Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#68
వధూసర

[Image: image-2025-03-15-100125636.png]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


సీతారాముల వనవాసం, పాండవుల అరణ్య వాసం, అజ్ఞాత వాసం, పురాణాల చరిత్రలో ఒక ప్రత్యేకతను సంతరించు కున్నాయి. సీతారాములు, అరణ్య వాసంలో అనేకమంది మహర్షుల నడుమ విజ్ఞానాత్మక, ఆద్యాత్మిక జీవితాన్ని గడిపారు. పాండవ మధ్యముడు అరణ్యవాస సమయంలోనే ముక్కంటిని ఎదిరించి విజయం సాధించాడు. 



 నేడు అరణ్యం, వనం అనగానే అదేదో కౄర మృగములు సంచరించే ప్రదేశం అని అనుకుంటాము. కానీ రామాయణ భారత కాలాలలో మునులు, ఋషులు, రాజర్షులు, మహర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు వనాలలోనే తమ పర్ణశాలలను నిర్మించుకునే వారు. అక్కడే ఘోర తపమును ఆచరించేవారు. మోక్ష పథమును పొందేవారు. అలాంటి పవిత్ర వనాలు నాడు భారత దేశాన అనేకం ఉండేవి. 



 అలాంటి వనాలలో ఆకు పచ్చని చెట్లతో కూడిన వనరాజమది.. వనంలో రంగు రంగుల పూల చెట్ల నడుమ ప్రశాంత మైన పర్ణశాలలు వందకు మించి ఉన్నాయి. పర్ణ శాలల పక్కనే నిర్మల సురగంగా ప్రవాహతరంగాలు వయ్యారంగా ప్రవహిస్తున్నాయి. ప్రవాహ తరంగాల నడుమన ఉన్న ఎత్తైన శిఖరాల మీద మునులు, మహర్షులు తపస్సు చేసుకుంటున్నారు. 



 గంగా నది ప్రక్కనే ఉన్న అందమైన చెట్ల మీద రెండు విధములైన నెమళ్ళ కేకలు వినసోంపుగా ఉన్నాయి. అక్కడే ఆనందంగా అటూ ఇటూ తిరుగుతున్న నెమళ్ళ, వానకోయిలల, మేకల, క్రౌంఛ పక్షుల, కోకి లల, కప్పల, ఏనుగుల కేకలు సప్త స్వరాలైన , రి, , , , , ని, లను గుర్తు చేస్తున్నాయి. 



 పర్ణశాలల దగ్గర నీవార ధాన్య భాగాలను తిన్న ఆనందంతో చెంగు చెంగున లేడి పిల్లలు అటూ ఇటూ ఎగురుతున్నాయి. ఇంకా కుందేళ్ళు, యజ్ఞయాగాదులకు ఉపయోగ పడే పాలనిచ్చే కామ ధేనువుల్లాంటి ఆవులు, శ్వేతాంబర అశ్వాలు, పల్లకీలు, గుర్రపు బండ్లు, కూర్మ మత్స్యాది వివిధ ఆకారాల యజ్ఞయాగాది గుండాల నడుమ పర్ణశాలలు సిరి సంపదలతో, పవిత్ర ప్రశాంత తేజంతో ప్రకాశిస్తున్నాయి. పర్ణశాలలు నిగమాగమా లతో నిర్మితమైన దేవాలయాల్లా పవిత్రంగా తేజోవంతం గా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. 



  పర్ణశాలల నడుమ బంగారు బావి ఉంది. బావి నీరు అమృత సదృశ్యంగా ఉంటాయి. అక్కడి మునులు బావిలోని మట్టిని తీసుకువచ్చి, దానిని శుద్ది చేసి, దానిలో గంధపు పొడిని కలిపి దేవతా ప్రతిమలను తయారు చేస్తారు. అక్కడి వారంత బావిలోని మట్టికి సురతేజం ఉందని భావిస్తారు. 



  పర్ణశాలల నడుమ అందమైన, ఆకర్షణీ యమైన, అద్భుతమైన ఒక పర్ణశాల ఉంది. పర్ణశాల లో అందాల సౌందర్య రాశి పులోమ అనే కన్య ఉంది.  కన్య అందం చూసిన అప్సరసలే కన్య అందం ముందు మా అందం ఏపాటిది? అని అనుకుంటారు. పులోమ సౌందర్య తేజంలోని తేజో గుణం గురించి పలు విధాలుగా చర్చించుకుంటారు. కడకు పులోమ అందం ముందు దేవకాంతల అందం దిగతుడుపే అనుకుంటారు. 



 పులోమ తలిదండ్రులు పులోమకు అక్కడ ఉన్న అందరి మహర్షుల దగ్గర వేదవేదాంతాది విద్యలన్నిటిని నేర్పించారు. పులోమ మహర్షులందరి దగ్గర వారు బోధించిన విద్యలన్నిటిని శ్రద్దాసక్తులతో వినయం గా నేర్చుకుంది. కడకు తన తలిదండ్రుల వద్ద కూడా పులోమ చక్కగా విద్యలను నేర్చుకుంది. 



 పులోమ ఎల్లప్పుడూ సంతోష హృదయంతో ఉండేది. తన చుట్టూ ఉన్న వారందరిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేది. 



 పులోమ అంటే సంతోషం అని అర్థం. పులోమది పేరుకు తగ్గ ప్రవర్తన, ప్రవర్తనకు తగ్గ పేరు. పులోమది కన్యా రాశి, హస్తా నక్షత్రం అని కొందరు మహర్షులు పులోమను చూచి అనుకునేవారు. ప్రాంతంలో ఉన్న మహర్షులు అందరూ పులోమ అంటే మహా యిష్ట పడేవారు. వేదాలలో గార్గి, మైత్రేయి, అపాల వంటి వారు చెప్పిన మంత్రాలను పులోమ తో మహర్షులు పఠింప చేసి ఆనందించే వారు. 



పులోమ గొంతులో వేద మంత్రాలు ఉదాత్తాను దాత్తాది స్వరాలతో చక్కగా ప్రకాశిస్తున్నాయి అని మహర్షులు అనుకునే వారు. 



ముని పుంగవులు బావిలో మట్టిని తీసుకువచ్చి పులోమతోనే దేవతా ప్రతిమలను తయారు చేయించే వారు. పులోమ ముని పుంగవులు కోరుకున్న విధంగా దేవతా ప్రతిమలను తయారు చేసేది. ప్రతిమలను అందమైన మండపములలో ఉంచి పాలతో సంస్కరించేది. నైవేద్యంగా "శివము"అనేది. 25 అంగుళాల పొడవు, 12 అంగుళాల వెడల్పు 15 అంగుళాల ఎత్తు ఉన్న చెక్క లేదా లోహ పాత్ర నిండా ఉన్న పరిశుద్ద ఆహారంను శివము అంటారని ముని పుంగవులకు తెలుసు.



 అందుకే వారు అలాగే అనేవారు. వాగర్థ సంబంధమైన శివ పార్వతుల జ్ఞాన స్వరూపం ఎంతటి మహత్తరమైనదో పులోమకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని మహర్షులందరూ అనుకునేవారు. 



 పులోమ సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాప జయాలను సమానంగ స్వీకరించేది. ఏదేమైనా తన కర్తవ్యాన్ని విస్మరించేది కాదు. అన్ని కాలాలో వేద పఠనం చేసేది. ఆరుకాలాల్లో ఎప్పుడు పని చెయ్యా లో అప్పుడు పనిని క్రమం తప్పకుండా చేసేది. సత్య సంపద నిమిత్తం మితంగా మాట్లాడేది. 
 ఒకనాడు పులోమ పర్ణశాలలకు దగ్గరగా ఉన్న సరోవరం దగ్గరకు వెళ్ళి, అక్కడ ఉన్న దర్భలను, పూలను కోసుకుని తన నివాసానికి వస్తుండగ పులోముడు అనే నవ యువక రాక్షసుడు పులోమను చూసాడు. తొలి చూపులోనే పులోమ, పులోముని మనసులో ముద్రపడి పోయింది. 



 పులోముడు కశ్యప ప్రజాపతి కుమారుడు. ముక్కోపి. ఆకలి వేస్తే ఆహారం తీసుకోవాలి అని అనుకోడు. ఎవరిని చంపైనా సరే ఆహారం తీసుకోవాలి అనుకుంటాడు. ఆడది మగవానికి సేవలు చేయడానికే పుట్టిందంటాడు. స్త్రీ స్వాతంత్య్ర మర్హతి అంటాడు. పనినైనా వెనుక ముందు ఆలోచించకుండా చేసేస్తాడు. అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తాడు.. 



 అలాంటి పులోముడు పులోమ తండ్రి దగ్గర కు వెళ్ళి "నీ కుమార్తె నాకు నచ్చింది. మీరు అనుమతిస్తే వివాహం చేసుకుంటాను. లేదంటే బలవంతంగా నా కోరిక తీర్చుకుంటాను" అని అన్నాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - ప్రమధ్వర - by k3vv3 - 15-03-2025, 10:03 AM



Users browsing this thread: 1 Guest(s)