Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#99
ఫ్యాక్టరీ నుంచి ప్రజాపతి తిరిగి వచ్చాడు.
కారుదిగి... వరండాలో ప్రవేశించి....
"ప్రణవీ! నా మిత్రుడు అతని భార్యా, కొడుకు డాక్టర్ దివాకర్ బాబు రేపు పదిగంటలకు మన ఇంటికి వస్తున్నారు. తొమ్మిది గంటలకల్లా అమ్మాయిని బాగా అలంకరించి సిద్దంగా వుంచు" చెప్పాడు ప్రజాపతి.



ప్రణవి మౌనంగా తలదించుకొంది.
"ఏం మాట్లాడవు?"



"కుదరదండి" మెల్లగా చెప్పింది ప్రణవి.



"ఏమిటీ?" ఆవేశంతో అన్నాడు ప్రజాపతి.
"అవును... అమ్మాయి ఇంటికి దూరం!" విచారంగా నటనతో చెప్పింది ప్రణవి.



"నీవు చెప్పేది నిజమేనా!" ఆవేశంగా అడిగాడు ప్రజాపతి.



"ఏమిటండీ మీరు అలా అడుగుతున్నారు? కావాలంటే మీరే మీ అమ్మాయిని అడగండి" ఎంతో అమాయకంగా చెప్పింది ప్రణవి.



"ఛీ...ఛీ... నేనేమిటే అమ్మాయిని అడిగేది!" ముఖం చిట్లించి చెప్పాడు ప్రజాపతి.



"వారికి పైవారంలో మరో మంచిరోజు చూచుకొని రమ్మని వెంటనే చెప్పండి" ప్రాధేయపూర్వకంగా చెప్పింది ప్రణవి.



తనగదిలో కూర్చొని తల్లితండ్రికి మధ్యన జరిగే సంభాషణను వింటూ ఆనందంగా నవ్వుకొంటూ వుంది దీప్తి.



ప్రజాపతి సెల్ మ్రోగింది.
"హలో!... ... నీవా పరం, నేనే నీకు ఫోన్ చేయబోతున్నాను"



" విషయాన్ని గురించిరా!" పరంజ్యోతి కంఠం తీవ్రంగా ఉంది.



విషయాన్ని గమనించిన ప్రజాపతి... వేగంగా తన ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు.
"పరం! ముందు నేను చెప్పే మాట విను. ఇంట్లో నెలసరి వచ్చే ఆడవాళ్ళ ఇబ్బందులు. అదీ అమ్మాయికి. రేపటి మీ ప్రోగ్రాం మార్చుకోవాలి" అనునయంగా చెప్పాడు ప్రజాపతి.



"ఇదేనా నీవు చెప్పదలచుకొన్నది?"



"అవును పరం!" వందనంగా జవాబు చెప్పాడు ప్రజాపతి.



"సరే! నేను అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు!"
"అడుగు!"



"నీ అల్లుడు ఈశ్వర్ని దీప్తి ప్రేమిస్తుందా!"
"ఏమిటా మాట.. నో...నో... నా కూతురు నిప్పు!"



"నీ కూతురు నిప్పో... ఉప్పో... నేను చెప్పిన మాటను ఈశ్వర్గాడు నా కొడుకుతో చెప్పాడు. వాడు అబద్ధం ఎందుకు చెబుతాడ్రా."



"కడుపు మంటతో చెప్పి వుండవచ్చు. నా కూతురికి నీ కొడుక్కు జరుగబోయే వివాహాన్ని ఆపేటందుకు అలా చెప్పి వుండవచ్చు. ఇంటిమీద కాకి మా ఇంటిమీద వాలదురా!... అలాంటిది నా కూతురు వాణ్ణి ప్రేమించడమా!... అబద్ధం... ఈశ్వర్ గాడు చెప్పింది పచ్చి అబద్ధం. నా మాటను నమ్ము పరం!..." ముందు ఆవేశంగా చెప్పి చివరికి అనునయంగా ముగించాడు ప్రజాపతి.



"మరి మేము ఎప్పుడు రావాలి?"
"నాలుగు రోజుల తర్వాత మీ ఇష్టం వచ్చినప్పుడు రండి. ముందురోజు నాకు ఫోన్ చెయ్యి."



"అలాగే ప్రజా!..." పరంజ్యోతి సెల్ కట్ చేశాడు.



ప్రజాపతి మనస్సులో అనుమానం... దీప్తి ఈశ్వర్ గాడిని ప్రేమిస్తూందా!... ఈశ్వర్ గాడు దీప్తిని ప్రేమిస్తున్నాడా! పరంజ్యోతి చెప్పిన మాటలు నిజమా!... అబద్ధమా! ఏది ఏమైనా దీప్తి వివాహం దివాకర్తో జరగి తీరాలి. ఎవరైనా అడ్డు తగిలితే వాణ్ణి నరికేస్తాను. దీప్తి వివాహం దివాకర్తోనే జరిపిస్తాను అనుకొన్నాడు ప్రజాపతి.



నిర్ణయాన్ని తీసుకొన్నాడు కాని... అతని మనస్సులో మూల దీప్తి మీద అనుమానం! దీప్తిని గురించి ఆలోచిస్తూ కుర్చీలో సాలోచనగా కూర్చున్నాడు ప్రజాపతి.
"ప్రణవీ!" బిగ్గరగా పిలిచాడు.



పోలికేకను విన్న ప్రణవి ప్రజాపతి ఆఫీస్ గదిని సమీపించింది. ద్వారం ముందు నిలబడి...
"ఏమండీ!... ఏం కావాలి!" మెల్లగా అడిగింది.



"లోనికిరా!"
ప్రణవి గదిలోకి ప్రవేశించింది. క్షణంసేపు అతని ముఖంలోకి చూచి తలదించుకొంది.
"కూర్చో!"



అతనికి ఎదురుగా టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది. 
ఎందుకో ఇంత మర్యాద! ఏం శాసించబోతున్నారో! అనుకొంది ప్రణవి.
"నేను చెప్పేది జాగ్రత్తగా విను!"



అలాగే అన్నట్లు తలను ఆడించింది ప్రణవి.
"నాలుగురోజుల తర్వాత... పరంజ్యోతి, వాడి భార్య, కొడుకు డాక్టర్ దివాకర్ మన అమ్మాయిని చూచేదానికి వస్తున్నారు. రోజు నుంచి నీవుగాని, అమ్మాయిగాని నా పర్మిషన్ లేకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు."
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 16 - by k3vv3 - 27-03-2025, 09:50 AM



Users browsing this thread: 1 Guest(s)