Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#70
పర్ణశాల లోపలినుండి అగ్నిదేవుని మాటలను విన్న పులోమ భయ భ్రాంత చిత్తంతో "దేవ దేవ! బ్రహ్మ దేవ! నా రూపం ఒక రాక్షసుని మనసులో ప్రవేశపెట్టావా? నా నామ ధేయం పులోమ అయితే రాక్షసుని నామ ధేయం పులోముడా !? ఇదెక్కడి తలరాత బ్రహ్మ దేవుడా?" అని దుఃఖించ సాగింది. 



కామోద్రేక చిత్తుడైన పులోమునకు అగ్ని దేవుని మాటలు రుచించలేదు. పర్ణశాల లోని నిండు గర్భిణి అయిన పులోమను చూడగానే పులోమునిలో రాక్షస కామం రంకెలు వేసింది. పులోముడిని చూచి పులోమ గజగజ వణికిపోయింది. వణుకుకు ఆమె శరీరంలోని నరాలన్నీ వేగంగా బిగుసుకు పోసాగాయి. తన వైద్య సామర్థ్యం తో బిగువును సడలించుకుంది. 



అప్పుడు పులోముడు, "మదీయ సుందరీ! నీ పరిణయం కాక ముందే నిన్ను నా మనసులో నిలుపుకున్నాను. అప్పటికీ ఇప్పటికీ నీలోని అందం చెక్కు చెదర లేదు. నీ ముఖారవిందాన్ని చూస్తుంటే నాలోని మన్మథ తాపం ఎలా ఎలా పెరిగిపోతుందంటే.. అబ్బా మాటల్లో చెప్పలేను. చేతల్లో చూపిస్తాను. " అని పులోముడు పులోమ ముందుకు వచ్చాడు. 



 "రాక్షసాధమ పులోముడ! నేను భృగు మహర్షి ధర్మపత్నిని. బ్రహ్మను సహితం శాసించగల సమర్థుడు భృగు మహర్షి. అలాంటి వాని ధర్మపత్ని నీకు తల్లితో సమాన మవుతుంది. అందునా నేను పూర్ణ గర్భవతిని" అని దుఃఖాన్ని ఆపుకుంటూ అంది పులోమ. 



"వావి వరసలు వలదు వనిత.. వావి వరుసలు వలదు. దేవతల వావి వరుసలు నాకు తెలియనివి కావు. బ్రహ్మ తన కుమార్తె సరస్వతీ దేవినే పెళ్ళాడాడని మీ మహర్షులే కొందరు చెబుతుంటారు. అదేమంటే సృష్టి సృష్టి అంటూ పరులను వంచించే ఆద్యాత్మిక మాటలు విపరీతంగా మాట్లాడతారు. పూర్ణ గర్భవతి ని పరిపూర్ణంగా అనుభవించినప్పుడు కలిగే మహదానందం మీ బ్రహ్మానందాన్ని మించి ఉంటుంది. " అని వెంటనే పులోముడు వరాహ రూపం ధరించాడు. 



పులోమ "నన్ను తాకవద్దు.. తాకవద్దు" అంటూ తన తపో శక్తి తో ధారాపాతంగా కన్నీరు కార్చింది. కన్నీరు నది లా ప్రవహించసాగింది. నదిలా ప్రవహిస్తున్న పులోమ కన్నీటిని చూచి క్షణ కాలం పాటు పులోముడు నిశ్చేష్టు డయ్యాడు. 



అప్పుడు పులోమ "ఓరి దుర్మారుడ పులోముడ! నీ పాపం పండే సమయం ఆసన్నమైంది. నీ తనువుకు భూమితో సంధానింపబడిన చక్రాల సంబంధం తెగిపోయే సమయం ఇహనో ఇప్పుడో అన్నట్లు ఉంది. నీ అరి కాళ్ళ పాదాలు చల్లబడే సమయం వచ్చేసింది. నీ ఆత్మ కు అనుసంధానించబడిన వెండితీగ తెగిపోనుంది" అని అంది.
 
 పులోమ కన్నీరు కార్చటం ఆపిన వెంటనే, "నాకు భూమి తో సంబంధం తెగిపోనుందా? అయితే ఆకాశం లోకి ఎగురుతాను" అని పూర్ణ గర్భవతి అయిన పులోమను ఎత్తుకుని పులోముడు ఆకాశంలోకి ఎగిరాడు. దృశ్యం భూమాతను హిరణ్యాక్షుడు చెరబట్టిన దాని కంటే భయంకరంగా ఉంది. అక్కడ భూమాత స్త్రీ అయితే ఇక్కడ పులోమ పూర్ణ గర్భవతి అయిన స్త్రీ. 



వేగానికి పులోమ గర్భంలో ఉన్న శిశువు జారి కింద పడ్డాడు. శిశువు తీక్షణంగా పులోముని చూసాడు. తల్లి ప్రసాదించిన మహాన్నత తేజోవంతమైన శిశువు కంటి కిరణాల వెలుగులో పడి పులోముడు కాలి బూడిదై నేల మీద పడ్డాడు. 



పులోమ తన బిడ్డను దగ్గరకు తీసుకుంది. తన బిడ్డను ఎత్తుకుని తన అవమానం గురించి చెప్పడానికి గోడు గోడున దుఃఖిస్తూ బ్రహ్మలోకం వెళ్ళింది. ఆమె కన్నీరు కాలువై నదిగా మారి ఆమె వెనుకనే రాసాగింది



పులోమ తనకు జరిగిన అవమానమంతా బహ్మ దేవునికి చెప్పుకుని "ఇదేం రాత బ్రహ్మ దేవుడా?" అని దుఃఖించింది. 



బ్రహ్మ దేవుడు పులోమను ఓదార్చి, " అమ్మా పులోమ! తలరాతను నరులే కాదు సుర రాక్షస యక్ష గంధర్వ కిన్నెరాదులు సహితం తప్పించుకోలేరు. లోకం పోకడ లో మంచితో పాటు చెడుకూడ పుడుతుంటుంది. దానిని భరించక తప్పదు. ఆశామోహాలతో జీవం చేసే ఖర్మ జన్మజన్మలను అంటే ఉంటుంది. దానిని ఎవరూ తప్పిం చుకోలేరు. 



జన్మజన్మల ఖర్మ ఫలంగా మహా పుణ్యాత్ములను ఖర్మ ఫలం వెంబడించినా, అది వారిని ఏం చేయ లేదు. కొంత కాలం ఇడుములను కలిగిస్తుంది. అంతే. అదే జన్మ జన్మల ఖర్మ ఫలం పాపాత్ములను ఒక్కసారి గా అందలం ఎక్కించి, అక్కడి నుంచి వారిని అధఃపాతా ళం లోకి పడేసి చంపేస్తుంది. 



మానవ లోకంలో, మనిషి బతుకుతెరువు చూపే విద్యను తన ఖర్మ సంబంధ మూ విద్యను అభ్యసించాలి. అభ్యాసించినదాని మూలా లెరిగి ప్రవర్తించాలి. అప్పుడు మనిషి మహనీయుడు అవుతాడు. 



నీ పేరు పులోమ అంటే సంతోషం. ముందుగా నువ్వు బతుకుతెరువు, ఖర్మ ఫలం కు సంబంధించిన విద్యలే అభ్యసించావు. వివాహం అయిన పిమ్మట కొంచెం సంసార వ్యామోహం లో పడి ఖర్మ ఫల విద్యకు దూరమయ్యావు. అందుకే నువ్విలా దుఃఖిస్తున్నావు. 



దుఃఖాన్ని వదులు. జగన్నాథ జగతిని చూడు. ఏదీ ఏమైనా మహా తేజోవంతుడైన బిడ్డకు తల్లివయ్యావు. నీ బిడ్డ నువ్వు ప్రసాదించిన యోగ బలంతో నీ ఉదరం నుంచి జారి ( చ్యుతమై) కింద పడ్డాడు. కావున నీ బిడ్డ చ్యుతుడనే పేర ప్రసిద్ది చెందుతాడు. నీ బిడ్డ భూమి మీ పడగానే పులోముని సంహరించి తల్లి ఋణం తీర్చు కున్నాడు. నీ కన్నీరు నదై నీ వెనుకనే ప్రవహిస్తుంది. నీ కన్నీటి నది "వధూసర" అనే పేర యిలలో యశమొందుతుంది " అని అన్నాడు. 



"నేను కార్చిన కన్నీటి నది పేరు వధూసరయా!?", అని అంది పులోమ. 



"అవును వధూసర. వధూసర అంటే వధువు కన్నీటి ప్రవాహం అని అర్థం. కలకంఠి కంట కన్నీరు ఒలికిన సిరి యింట ఉండదు. నీలాంటి పతివ్రత కంటి కన్నీరు నదైంది. నది పాపాత్ముల పాలిట ప్రళయకాల ఉప్పెన. " అన్నాడు బ్రహ్మ.
 
 భృగు మహర్షి జరిగినదంతా తెలుసుకుని భార్యా బిడ్డలను ఆశ్రమానికి తీసుకువచ్చాడు. ఆపై చ్యవనుని కి దోసికోండ వద్ద మహోన్నత విద్యలను నేర్పించాడు. జానపద వీరుడు మృకండ వలే చ్యవన మహర్షి మహోన్నత కీర్తి ప్రతిష్టలను ఆర్జించాడు. భృగు వంశంలో జన్మించిన వారే పరశురాముడు మొదలైనవారు. 



సర్వే జనాః సుఖినోభవంతు 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - ప్రమధ్వర - by k3vv3 - 15-03-2025, 10:05 AM



Users browsing this thread: 1 Guest(s)