24-03-2025, 10:17 PM
అందిన ద్రాక్ష తియ్యన
రచన: తాత మోహనకృష్ణ
సుబ్బారావు నూనూగు మీసాల వయసు నుంచి..అందమైన పెళ్ళాం కోసమే కలలన్నీ. ఎక్కడో చదివినట్టు, అందమైన అమ్మాయి పెళ్ళాం అయితే, లైఫ్ చాలా బాగుంటుందని నమ్మకం. అందుకే ఎన్ని పెళ్ళి సంబంధాలు వచ్చినా, వద్దని చెప్పేసేవాడు. వయసు ఆగదు కదా... అది రోజు రోజు కు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు సుబ్బారావు వయసు ముప్పై దాటింది..
"ఒరేయ్ కన్నా! ముప్పై దాటితే..ముదిరిన బెండకాయ అంటారు రా! పెళ్ళి చేసుకోరా..చెప్పింది వినరా!" అంది అమ్మ..
"నా సినిమా హీరోలు అందరూ ఇంకా పెళ్ళి చేసుకోలేదు. వాళ్ళకి నా కన్నా ఎక్కువ వయసే కదా అమ్మా!..నా కేంటి చెప్పు?"
"ఒరేయ్! వాళ్ళు సెలబ్రిటీస్...వాళ్ళకి ఎప్పుడైనా అమ్మాయిలు లైన్ కడతారు. నువ్వు ఒక చిన్న ఉద్యోగి...తర్వాత నీ ముఖం కుడా ఎవరూ చూడరు. ఎందుకు నీకు ఇంత పట్టుదల చెప్పు..! పెళ్ళానికి అందం కాస్త తక్కువ అయితే ఏమిటి చెప్పు..మంచి మనసుంటే చాలదూ...?"
“అవును రా! నీ మరదలు రమ్య..నువ్వంటే చాలా ఇష్టపడుతుంది. చిన్నప్పుడు నువ్వు, రమ్య చాలా స్నేహంగా ఉండేవారు. అప్పట్లో మేమంతా ఇద్దరి జంట చూసి మురుసిపోయాము. ఇప్పుడేమో.. నువ్వు నీ మరదలంటే ఇష్టం లేదంటావు.. ? నీ మరదలైతే.. ఇంకా నీ గురించే ఆలోచిస్తోంది..”
"లేదమ్మా! నేను ఇంకో రెండేళ్ళు వెయిట్ చేస్తాను..అందమైన పెళ్ళాం వస్తుందేమో..!"
"ఇంకో సంవత్సరం పొతే...నీ మరదలు కుడా నిన్ను చేసుకోదు..ఏ దిక్కు లేకపోతే, మావయ్య కూతురే దిక్కని అప్పుడు అనుకున్నా.. ఏమీ ప్రయోజనం ఉండదు.."
"మరీ భయపెట్టకే అమ్మా! నువ్వు గట్టిగా ప్రయత్నించు..నీకు మంచి అందమైన కోడలు వస్తుంది. నువ్వు నీ కోడలు గురించి, మీ ఫ్రెండ్స్ కి గొప్పగా చెప్పుకోవచ్చు.."
రెండు సంవత్సరాలు గడచింది...అప్పట్లో, నెలకొక పెళ్ళి సంబంధం వస్తే...ఇప్పుడు సంవత్సరానికి ఒక్కటే మహా కష్టం అయింది. సుబ్బారావు కు తన చుట్టుపక్కల ఉన్న అబ్బాయిలందరూ పెళ్ళిళ్ళు చేసుకుని...సరదాగా ఉంటుంటే, ఎక్కడో బాధనిపించింది. మంచి ఉద్యోగం ఉంది..కానీ ఏం ప్రయోజనం..? వయసేమో కరిగిపోతోంది. ఇంకా కొంతకాలం ఆగితే, కష్టమని గ్రహించాడు సుబ్బారావు.
"అమ్మా! నువ్వు చెప్పినట్టే పెళ్ళి చేసుకుంటాను...అందాన్ని ఏమైనా కొరుక్కు తింటామా ! మంచి మనసుంటే చాలు..నన్ను బాగా చూసుకుంటే చాలు. అందం శాశ్వతం కాదు కదా..!"
"నీ కళ్ళు చాలా లేట్ గా తెరుచుకున్నాయి కన్నా..! ఇప్పుడు చామన ఛాయ గా ఉన్న అమ్మాయి కూడా నీకు 'నో' అంటోంది..వారికీ డిమాండ్ బాగా పెరిగింది. మావయ్య కూతురికి కుడా ఇంకో సంబంధం చూస్తున్నారు..."
"నేను వెళ్లి మాట్లాడతాను నా మరదలితో..." అన్నాడు సుబ్బారావు.
"అదేంట్రా! రమ్య కు అంత సీన్ లేదన్నావు కదా..!"
సుబ్బారావు తన మరదలిని కలవడానికి బయల్దేరాడు. ముందు ఫోన్ చేద్దాం అనుకున్నాడు. కానీ, రమ్య ని కలిసి మాట్లాడితే బాగుంటుందని అనుకున్నాడు. ఇంట్లో అయితే.. మావయ్య ఉంటాడు..ఎలా అని ఆలోచించాడు సుబ్బారావు. రమ్య కు కాల్ చేసాడు.
"హలో రమ్య! నేను నీ బావ ని.."
"హలో బావా..! ఏమిటి విషయం? ఏమిటి నేను సడన్ గా గుర్తొచ్చాను..?"
"నీతో మాట్లాడాలి రమ్య..అలా మన పక్క సందు లో ఉన్న పార్క్ కు వస్తావా..?"
"అలాగే బావ.."
రమ్య పార్క్ లో తన బావ సుబ్బారావు ని కలిసింది..
"మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా రమ్య..! నేనంటే నీకు చాలా ఇష్టమని కుడా చెప్పావు. చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలు, చేసిన అల్లరి గుర్తుకు లేవా..? ఇప్పుడు మీ నాన్న చూసిన సంబంధం చేసుకుంటావా..?"
"నువ్వంటే, నాకూ చాలా ఇష్టమే బావ..కానీ, నీకు నేను అందంగా లేనని అత్తయ్య చెప్పింది. అయినా, మీ అంతటి వారికి మేము ఎలా నచ్చుతాము చెప్పండి..?"
"ఛా...! నీకు ఎవరు చెప్పారు...నువ్వు ఐశ్వర్య రాయి కి కాస్త అటూ..ఇటు గా ఉంటావు..అందుకే ఇన్నాళ్ళు.. నేను నీకు సరిపోతానో లేదో అని ఆలోచించాను. అంతే..!"
"పో బావా..! నువ్వు మరీను. నా అందం గురించి అంతగా పొగడకు.. నాకు సిగ్గేస్తోంది.."
"అయితే నన్ను పెళ్ళి చేసుకుంటావా మరి..?" అడిగాడు సుబ్బారావు.
"నా కోసం మరి నాన్న ఓకే చేసిన సంబంధం మాట ఏమిటి చెప్పు..? ఆ అబ్బాయి అభిషేక్ బచ్చన్ లాగ ఉంటాడు తెలుసా..?"
"అందం లో ఏముంది చెప్పు...! నిన్ను నేను దేవత లాగ చూసుకుంటాను..నన్ను పెళ్ళి చేసుకో రమ్య..ప్లీజ్..!!!.." అని మరదలు కాళ్ళు పట్టుకునే అంత పని చేసాడు సుబ్బారావు..
****

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ