Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#88
" విషయాని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావ్. నాతో చెప్పవా నేనేదైనా సాయం చేయగలనేమో!" చిరునవ్వుతో చెప్పింది శార్వరి.



"శారూ!"
"మా నాన్న గుర్తుకు వచ్చాడు!"



"మామయ్యనా!.."
"అవును.."



" సమయంలో ఆయన గుర్తుకు రావడం ఏమిటి? రావలసింది మా అన్నయ్య కదా!" నవ్వింది శార్వరి.
"అది కాదే!.. మనం తిరిగి వెళ్ళిన తర్వాతనే నా పెళ్ళిచూపులు.."



"ఎవరితో?.."
"పరంజ్యోతి కొడుకు దివాకర్తో!"



"నీవు ఒప్పుకొన్నావా?"
"లేదు.. అంతా ఆయన ఇష్టమే!"



"నేను మా అన్నయ్యతో చెప్పనా వదినా!" క్షణాం తర్వాత "శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని లేపుకెళ్ళినట్లు నిన్ను లేపుకొని రమ్మని" గలగలా నవ్వింది శార్వరి.
"శారూ!.. నేను బాధపడుతుంటే.. నీవు ఎలా నవ్వుతున్నావే!" దీనంగా శార్వరి ముఖంలోకి చూచింది దీప్తి.



"వదినా!.. నీ మనస్సులో మాటను అన్నకు చెప్పు. పంతానికి దిగితే మా అన్నయ్య కూడా తక్కువ వాడు కాదు. ఇప్పుడు నీ చేతిలో మంచి అవకాశం వుంది. రేపు నీ స్నేహితురాలి పెళ్ళి కదా!.. నీతో అన్నయ్యను తోడుగా తీసుకొని వెళ్ళు. మార్గంలో నీవు చెప్పదలచుకొన్న విషయాన్ని అన్నయ్యతో చెప్పేసేయి."



"ఆయన నాతో వస్తాడా?"
"నీవు మా అమ్మను అడుగు. అమ్మ మాటను అన్నయ్య ఎన్నడూ కాదనడు సరేనా!"



కొన్నిక్షణాలు ఆలోచించింది దీప్తి. "ఆఁ నీ ఐడియా బాగుంది. అలాగే చేస్తాను" ఆనందంగా చెప్పింది.
"వదినా!.. నేను నీ శ్రేయోభిలాషిని."
" శారూ!.. నిజంగానే!"
"సరే వదినా!.. ఇక నిద్రపో!.. నాకూ నిద్ర వస్తుంది!"
ఇరువురూ కళ్ళు మూసుకున్నారు.



హాల్లోకి వచ్చి హరికృష్ణను చూచి తిరిగి వెళుతున్న కళ్యాణ్ కాలికి సోఫా తగిలింది. హరికృష్ణ కళ్ళు తెరిచాడు. అతన్ని చూచాడు. చాతుర్వర్ణా మయాసృష్ట్యా అన్నారు గీతా కృష్ణుడు. మానవ జీవిత గమనాన్ని సక్రమంగా.. శాంతియుతంగా సాగేటందుకు ఆచర్య వారి సంకల్పరీతిగానే జరుగుతూ వుందేమో!.. ఏది ఏమైనా.. కళ్యాణ్ మంచి వ్యక్తిత్వం కలవాడు. తాను చేసిన తప్పుకు చేతులు జోడించి క్షమాపణ చెప్పాడు. చూస్తుంటే నా బిడ్డ వాణి అన్నివిధాలా ఆనందంగా వున్నట్లుంది. ఒక తండ్రిగా నాకు ఇంకేం కావాలి! సంతోషం అనుకొన్నాడు.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 14 - by k3vv3 - 08-03-2025, 10:09 AM



Users browsing this thread: 1 Guest(s)