07-03-2025, 08:33 AM
“ఐనా కృతజ్ఞతలేక వాళ్ళఘోరిస్తున్నారు సరే! అసలీ మాటు ఎన్నికల్లో నేను చేసి కృషివల్లనే కదే కొత్త పంచాయితీ బోర్టు ఎంపికైందీ? అవకాశం వచ్చింది కదాని నా చెల్లెలితో నేరాలచిట్టా విప్పి ఇందాకట్నుంచీ రీలు తిప్పేస్తున్నావు అసలు నీ బుద్ధికేం బుధ్ధి పుట్టిందీ?” శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం... అంటూ అప్పుడే మొదలెట్టిన శ్లోకాన్ని మధ్యలోనే ఆపేసి సోత్తల్లి మీదకి సంధించాడు నోటి ధాటితో తిట్ల బాణాన్ని.
“చాల్లెండి సంబడం. ఆ ఎన్నికల మాటెత్తేరంటేనే నాకు చిర్రెత్తుకొస్తుంది. అవన్నీ మనకెందుకండీ, ఏదో కృష్ణా రామా అని ఊరుకోక అని నెత్తీనోరూ కొట్టుకుని చెపుతూనే ఉన్నాను. కోతికి కొబ్బరిచిప్పలా ఈయనకి తోడు మన రవఁణగాడొకడు. మిమ్మల్ని గెలిపించే పూచీ మాది అని అటు జగ్గిరెడ్డిగారికీ ఇటు సుబ్బారాయుడు గారికీ చెప్పి వచ్చారు. నాకు తెలీకడుగుతానూ, అసలు ఇద్దరినీ ఎలా నెగ్గిస్తారూ అని నేనడిగితే, నీకేం తెలీదు నువ్వు నోర్ముయ్ అంటూ నానోరు నొక్కారు” అప్పటివరకూ వర్తమానంలో ఉన్న సోత్తల్లి నేరాల చిట్టా నాలుగేళ్ళ క్రితానికి భూతకాలానికి వెళ్ళింది.
కొత్త సినిమా మొదటి షో రిలీజ్ నాడే చూస్తున్నంత ఉత్సాహంగా వింటోంది జలజాక్షి.
“ఇంకా కరోనా ధాటి పూర్తిగా తగ్గలేదు. టీకా వచ్చే దాకా టిక్కెట్టు కొయ్యకురా తిక్క శంకరుడా అని దేవుడితో ఐతే మొరపెట్టుకున్నాను కానీ మానవ ప్రయత్నం చెయ్యాలిగా ఒదినా! మీ అన్నయ్యకు అసలే ఆయాసమా! నా పసుపుకుంకుమల్ని కాపాడుకోవడానికి నా వంతు ప్రయత్నం చేసాను. మన బాగుకోసమేగా పాపం ఆ యూట్యూబులోనూ, వాట్సాపుల్లోనూ చెపుతున్నారు. అంచేత వారు ఉచితంగా పడేసిన సలహాలన్నీ పాటిస్తూ ఆయన్ని కాపాడుకుంటూ వచ్చాననుకో” మంగళ సూత్రాల్ని కళ్ళకద్దుకుంటూ అమాయకంగా అంటున్న సోత్తల్లిని కళ్ళు రెండింతలు చేసుకుని చూస్తోంది జలజాక్షి.
“ఆ, కాపాడుకొచ్చావు, వచ్చావు!! కోరి కష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు ఆ వాట్సాపు విశ్వవిద్యాలయం వారి ఔషధాలన్నీ నా మీద ప్రయోగించి ప్రాణం మీదకే తెచ్చావు! కషాయాలన్నీ ఏకధాటిగా పోసేసి నోరు గాబు కట్టేసిన సంగతి చెప్పవేఁ? దాంతో ఐందా, ఆ లేహ్యమేదో ఇచ్చిన ముక్క చెప్పవేఁ? కరోనా సోకిన కళ్ళకు కరీనా కనబడదన్నట్టు, నాకసలే రుచి తెలియకేడుస్తుంటే, గోరుచుట్టుమీది రోకలి పోటులా ఆ లేహ్యంతో కడుపు కట్టేసిందా? ఆ తెలిసీ తెలియనివి వద్దే అని చెవుల్లో గూడుకట్టుకుని చెప్పా విన్నావా చివరికి డాక్టరు దగ్గరకెడితే పరీక్షలంటూ, స్కానంటూ, కొలొనోస్కోపీలంటూ భయపెట్టింది చాలక ఒ అర లాకారం లాగేసాడా!” సంధ్యావందనాన్ని ఆపి మరి సణుగాడు సుబ్బారావు.
“అబ్బా, మీరు ముందా పూజ కానివ్వండి” దాటేసింది సోదితల్లి.
“అవన్నీఅయ్యి, ఆ రెండు టీకాలూ పూర్తి చేసుకుని బతుకు జీవుడా అనుకున్నామా! కొన్నాళ్ళైనా ప్రశాంతగా ఉండనిచ్చారా? అక్కడితో ఆగారా?” జేమ్స్బాండ్ సినిమా చూపిస్తున్నంత ఉద్రిక్తకరంగా చెప్పసాగింది సోత్తల్లి.
వంట ఆలస్యమైపోతుందని కత్తిపీటా, కూరగాయలూ అక్కడికే తెచ్చుకుని, అక్కడే తిష్ట వేసుక్కూర్చున్న జలజాక్షితో, “ఇప్పటికిప్పుడు ఇంత హడావుడిగా ఇక్కడికెందుకొచ్చామో తెలుసా? కొన్నాళ్ళు ఊరికి దూరంగా ఇక్కడుండక తప్పదు మరి. లేకపోతే ప్రాణాల మీదకే వచ్చి పడింది” ముక్కు చీదుతూ అంది సోత్తల్లి.
“పంచాయితీ ఎన్నికలు తన సారథ్యంలోనే జరిపించి గెలిపించానన్నాడుగా అన్నయ్య” మరో అనుమాన్నాన్ని అడిగింది జలజం.
“పంచాయితీ ఎన్నికలు సన్నాహాలు జరుగుతున్నాయి. పోటుగాళ్లందరూ రంగం సిద్ధం చేస్తున్నారు. ఎవరేం పని చేయాలా అని పనుల పంపిణీలు చేస్తున్నారు. వాళ్ళే ఇస్తే సులభమైన పనే ఇద్దురు. మీ అన్నయ్యకి గులగులలాడి, ఊరు చివర మురికి వాడల్లో ఓట్లన్నీ మన ప్రెసిడెంట్గారికే వేయిస్తానని శపథం చేసినంతపని చేసారు. ఆ మాట పట్టుకుని “అన్నిటి కంటే క్లిష్టమైన సమస్య సుబ్బారావు పుణ్యమా అని తీరిపోతుంది. క్రితం సారి హామీ ఇచ్చినట్టుగా ఆ వీధుల్లో రోడ్లు కూడా వేయించలేదు. వాళ్ళు కోపంగా ఉన్నందు చేత అక్కడి ఓట్లు జాగ్రత్తగా రాబట్టవలసిన అవసరముంది” అన్నారు జగ్గిరెడ్డిగారు.
“పోనీలే ఒదినా, అన్నయ్య మంచి మనసుతో చేసిన కృషికి ప్రెసిడెంటుగారు గెలిచేసుంటారు” మురిసిపోతూ అంది జలజాక్షి.
“ఆఁ అలా జరిగుంటే ఇంక గొడవేముంది? గెలుపు మాట అటుంచీ, అక్కడ అసలేం జరిగిందో విను మరీ”
“నెల్లాళ్ళ పాటు ఆ వీధులన్నీ కాళ్ళరిగిపోయేలా తరిగారు. వేళకు తినక కంటికి కునుకు లేక బోల్టు కష్టపడ్డారు. జగ్గిరెడ్డి గారే మళ్ళీ ప్రెసిడెంటని అందరం అనుకున్నాం. ఓటు వెయ్యడం మానకుండా అందరినీ ఔననిపించి, బతిమాలి బామాలి, ఒళ్ళు హూనం అయ్యేలా పనిచేసారు. ఎన్నికలు దిగ్విజయంగా పూర్తైయ్యాయి. అనుకున్న దాని కంటే ఎక్కువ శాతమే ఓట్లు వేసారు.
ఆ రోజు సాయంకాలం తన ఘనత చూపించు కోవడం కోసం కొందరితో ముఖాముఖి మాట్లాడించారు మీ అన్నయ్య. ఓట్ల అంచనాకి జగ్గిరెడ్డిగారి బావమరిది పెద్దిరెడ్డిని పిలిపించారు. అన్నయ్య ముఖంలో వీరగర్వ తొణికిసలాడింది”
“ఒరేయ్ వీరన్నా, నీ ఓటు ఎవరికేసావురా?” అన్నాడు పెద్దిరెడ్డి.
“ఐ బాబోయ్ మన సుబ్బారావుగారి మాటంటే మాటేకదండీ! ఆరొకటికి పది సార్లు సెప్పాక అట్టాగే సెయ్యాలి కదండి బాబయ్యా. ఆరి మాటంటే మాటే. మన గొడ్డలి గుర్తుకే గుద్దేసానండి” అతివినయంగా చెప్పాడు వీరయ్య.
“నమ్మొచ్చంటావా? క్రితం సారి కంటే ఎక్కువ ఓట్లు ఆశిస్తున్నాము” సందేహంగా అడిగాడు.
“సూసారా, నన్ను నమ్మట్నేదు తమరు. నేనంత ఎర్ర పప్పనేటండీ, మీకిట్టాంటి డౌటనుమానం వత్తాదనుకునే సూపిద్దామని తెచ్చాను, కావాలంచే మీరే సూసుకోండి బాబయ్యా” ఓటు కాగితం తీసిమరీ చూపించాడు వీరన్న.
మొహం చాటేస్తూ, “ఆ వీరన్న సంగతలా ఉంచడి రెడ్డిగారూ, వాడో వెర్రినాగన్న. వీడు మాత్రం మనం గీసిన గీత దాటడు. మన రాఁవుడంటే సాక్షాత్తూ రాఁవుడే” అన్నాడు సుబ్బరావు.
“ధమ్మపెబువులు. ఆరి ఉప్పుతిన్నాక మాట తప్పొచ్చాండీ! కళ్ళుపోతాయి. ఆరు ఎయ్యిచ్చింతరువాత ఒకటో రెండో ఏత్తే ఏం బాగుంటాది, అంచేత ఒ నాలుగైదు బలంగా గుద్దేసానండి. మళ్ళీ నా ఇబ్బంది చూసి ఆరు ఇంకో వంద నా సేతిలో ఎట్టారా, మరి దానికో రెండు గుద్దానండి. ఐనా ఆరి దయకి సాలిందనిపించలా బాబూ, కాయితమంతా ఎడా పెడా గుద్దేసానండి. నాకిప్పుడు మనసు తుత్తిగా ఉందంటే నమ్మడయ్య” గర్వంగా చెప్పాడు రావుడు.
“మన గొడ్డలి తప్ప మరో గుర్తు కనిపించడానికి ఈల్లేదయ్యా, అగుపడకూడదని అయన్ని సించేసానండయ్యా, మీ మాటంటే మాటే మరి” చావు కబురు చల్లగా చెప్పాడు సాహసం చేసిన సోమయ్య.
తలపట్టుకుని కూలబడుతున్న మీ అన్నయ్యను పట్టుకుని, “ఇంకా అవ్వలేదు, ఇదీ చూద్దాం!” తాడోపేడో తేలే దాకా పట్టు వదల్లేదు బామ్మరిది పెద్దిరెడ్డి.
“అయ్ బాబోయ్, నేను మాత్రం ఆ అయ్యగోరు సెప్పింది సెప్పినట్టు సేసానండయ్యా! గొడ్డలి గుర్తుందా, ఉంది కదయ్యా, దానికీ, దానికీ...”
వంకర్లు తిరిగింది చాలు కానీ చెప్పి ఛావు!
“గొడ్డలికి ఏసి, మా అయ్యగారే గెలవాలని దణ్ణమెట్టుకుని మరీ వచ్చానండయ్యా” చెప్పింది రంగి.
“హమ్మయ్య!!” ఊపిరి పీల్చుకున్నాడు పెద్దిరెడ్డి.
“పోనీలే మా మావ సోమయ్యలా నువ్వేం వెలగబెట్టావో అనుకున్నాను. నువ్వైనా నా పరువు నిలబెట్టావు రంగీ” ఇంచుమించు స్పృహ తప్పిన సుబ్బారావు అన్నాడు.
“కావాలంటే సూడండయ్యా! మీరు అన్నది అన్నట్టేసేసానంతే!!” జాకెట్టులోంచి భద్రంగా బ్యాలెట్ పేపరును తీసు చూపించింది రంగి.
“మరినేనేమో అని ఇంకోడు అనేలోపే పెద్దిరెడ్డి మీ అన్నయ్య మీది చెయ్యి చేసుకుని, ఈయనకి దేహశుద్ధి చెయ్యడము జరిగిపోయాయి” కష్టాలచిట్టాను విప్పి చెప్పింది సోత్తల్లి.
“అలా ఊళ్ళోంచి ప్రాణాలను చేతిలో పెట్టుకుని బయటపడ్డామనుకో జలజం”
“ఇక్కడ దిగీదిగ్గానే, రిక్షా వాడితో మాటామాటా పెరిగింది. కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న వాదన. ఎలుకతోలు వచ్చి ఏడాది ఉతికినా అని” అంచేత మీ అన్నయ్య కొన్నాళ్ళు ఇక్కడుంటేనే క్షేమమమ్మా మరదలమ్మా.
“అయ్యొ నా మతిమండా, వేగిరం వంట కానిచ్చెయ్యాలి. సంధ్యావందనం పూర్తవుతూనే వడ్డించెయ్యమంటారు. ఆయనసలే ఆకలికి ఆగలేరు, కూరలు తరిగేసావుగా ఇట్టే వార్చేస్తానుండు” వంటలోకి దిగుతూ అంది సోదితల్లి.
‘ఒదినొచ్చిందంటే ఇంతే, అన్నయ్యకి నచ్చినట్టుగా ఉండాలంటూ తనే వంట చెయ్యాలంటుంది. ఇంతసేపూ ఇన్ని నేరాలూ చెప్పి హడావుడి పడుతూ వంట మొదలెట్టేసింది. ఆమెకు మించిన వాడు అన్నయ్య! రుసరుసలాడుతూ ఉంటాడే కానీ ఒక్క క్షణం ఒదిన కనిపించకపోతే తోచదు. దొందూ దొందే!!’ మళ్ళీ తన మీద విరుచుకు పడతాడని అన్నయ్య కంట పడకుండా చిరునవ్వు నవ్వుకుంది జలజాక్షి.
*****

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ