుట్టూ వున్న అతని వారు వంత పాడారు. పువ్వులను అమ్మిన చోట కట్టెలను అమ్ముకొనే స్థితికి తీసుకొని వచ్చాడు. ఆఫీస్లో వారంతా ఒక్కటి. నేను ఏకాకినైపోయాను. శత్రుశేషం.... ఋణశేషం వుండకూడదు గదా! ఆస్తినంతా ఎంతో ప్రీతిగా మూడు కోట్లతో నిర్మించిన ఇంటితో సహా... అమ్మి అప్పులను తీర్చాను. 



గూడూరు నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రిందట ఎలా నా భార్యతో చెన్నైకి వెళ్ళానో... అలాగే... నీ సన్నిధికి మన వూరికి నీ చెల్లెలు ఊర్మిళ, విష్ణులతో తిరిగి వస్తున్నాను. నీవు నా తప్పులను మన్నించి నాకు ఆశ్రయాన్ని కల్పిస్తావనే ఆశతో... వారంరోజుల్లో వస్తున్నాను. నా ఇంటికి బాగు చేయించు... నేను నా శేష జీవితాన్ని ఇంట్లోనే, నా వూర్లోనే గడపదలచుకొన్నాను. నీవు తప్పక నాకు సాయం చేయగలవనే ఆశతో!!!



ఇట్లు
నీ... శివరామకృష్ణ



ఈశ్వర్ ఏకధాటిగా ఉత్తరాన్ని చదివి ముగించాడు. ముగ్గురి మనస్సులు, ముఖాలు ఒకే రీతిగా విచారంగా మారిపోయాయి.



ఈశ్వర్ సెల్ మ్రోగించి ఆన్ చేశాడు. అది దీప్తి కాల్.
"హలో!..."



"బావా!"
"అవును"
"ఎప్పుడు వచ్చారు?"
"ఉదయాన్నే!"



"ప్రజాపతి నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు?"
"ఏంటీ!"
"అదే... మీ మామగారు... నన్ను!..."



"ఈశ్వర్!... దీప్తి కదూ... ఇలా యివ్వు"
ఈశ్వర్ ఫోన్ను లావణ్యకు అందించాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 16 - by k3vv3 - 27-03-2025, 09:51 AM



Users browsing this thread: 1 Guest(s)