Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక కథలు - శ్రీరామ కోటి
#66
రురుడు ప్రాణ మిత్రులతో కలిసి ప్రతి రోజు తను కొత్తగా నేర్చుకున్న దాని గురించి చర్చించేవాడు. ఒక నాడు రురుని మిత్రులలో ఒకడైన యుయుడు, "మిత్రమా రురు.. పనీపాట లేనివాడు పక్కవాని పళ్ళ గురించి ఆలోచిస్తాడని నాకు మా బామ్మ బామ్మ చెప్పింది. పనంటేనే మహా బద్దకం పెరిగే నాకు నీ విద్యల సారం ఎందుకు చెప్పు?" అని అన్నాడు.
 
యుయుని మాటలను విన్న రురుడు, " మిత్రమా! మనిషిని మాయలో పడేసి అసురుని చేసేది అతని బద్దకమే. అదృష్టం అందలాన్ని చూపితే దురదృష్టం దురదగుంటాకును చూపుతుంది. సరస్వతీ మాత మనందరిని అదృష్టవంతులను చేసింది. కలిసి చదువు కునే భాగ్యాన్ని ప్రసాదించింది. కాబట్టి నీ అదృష్టాన్ని కాలదన్నుకోమాకు. "అని చెప్పాడు. 
రురుని మాటలను విన్న యుయుడు ఆలోచనలో పడ్డాడు. అటు పిమ్మట తన బద్దకానికి తిలోదకాలు ఇచ్చాడు. రురుని జ్ఞాన చర్చలో గొంతు కలిపాడు. 



స్థూలకేశ మహర్షి ఆధ్వర్యంలో ప్రమధ్వర స్త్రీల కు ఉపయోగకరమైన విద్యలన్నిటిని నేర్చుకుంది. తను నేర్చుకున్న విద్యలను ఆశ్రమంలోని మునికన్య లనేక మందికి నేర్పింది. పాక శాస్త్రం లో మంచి ప్రావీణ్యం సంపాదించింది. "గూఢాన్నం, గుడమిశ్రిత ముద్గ సూపం, గుడ మిశ్రిత తండుల పిష్టం, మాష చక్రం, అపూపం, సపాద భక్ష్యం వంటి వంటకాలు తయారు చేయడంలో ప్రమ ధ్వరకు సాటి ప్రమధ్వరే అని అక్కడి ఆశ్రమాల వారంత అనుకునేవారు. 



శుక్లపక్ష చంద్రునిలా పెరిగే ప్రమధ్వర ఇంద్ర ధనుస్సు లాంటి కనుబొమ్మలతో కళకళలాడ సా గింది. ప్రమధ్వర విశాల నేత్రాలు, గులాబీ చెక్కిళ్ళు, బింబాధరాలు, రాయంచ నడకలను చూసేవారు ప్రమధ్వర మానవ రూపంలో ఉన్న సురకన్య అని అనుకునేవారు. 



"రురుడు ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, మహోన్నత విజ్ఞాన విద్యల సుస్వరూపుడు" అని రురుని చూచినవారు అనుకునేవారు. 



రురుడు అనేక మంది మహర్షులను సేవిస్తూ స్థూలకేశుని ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ నిత్యాగ్ని హోత్రానికి ఉపయోగపడే సమిధలను చూసాడు. సమిధల ప్రత్యేకతను గమనించాడు. సమిధలలో మానవ ప్రాణ తేజాన్ని పెంచేశక్తి ఎక్కువగా ఉందని గ్రహించాడు. ప్రాణవాయువు ను పెంచే సమిధలను ఇన్నాళ్ళకు చూడగలిగానని సంతోషించాడు. కొన్ని సమిధలను చేతిలోకి తీసుకున్నాడు. 



అక్కడ రురుడు పూల సజ్జతో ఆశ్రమానికి వెళుతున్న ప్రమధ్వరను చూసాడు. రురుడు తొలిచూపులోనే ప్రేమ లో పడ్డాడు. ప్రమధ్వర కూడా రురుని చూచింది. తొలి చూపులోనే రురుని ప్రేమించింది. ఇరువురు ఒకరికొకరు మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. ప్రకృతి లోని అంద మంతా ప్రమధ్వర రురునిలో చూసింది. సృష్టిలోని సౌం దర్యమంతా రురుడు ప్రమధ్వరలో చూసాడు. 



 రురుడు తన ప్రేమ గురించి తన తండ్రి ప్రమతికి చెప్పమని తన ప్రాణ స్నేహితులను అభ్యర్థించాడు. వారు అలాగే అని ప్రమతిని కలిసి విషయం చెప్పారు. ప్రమతి
రురుని ప్రేమను సమ్మతించాడు. 



ప్రమధ్వర తనను పెంచిన తండ్రి స్థూలకేశ మహర్షి ని కలిసింది. కుమార్తె ఏదో చెప్పడానికి వచ్చిందని స్థూల కేశ మహర్షి గమనించాడు. కుమార్తె ముఖం చూస్తూ, " విషయం ఏమిటని?" అడిగాడు. ప్రమధ్వర విషయం చెప్పింది. ప్రమధ్వర మాటలను మహర్షి మన్నించాడు. 



 ప్రమతి స్థూలకేశ మహర్షి ని కలిసి తన కుమారుడు రురునికి ప్రమధ్వరని ఇచ్చి పెళ్ళి చేయమన్నాడు. అందుకు స్థూలకేశ మహర్షి అంగీకరించాడు. పూర్వ పాల్గుణీ నక్షత్రం ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు రుద్రునికి ప్రమధ్వర కు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. 



 స్థూలకేశ మహర్షి ప్రమద్వరను దగ్గరకు తీసుకొని "అమ్మా ప్రమధ్వర... 



 కార్యేషు దాసి కరణేషు మంత్రీ 
 రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ 
 భోజ్యేషు మాతా శయనేషు రంభా 
 షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ... 



అని పెద్దలు ఉత్తమ భార్యా లక్షణాలను చెప్పారు. లక్షణాల మూలాలను తెలుసుకుని ఇక మీదట నువ్వు నీ భర్త దగ్గర మసలుకోవాలి. " అని ఉత్తమ భార్య లక్షణాలను చెప్పాడు. 



 ప్రమతి మహర్షి తన కుమారుడు రురుని దగ్గరకు తీసుకొని, 
"నాయన రురు.. 



 కార్యేషు యోగీ కరణేషు దక్షః 
 రూపేచ కృష్ణః క్షమయా తు రామః 
 భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం 
 షట్కర్మ యుక్తః ఖలు ధర్మ నాథః... 



అని పెద్దలు ఉత్తమ భర్త లక్షణాలను చెప్పారు. లక్షణాల మూలాలను తెలుసుకుని ఇక మీదట నువ్వు నీ భార్య దగ్గర మసలుకోవాలి" అని ఉత్తమ భర్త లక్షణాలను చెప్పాడు. 



ఇలా రురునికి ప్రమతి, ప్రమధ్వర కు స్థూలకేశ మహర్షి ఉత్తమ దంపతుల లక్షణాలను అనేకం చెప్పారు.. 



 మనిషి ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది. దైవం తలచిందే మనిషి తలిస్తే, మనిషి దైవం అయిపోతాడు. అలాంటి సంఘటనలు భూమి మీద అరుదే అని చెప్పాలి. 
ఒకనాడు ప్రమధ్వర స్నేహితురాళ్ళతో కలిసి పూలు కోయడానికి వనంలోకి వెళ్ళింది. అక్కడే స్నేహితురాళ్ళ తో కాసేపు ఆడింది. పాడింది. కాబోయే తన భర్త రురుని పాండిత్యం గురించి స్నేహితురాళ్ళతో కాసేపు మాట్లాడింది.



అప్పుడు ప్రమధ్వర చూడకుండా గుండ్రంగా చుట్టుకుని ఉన్న పాముపై కాలువేసింది. పాము బుస్సున లేచి తన కోరలతో ప్రమధ్వరని కరిచి అక్కడి నుండి వెళ్ళి పోయింది. 
పాము కరవగానే ప్రమధ్వర నేలపై కూలిపోయింది. పాము విషం వేగంగా ప్రమధ్వర శరీరాన్ని కప్పివేయాలని ప్రయత్నిస్తుంది. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - యశోధర - by k3vv3 - 07-03-2025, 08:50 AM



Users browsing this thread: