Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#84
"కాదు" బుంగమూతితో చెప్పింది దీప్తి.



"అబద్ధం చెప్పకూడదు"



"నేను చెప్పింది నిజమే బావా!" దీనంగా అతని ముఖంలోకి చూస్తూ చెప్పింది. 



కొన్ని క్షణాల తర్వాత..
"మీ అభిప్రాయం ఏమిటి?" అడిగింది దీప్తి.



" విషయంలో!"



"మన ప్రయాణ విషయంలో"



కొన్ని క్షణాలు మౌనంగా వుండిపోయాడు ఈశ్వర్.
అతను మనస్సులో చాలాకాలం తర్వాత నాకు ఎంతో ఇష్టమైన వాణి అక్కయ్యను చూడబోతున్నాను. మా ప్రయాణానికి దీప్తి కారణం. ఆమె అమెరికాలో వుండి ఉంటే యిలాంటి సుదినం వచ్చేది కాదు అనుకొన్నాడు ఈశ్వర్. 
ప్రీతిగా దీప్తి ముఖంలోకి చూచాడు.
దీప్తి ఆనందంతో అందంగా నవ్వింది.
"దీపూ!.. నీవు చాలా మంచిదానివి. మా ప్రయాణానికి కారణం నీవే!"



"నేను కాదు బావా!.. మీ మంచి మనస్సు."



దీప్తి ముఖంలోకి ప్రీతిగా చూస్తూ ఆనందంగా నవ్వాడు ఈశ్వర్.
"మనం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేటప్పటికి నీ హాస్పిటల్ భవనం ఎంతో సుందరంగా వుంటుంది. అన్ని ఏర్పాట్లు చేశాను. హాస్పిటల్ నేమ్ బోర్డు కూడా తయారుగా ఉంటుంది. తిరిగి వచ్చాక మంచిరోజు చూచుకొని పురోహితుని పిలిపించి సాంప్రదాయబద్ధంగా పూజను జరిపించి.. బోర్డును తగిలిద్దాం. మరోమాట.. నీకు సహాయంగా అనుభవం కల ఇరువురు నర్సులను కూడా ఏర్పాటు చేశాను. డాక్టర్గా.. ప్రాంతంలో నీకు మంచిపేరు రావాలని.. అందరి అభిమానాన్ని నీవు పొందాలని నేను కోరుకుంటున్నాను" ఎంతో ప్రీతిగా మెల్లగా చెప్పాడు ఈశ్వర్.



అయస్కాంతానికి అంకితం అయిన ఇనుప ముక్కలా ఆశ్చర్యానందాలతో అన్నయ్య మాటను.. దీప్తి ముఖ భంగిమలను చూచి శార్వరి ఆనందంగా కిటికీ గుండా శూన్యంలోకి చూస్తూ.. నవ్వుకొంది. భగవాన్ మా అన్నా వదినల వివాహం త్వరలో జరగాలి అనుకొంది శార్వరి.
రామయోగి.. తన కుమారుడు కళ్యాణ్తో ఫోన్లో దీప్తి ఫలానారోజున ఢిల్లీకి వస్తున్నదని, ఆమెతో మామిడీ ఊరగాయను పంపుతున్నానని చెప్పాడు.



కళ్యాణ్ విషయాన్ని తన అర్థాంగి వాణికి తెలియజేశాడు. ఎంతో ఆనందంతో వాణి గంతులేసింది.
వాణి, కళ్యాణ్లు దీప్తిని రిసీవ్ చేసుకొనేదానికి ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్టుకు వచ్చారు.



స్పెయిస్ జెట్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. హరికృష్ణ, లావణ్య, ఈశ్వర్, దీప్తి, శార్వరీలు లగేజ్ని బెల్ట్ పైనుంచి తీసుకొని ట్రాలీలో వుంచుకొని విమానాశ్రయం బయటికి వచ్చాయి. వారి వెనకాల హరికృష్ణ, లావణ్యలు. ఎంతో ఆత్రంగా దీప్తి కోసం ఎదురు చూస్తున్న వాణి, కళ్యాణ్ ఐదుగురుని చూచి.. ఆశ్చర్యంతో తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు.



"ఏమండీ!.. ఇది కలా నిజమా!" పారవశ్యంతో అడిగింది వాణి.



ఆశ్చర్యాన్నుంచి తేరుకొన్న కళ్యాణ్, వాణి భుజంపై చెయ్యివేసి..
"ఇది కల కాదు నిజమే!.. దీప్తితో అమ్మా, నాన్న ఈశ్వర్, శార్వరీలు కూడా వచ్చారు" అన్నాడు. వారినందరినీ చూస్తూ చేతులు జోడించాడు కళ్యాణ్.



తనవారినందరినీ చూచిన వాణి కళ్ళల్లో ఆశ్రువులు నిండాయి. వాణిని.. చూచిన దీప్తి తన చేతుల్లో ట్రాలీని వదలి పరుగున వాణిని సమీపించి..
ఆమె భుజాలను పట్టుకొని "వదినా!.. నేను గుర్తున్నానా మీ దీప్తిని. కన్నీళ్ళేమిటి వదినా!.. ఇప్పుడు మనమంతా ఎంతో సంతోషించవలసిన సమయం. అటు చూడండి. మిమ్మల్ని చూడాలని అమ్మా నాన్న, ఈశ్వర్ బావా, నీ చెల్లి శార్వరీ, నేను వచ్చాము" తన హ్యాండ్ కర్చీఫ్తో వాణి కన్నీటిని తుడిచింది దీప్తి.



దీప్తి వదలిన ట్రాలీని శార్వరి తన చేతులతో ముందుకు త్రోసికొని వాణిని సమీపించింది.
"అక్కా!.." గద్గద స్వరంతో శార్వరీ వాణిని కౌగలించుకొని భోరున ఏడ్చింది. చిన్న సోదరి కౌగిలిలో చిన్నపిల్లలా వాణి మారి శార్వరి భుజంపై వాలి కన్నీరు కార్చింది.



హరికృష్ణ, లావణ్య, ఈశ్వర్ వాణిని సమీపించారు. ముగ్గురి కళ్ళల్లో ఆశ్రువులు..
శార్వరి భుజంపైన వున్న తన తలను పైకెత్తి వాణి, తనకు చేరువైన ముగ్గురినీ చూచింది.
భావావేశంతో ముందుకు నడిచి వంగి తన తల్లిదండ్రుల పాదాలను తాకబోయింది. వాణి ఐదుమాసాలు గర్భవతి. కూతురి స్థితిని గమనించిన లావణ్య ఆమె భుజాలను పట్టుకొని ఆపి.. తన అక్కున చేర్చుకుంది.



భోరున ఏడుస్తూ వాణి "అమ్మా!.. నన్ను క్షమించగలవా!" దీనంగా అడిగింది.
మాట విన్న హరికృష్ణ, ఈశ్వర్ చలించిపోయారు. ఇరువురూ ఆమె భుజాలపై తమ చేతులు వుంచారు.



"అమ్మా!.. వాణీ.. ఏడవకు తల్లీ!.." గద్గద స్వరంతో చెప్పాడు హరికృష్ణ.



"అక్కా!.. ఏడవకు.. అందరూ మనల్నే చూస్తున్నారు. పద యింటికి పోదాం" అన్నాడు బొంగురుపోయిన కంఠంతో ఈశ్వర్.



కళ్యాణ్.. రెండు టాక్సీలలో వారి లగేజ్ను ఎక్కించాడు. అతనికి దీప్తి, శార్వరీలు లగేజ్ను అందించారు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 14 - by k3vv3 - 08-03-2025, 09:53 AM



Users browsing this thread: 1 Guest(s)