Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#73
 పంచమ వేదం అనదగిన మహా భారతం కథను వేద వ్యాసుడు నారద మహర్షి కి చెప్పాడు. మహా భార తం ను. వ్యాస మహర్షి చెప్పగా విన్న నారద మహ ర్షి," కేవలం ఇది పంచమ వేదమే కాదు. వర్తమాన భూత భవిష్యత్ విజ్ఞాన తేజం. జీవన రూపం "అని వ్యాస మహర్షి తో అన్నాడు. అంత వ్యాస మహర్షి" దీనిని స్వర్గ లోకం లో ప్రచారం చేయమని నారద మహర్షి అన్నాడు.. 



అందుకు నారద మహర్షి అలాగే అని,"నారాయణాయ ఘన చరిత నవ రస భరితం శ్రీ కృష్ణ లీలామృతం పంచమ వేదం మహా భారతం " అంటూ స్వర్గ లోక వాసులకు కృష్ణ ద్వైపాయన వేద వ్యాసుడు వ్రాసిన మహా భారతం కథను వినిపించసాగాడు. 



 ఆపై మహా భారతం కథను పితృ లోకం లో చెప్పడానికి దేవలుడిని నియమించాడు. 



 వేద వ్యాస మహర్షి ఒకసారి తన కుమారుడు అయిన శుక మహర్షి వైపు చూసాడు.తను కర్ణికా వనమున తపస్సు చేసిన రోజులు అతనికి గుర్తుకు వచ్చాయి
............
వేద వ్యాస మహర్షి మేరు పర్వతము అందాలను చూస్తూ కర్ణికావనమునకు వెళ్ళాడు. అక్కడ పర మశివుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేద వ్యాస మహర్షి తపస్సు కు మెచ్చి శివుడు ప్రత్యక్ష మై ఏం వరం కావాలని అడిగాడు. 



వ్యాస మహర్షి "నీరు నిప్పు నేల గాలి ఆకాశము తో సమానమైన కుమారుడు కావాలని పరమ శివుని ప్రార్థించాడు. పరమశివుడు తథాస్తు అన్నాడు.



వ్యాసుడు మహదానందం తో హోమము చేయడానికి అరణిని మధించసాగాడు. అప్పుడు అక్కడికి ఘృతాచి అనే అప్సరస వచ్చింది. వ్యాసుడు ఘృతాచి ని చూసాడు. అతని మనసు ఆమె మీదకు పోయింది. ఘృతాచి చిలుక రూపం ధరించింది.



వ్యాసుని మనసు చిలుక రూపంలో ఉన్న ఘృతాచి మీదనే ఉంది. ఘృతాచి తేజస్సు వ్యాసుని తేజస్సు ఏకమవ్వడంతో కాంతులు వెదజల్లే సుపుత్రుడు వ్యాస మహర్షి ముందు పచ్చికతో చేసిన ఉయ్యాలలో కిలకిల నవ్వసాగాడు. అతని వదనం చిలుక ఆకారంలో ఉంది.



ఘృతాచి శుకాకార పసికూనను చూచి మాతృ హృదయం తో వ్యాసుని ముందుకు వచ్చి రెండు చేతులు జోడించి అతని ముందు రెండు మోకాళ్ల మీద నిలబడింది. వ్యాసుడు ఘృతాచిని చూసాడు.



"ఘృతాచి! నువ్వు అప్సరసవైనప్పటికి నన్ను చూడగానే నీలోని సురకామ తేజస్సు నిలువున దహించుకు పోయి ద్వాపర యుగ మానవోత్తమ మగువ తేజస్సు ఆవిర్భవించింది. అది సుర తేజస్సు కన్నా వంద రెట్లు మహోన్నతమైనది. తేజస్సే నన్ను ఆవహించింది. పసి బాలుని పుట్టుకకు కారణమైంది. పసి బాలుడు శుక మహర్షి అనే పేర ప్రసిద్ధి చెందుతాడు. నీలో ప్రస్తు తం మానవోత్తమ మగువ తేజం కనపడటం లేదు. కావున నువ్వు అప్సర ఘృతాచిగ దేవ లోకం వెళ్ళు. " అని ఘృతాచి తో వ్యాసుడు అన్నాడు.



"అలాగే" అని ఘృతాచి దేవ లోకం వెళ్ళిపోయింది.



శుకునకు గంగ స్నానం చేయించింది. శివపార్వతులు శుకునకు ఉపనయనం చేసారు. బృహస్పతి విద్య నేర్పించాడు. ఆవు పాలు పితికినంత సేపు కూడా ఒక చోట ఉండని శుకుని వ్యాసుడు మోక్షాది మార్గాలు తెలుసుకు రమ్మని జనకుని దగ్గరకు పంపాడు
.................
గతాన్ని గుర్తు చేసుకుంటూ జనకుని దగ్గరకు వెళ్ళి వచ్చిన శుక మహర్షి ని వ్యాసుడు పిలిచా డు.. అంత శుక మహర్షి తో, "నాయనా శుక! నువ్వు గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాదులకు వెళ్ళి పంచమ వేదం అనదగిన నేను వ్రాసిన మహా భారతం చెప్పు." అని వ్యాసుడు ఆన్నాడు. 



శుక మహర్షి చిత్తం తండ్రి అన్నాడు.. తర్వాత సర్ప లోకంలో మహా భారతం చెప్పడానికి సుమంతుడిని నియమించాడు. మానవ లోకం లో చెప్పడానికి వైశంపాయనుని నియమించాడు. అలా వ్యాస భగవానుని శిష్యాదుల వలన తన పంచమ వేదం అనదగిన మహా భారతం సమస్త లోకాలకు తెలిసింది.



పంచమ వేదం మహా భారతం పరమ పవిత్రం మహోన్నత విజ్ఞానం. 
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి 



 సర్వే జనాః సుఖినోభవంతు 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - వధూసర - by k3vv3 - 26-03-2025, 02:34 PM



Users browsing this thread: 1 Guest(s)