Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#94
"రావేమో అనుకొన్నానే!" అంది.
"రాకుండా ఎలా వుంటానే. వస్తానని చెప్పానుగా! అటు చూడు..."
ఈశ్వర్ను చూపుతూ...
"నా బావ... ఈశ్వర్ అడ్వకేట్" నవ్వుతూ చెప్పింది దీప్తి.



ఈశ్వర్ను చూచి రాధ చేతులు జోడించింది.
"నమస్కారమండీ!" అంది.
నవ్వుతూ "నమస్తే..." అన్నాడు ఈశ్వర్.
దీప్తి చెవి దగ్గరకు నోటిని చేర్చి "దీపూ!... మీ బావ చాలా అందంగా వున్నాడే!" ఈశ్వర్ విషయంలో తనకు కలిగిన భావాన్ని నిస్సంకోచంగా వెల్లడించింది రాధ.



ముహూర్త సమయం ఆసన్నమయింది. వధూవరులు వేదికపైన కూర్చున్నారు. పురోహితులు మంత్రాలు చదవడం ప్రారంభించారు. పెద్దలందరూ మాంగల్యాన్ని తాకారు. దీప్తి, ఈశ్వర్లు కూడా తాకారు.



ఇలా నా మెడకు కట్టబోయే మంగళసూత్రాన్ని మా పెద్దలందరూ ఎప్పుడూ తాకుతారో! ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ అనుకొంది దీప్తి.



మాంగల్యధారణ జరిగింది. వచ్చిన వారంతా అక్షింతలతో దంపతులను దీవించారు. దీప్తి తాను తెచ్చిన గిఫ్టును రాధకు అందించింది. భోజనానంతరం రాధ ఆమె భర్త త్రివిక్రమ్కు చెప్పి ఈశ్వర్, దీప్తిలు బయలుదేరారు.



ఈశ్వర్ కారును నడుపుతున్నాడు చిరునవ్వుతో దీప్తి ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ వుంది. అది గమనించిన ఈశ్వర్...
ఏంటి దీపూ!..... అలా చూస్తున్నావ్!" అడిగాడు చిరునవ్వుతో తనూ నవ్వుతూ...
"ఏమీ లేదన్నట్లు తలూపింది దీప్తి.
"నీవు నవ్వితే... చాలా బాగుంటావు దీపు."
"అలాగా"
"అవును... నీపై వరుసన వున్న మధ్య రెండు పళ్ళు పెద్దగా మల్లెమొగ్గల్లా నీవు నవ్వినప్పుడు మెరుస్తాయి."
"అయితే... మిగతా పళ్ళల్లో మెరుపు లేదా" అమాయకంగా అడిగింది.



"ఉంది దీప్తీ రెండు కాస్త వెడల్పు కాబట్టి అవి ప్రత్యేక ఆకర్షణ."
రోడ్డు ప్రక్కన వరుసగా ఉన్న బంగారు షాప్స్ ను చూచింది దీప్తి.
"బావా!.... కారును ఆపండి"



"ఎందుకు?"
"చిన్నపని వుంది"
"ఎక్కడ?"
" షాపులో" ఎడమచేతి చూపుడు వ్రేలితో బంగారు షాపును చూపింది దీప్తి.



ఈశ్వర్ కారును ఆపాడు. ఇరువురూ కారు దిగి షాపులో ప్రవేశించారు.
"ఏం కొనాలి దీపూ!..."
"కాసేపు ఆగండి సార్!... మీకే తెలుస్తుంది."



గోల్డ్ రింగ్స్ వున్న కౌంటర్ వద్దకు వెళ్ళి రింగ్స్ ను చూపమని అడిగింది దీప్తి. కౌంటర్లో వున్న వ్యక్తి రింగ్స్ ను చూపించాడు. ఐదారు చూచి ఒకదాన్ని చేతికి తీసుకొని....
"బావా!... మీ చేతిని ఇలా ఇవ్వండీ."
"నాకా!..."



"మాట్లాడకూడదు. ఓన్లీ యాక్షన్ ప్లీజ్" చిరునవ్వుతో చెప్పింది దీప్తి. తన కుడిచేతిని దీప్తి కుడిచేతికి అందించాడు ఈశ్వర్.
ఈశ్వర్ చేతి మధ్య వేలుకు వుంగరం వున్నందున... తన చేతిలోని వుంగరాన్ని చూపుడు వ్రేలికి తొడిగింది. అది వ్రేలికి ఖచ్చితంగా సరిపోయింది.
"బాగుందా! బావా!..."
"చాలా బాగుంది."
"బిల్ ప్లీజ్!" సెల్స్ మేన్తో చెప్పింది దీప్తి.



వేయింగ్ మిషన్పై వుంగరాన్ని వుంచి.... బరువును చూపించి ఐదునిముషాల్లో బిల్లును వుంగరాన్ని వుంచిన చిన్నబాక్స్ ను సెల్స్ మెన్ దీప్తికి అందించాడు. కార్డు ద్వారా పేమెంట్ చేసింది దీప్తి.



తననే పరీక్షగా మాట్లాడకుండా చూస్తున్న ఈశ్వర్ను చూచి....
"థాంక్యూ బావా!... నా పని అయిపోయింది పదండి" నవ్వుతూ చెప్పింది దీప్తి.
ముందు ఈశ్వర్ వెనుక దీప్తి నడిచి కారును సమీపించి కూర్చున్నారు. ఈశ్వర్ కారును స్టార్ట్ చేయబోయాడు.
"బావా!... వన్ మినిట్!"
"వన్ మినిట్ !..."
"అవును..."
"వన్ మినిట్లో ఏం చేస్తావ్!"



పాకెట్ను విప్పి వుంగరాన్ని చేతికి తీసుకొంది దీప్తి.
"మీ కుడిచేతిని చూపించండి."
ఆశ్చర్యంగా చూచాడు ఈశ్వర్.
"చూపించండి మహాశయా!" చిరునవ్వుతో కోరింది దీప్తి.
ఈశ్వర్ తన కుడిచేతిని ముందుకు సాచాడు.
తన చేతిలోని వుంగరాన్ని ఈశ్వర్ కుడిచేతి చూపుడు వేలికి తొడిగింది.



"ఇక పదండి... స్టార్ట్!" గలగలా నవ్వింది దీప్తి.
ఆమె చర్యకు ఈశ్వర్ ఆశ్చర్యపోయాడు.



నా చేతి వ్రేలికి యాభై ఆరువేల డైమండ్ రింగ్ను తొడిగింది ఇది నేను ఆమెకు నీవు నా దానివి అని చెప్పిన దానికి నాకు బహుమానమా! మరి తనకు నేనూ ఏదో ఒకటి యివ్వాలిగా!... అవును... ఇవ్వాలి!... అతని దృష్టి తన కుడిచేతి చిటికెన వ్రేలికి వున్న వజ్రపుటుంగరం పై నిలిచింది. వెంటనే దాని ఊడదీసి....
"దీపూ! ఏదీ నీ వామహస్తం!" నవ్వుతూ అడిగాడు ఈశ్వర్ చిరునవ్వుతో. 



దీప్తి తన ఎడమచేతిని అతని ఎడమ చేతిలో వుంచింది. తన కుడిచేతిలోని వుంగరాన్ని ఈశ్వర్ దీప్తి ఎడమచేతి చూపుడు వ్రేలికి తొడిగాడు.
"నచ్చిందా దీపూ!..." ప్రీతిగా అడిగాడు ఈశ్వర్.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 15 - by k3vv3 - 16-03-2025, 10:04 AM



Users browsing this thread: