Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#86
"మనం మాట్లాడితే డ్రైవర్ అటెంషన్ మిస్ అవుతుంది బావా!.."
"అన్నయ్యా!.. ఎలా నడపాలో అతనికి తెలుసు కదా!.." అంది శార్వరి.



దీప్తి, శార్వరీల ముఖంలోకి చురచురా చూచాడు ఈశ్వర్.
పదిహేను నిమిషాల తర్వాత.. రెండు టాక్సీలు మల్టీస్టోరెడ్ ఫ్లాట్స్ ముందు ఆగాయి. అందరూ టాక్సీల నుంచి దిగారు.
కళ్యాణ్, ఈశ్వర్ లగేజీలను దించారు. కళ్యాణ్ డ్రైవర్లకు టాక్సీ ఫేర్ ఇచ్చాడు. వారు వెళ్ళిపోయారు.
లగేజీనంతా లిఫ్టులో పెట్టి కళ్యాణ్ రెండవ అంతస్తులో వున్న తన ఫ్లాట్ ముందు వుంచి తలుపు తీసి క్రిందికి వచ్చాడు.



అందరూ రెండవ అంతస్థులోని వాణి, కళ్యాణ్ త్రిబుల్ బెడ్రూమ్స్ ఫ్లాట్లో ప్రవేశించారు. వెయిన్ని మూడువందల యస్.ఎఫ్.టి ఫ్లాట్ విస్తీర్ణం. మూడు బెడ్ రూంలకు అటాచ్డ్ బాత్రూమ్స్, విశాలమైన హాలు, డైనింగ్ రూమ్.
కాళ్ళు కడుక్కొని లావణ్య ఇంట్లోని అన్ని భాగాలను చూచింది. హరికృష్ణ కూడా ఆమె వెనకాలే తిరిగాడు.



"ఇల్లు బాగుంది కదండీ!.." అడిగింది లావణ్య.
"చాలా బాగుంది" చెప్పాడు హరికృష్ణ.



వంటింట్లో అందరికీ కాఫీ తయారుచేయడాని వెళ్ళిన వాణి వెనకాలే దీప్తి, శార్వరీ కూడా వెళ్ళారు.
"అక్కా!.. మేము ఇక్కడ వుండబోయే రోజుల్లో.. ఇంటి పనులన్నీ నేను, దీప్తి వదినా చూసుకుంటాము. నీవు నాకు డైరెక్షన్ చెయ్యి.. సరేనా!" నవ్వుతూ చెప్పింది శార్వరి.



"అవును వదినా!.. శారూ చెప్పిన మాటను మీరు వినాలి" చిరునవ్వుతో చెప్పింది దీప్తి.
"సరేలేవే.. అలాగే" అంది వాణి.



స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్ళు పోసి స్టవ్పై వుంచింది వాణి.
"మిగతా పని మేము చేస్తాము. మీరు వెళ్ళి అత్తయ్యా మామయ్యలతో మాట్లాడండి" అంది దీప్తి.
హరికృష్ణ, లావణ్యలు హాల్లోని సోఫాలో కూర్చున్నారు.
ఈశ్వర్ ఇల్లంతా తిరిగి చూచి వంటగదిలో ప్రవేశించాడు.
"బావగారూ! ఇక్కడ మీకేం పని? వెళ్ళి హాల్లో కుర్చోండి. ఐదు నిముషాల్లో అద్భుతమైన కాఫీని అందిస్తాం. ఏం శారూ!" ఓరకంట ఈశ్వర్ను చూస్తూ చెప్పింది దీప్తి.



"అవును వదినా!" ఈశ్వర్ ముఖంలోకి చూచి నవ్వుతూ చెప్పింది శార్వరి.
"వదినా మరదళ్ళు ఒకేమాట మీద వున్నారు. ఈశ్వర్, ఏమిటి విశేషం!" నవ్వుతూ చెప్పింది వాణి.
"అక్కా!.. వదిన చాలామంచిది. అదే విశేషం!" నవ్వింది శార్వరి.



చురచురా ఈశ్వర్ ముఖంలోకి చూస్తున్న దీప్తి చూపులను గమనించింది వాణి. బదులుగా ఈశ్వర్ పెదాలపైన చిరునవ్వు. అతన్ని చూచింది. ఆమెకు కలగవలసిన అనుమానమే కలిగింది.
"వాళ్ళు కాఫీ తెస్తారట రా. మనం హాల్లోకి పోదాం" ఈశ్వర్ చేతిని పట్టుకొంది వాణి. ఇరువురూ హాల్లోకి వచ్చారు. కళ్యాణ్ "వాణీ! ఇలారా" అని పిలిచాడు.
వాణి అతన్ని సమీపించింది.



"చేతులు జోడించి అమ్మా నాన్నలవైపు తిరుగు."
వాణి అతని అభిప్రాయాన్ని గ్రహించి కళ్యాణ్ చెప్పినట్లుగానే చేసింది. కళ్యాణ్ చేతులు జోడించాడు. ఇరువురూ హరికృష్ణ లావణ్య వైపుకు తిరిగారు.



"అత్తయ్యా!.. మామయ్యా!.. నా మూలంగా వాణి తప్పుచేసింది. మీ మనస్సులను యిరువురం నొప్పించాము. మీరు పెద్దవారు. మా తప్పును మన్నించి మమ్మల్ని ఆశీర్వదించండి. ఆనందంగా మాతో కలిసి ఉండండి" ఎంతో వినయంగా చెప్పాడు కళ్యాణ్. 
హరికృష్ణ, లావణ్యలు లేచి వారిని సమీపించారు. మోడ్చిన వారి చేతులను విడదీశారు.
"ఇప్పుడు మీమీద మాకు ఎలాంటి కోపం లేదు అల్లుడుగారు. మీ ఇరువురినీ చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా వుంది" చెప్పాడు నవ్వుతూ హరికృష్ణ.



"అవునమ్మా!" అంది లావణ్య చిరునవ్వుతో.



ప్లేట్లో కాఫీ గ్లాసులను పెట్టుకొని ముందు దీప్తి, వెనుక శార్వరీ హాల్లోకి వచ్చారు. ముందు హరికృష్ణకు, లావణ్యకు, కళ్యాణ్కు, వాణీకి కాఫీ గ్లాసులను అందించింది దీప్తి.
"శారూ!.. గ్లాసును మీ అన్నయ్యగారికి ఇవ్వు!" అంది దీప్తి.



క్షణం తర్వాత.. "చెల్లెలంటే వారికి అభిమానం జాస్తి కదా!.. అందుకే శారూను ఇవ్వమంటున్నా!"
ఓరకంట ఈశ్వర్ను చూస్తూ చెప్పింది దీప్తి.
శారూ వెంటనే గ్లాసును ఈశ్వర్కు అందించింది.
"వదినా!.., ఇచ్చేశాను" చిరునవ్వుతో చెప్పింది శార్వరి.



"గుడ్ శారూ!" నవ్వుతూ అంది దీప్తి.
కాఫీని సిప్ చేసిన హరికృష్ణ..
"కాఫీ చాలా బాగుందమ్మా! కలిపింది ఎవరు?" అని అడిగాడు.
"నేను మామయ్యా!" వెంటనే చెప్పేసింది దీప్తి.



"నీవేనా!" హరికృష్ణ అడిగాడు.
"అవును" అంది దీప్తి.
"అందుకే అంత బాగుంది" నవ్వాడు హరికృష్ణ.
కల్మషం లేని వారి నవ్వు ముఖంలోకి చూచి.. అందరూ నవ్వారు ఒక్క ఈశ్వర్ తప్ప.
నవ్వును ఆపి.. అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూచారు.



"ఏరా నీకు నవ్వు రాలేదా!" అడిగింది వాణి.
"వచ్చింది. కానీ నవ్వలేదు."
"ఎందుకని?"
"మీకందరికీ కాస్త వ్యత్యాసంగా కనుపించాలని!" నవ్వాడు ఈశ్వర్ దీప్తిని చూస్తూ కళ్ళెగరేస్తూ.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 14 - by k3vv3 - 08-03-2025, 09:57 AM



Users browsing this thread: 1 Guest(s)