Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#96
ఈశ్వర్... దివాకర్కు ఫోన్ చేశాడు.
"హలో!.... డాక్టర్ దివాకర్ హియర్... మే నో హూమ్ యాం స్పీకింగ్!"
"ఈశ్వర్!"
"ఈశ్వర్!... హూ యీజ్ ఈశ్వర్?"



"దివాకర్!"
"యస్"
"నీవు తెలుగోడీవా? తెల్లోడివా?"



"వాట్... నీవు!"
"యస్... నీవు!"
"మై నేమ్ ఈజ్ డాక్టర్ దివాకర్"
"ఆఁ... ఆఁ... నీపేరు దివాకర్... డాక్టర్ దివాకర్వి! వివరాలు నాకు తెలుసు తమ్ముడూ!"
"తమ్ముడా?"



"కాకపోతే అన్నయ్య అనుకో"



"యు ఆర్ వేస్టింగ్ మై టైమ్!... వాట్ డు యు వాంట్?"
"ఒరేయ్ అన్నాయ్!... దివాకరా!.... తెలుగులో... అదే మన భాషలో మాట్లాడలేవా!..."
"ఏం మాట్లాడాలి?"
"నిన్ను గురించి"



"నన్ను గురించా!"
"అవును!"
"ఎవరితో?"
" విషయం నీకెందుకు?"
"నేను నీ శ్రేయోభిలాషినిరా!"



"రా!"
"అవునురా!"



"వు హ్యానో మ్యానర్స్!"
"అబ్బా!... మళ్ళా ఇంగ్లిపీసులో మొదలెట్టావా! దివాకరా!... నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీవు పెళ్ళిచూపులకి పోయి చూడబోయే పిల్ల అదీ డాక్టరే! నా మరదలు. అంటే నా మేనమామ కూతురు. దానికి నాకు ఎంతోకాలం నుంచి అఫైర్."



"అఫైర్!"
"అవును."
"మీరు చెప్పేది నిజమేనా!"
"నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందిరా! అంతేకాదు... మరో విషయం!"



"అదేమిటి?"
"మా ఇద్దరికీ గాంధర్వ వివాహం కూడా జరిగిపోయింది. ఆలోచించుకో!... అలాంటి పిల్లని నీవు పెళ్ళిచూపులకు వెళ్ళి చూడాలా!"



"ఇంతకు నీవెవరు?"
"ఒరేయ్! చెప్పాను కదరా... నా పేరు ఈశ్వర్ అని!"



" పిల్ల మా నాన్నగారి ఫ్రెండ్ కూతురు. అమెరికా రిటన్. డాక్టర్"
"బాబూ దివాకర్! నా లవర్ వివరాలు నాకు తెలియవా!... నీవు నాకు చెప్పాలా! ఇంకా విను... అది పుట్టుకతో నాకు వరసకు మరదలై... వయస్సు వచ్చాక లవర్ అయింది. అంతేకాదు అది నా మేనమామ కూతురు. చెప్పాల్సిన వివరాలన్నీ చెప్పేశా!... పెండ్లి చూపులకు వెళతావో!..., మానుకొంటావో!... అది నీ ఇష్టం... బైరా బ్రదరూ!... నీ శ్రేయోభిలాషి ఈశ్వర్" నవ్వుతూ ఈశ్వర్ సెల్ కట్ చేశాడు.



దివాకర్ వెంటనే తన తండ్రి పరంజ్యోతికి ఫోన్ చేసి తనకు ఈశ్వర్ చెప్పిన వివరాలన్నీ చెప్పాడు. పిల్ల తనకు ఇష్టం లేదన్నాడు.



అంతావిన్న పరంజ్యోతి...
"ఓరినా పిచ్చి కొడకా!. పిల్ల కోట్లకు వారసురాలు. మనకు పిల్లకంటే దాని ఆస్థి ముఖ్యం. నీవు ఎన్నేళ్ళు ఎంతమందికి సూదులు, దబ్బళాలు గుచ్చి, గోళీలు ఇచ్చి, కోటి రూపాయలను సంపాదిస్తావ్! దాని మెళ్ళో తాళి కట్టూ ఆస్తికి వారసుడివైపో!... నీకు నచ్చిన... నీవు మెచ్చిన మరో కాంతమ్మతో సెటప్ పెట్టుకో. జీవితాన్ని దర్జాగా, మంచి భవంతి, ఖరీదైన కార్లు, ఇంట్లో హాస్పిటల్ పరివారం, సమాజంలో సెలబ్రిటీ హోదా! వీటన్నింటినీ దక్కించుకో!.... జీవితాన్ని అన్నివిధాలా ఆనందంగా అనుభవించరా!.... నామాట విను. ఎల్లుండి మనం పెళ్ళిచూపులకు గూడూరికి వెళుతున్నామ్ ఏమంటావ్!"



దివాకర్ ఆలోచనలో పడ్డాడు. "అరగంటలో నీకు ఫోన్ చేస్తా డాడ్!" అన్నాడు.



అనేకవిధాలుగా ఆలోచించిన దివాకర్ చివరికి తండ్రి మాటే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చాడు. పరంజ్యోతికి పోన్ చేసి... "డాడ్! మీ మాటే నా మాట!" ఆనందంగా చెప్పాడు.



పరంజ్యోతి ప్రజాపతికి ఫోన్ చేసి "ఎల్లుండి శుక్రవారం పెళ్ళిచూపులకు వస్తున్నాము" చెప్పాడు.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 15 - by k3vv3 - 16-03-2025, 10:10 AM



Users browsing this thread: