Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఇంకెంత సేపు
#59
[Image: image-2025-03-07-083122911.png]
రిక్షావాడితో దెబ్బలాడి అలసిన సుబ్బారావూ, పమిటి చెంగుతో చెమటలు తుడుచు కుంటున్నసోదితల్లి భుజాల నుండి సంచుల బరువుని దించుకుంటూ వీధి అరుగు మీదే కూలబడ్డారు.
“అదేంటొదినా, ఇక్కడే కూర్చుండిపోయావూ! లోపలికి పదండి” సంచి అందుకుంటూ అంది జలజాక్షి.
“నువ్వేంటన్నయ్యా మరీ చిక్కిపోయి అలా పొట్లకాయలా వేలాడిపోతున్నావూ?” కందగడ్డలా ఎర్రగా ఉన్న అన్నగారిని చూస్తూ పలకరించింది.
“ఏం చెప్పమంటా వొదినా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందనీ..” రుసరుసలాడుతున్న భర్తని చూస్తూ సగంలోనే ఆపేసింది సోదితల్లి.
 
“అన్నయ్య మాటకేం కానీ నువ్వు చెప్పొదినా, ఏం జరిగిందీ? అసలా రిక్షావాడితో పేచీ ఎందుకొచ్చిందీ?” అడిగింది కాఫీ ఇస్తూ.
ఆడపడుచిచ్చిన ధైర్యంతో దండకాన్ని అందుకుంది సోదితల్లి.
 
“ఇవాళంటే మీ ఊళ్లో రిక్షావాడు కానీ, అసలు మీ అన్నయ్య ఒంటి కాలి మీద లేవడానికి వాళ్ళూ వీళ్ళూ అని లేదనుకో.  ఇంట్లో పనిమనిషేంటి, కూర్లబ్బేంటి, పాలవాడనీ, పూలవాడనీ ఒకరేంటి అందరూ ఆయన్ని చూసి జడవవలసిందే!  వేలికేస్తే కాలికీ, కాలికేస్తే వేలికీ వేస్తూ తన మాటే నెగ్గాలని సాధించేస్తున్నారనుకో.
అక్కడితో ఆగుతారా! లేదే!. ఊళ్ళో పెళ్ళికి వేటికో హడావుడన్నట్టు అన్ని ఘనకార్యాల బాధ్యతనూ నేత్తినేసుకోవడం, నేనే గొప్పగా చేస్తానంటూ గౌప్పలకు పోవడం. రంగంలోకి దిగాకా ఏదైనా కొంప మీదకి ముంచుకొస్తే అప్పుడు ఎదురు దెబ్బలాడ్డం, అదీ కుదరకపోతే చీవాట్లూ చెప్పు దెబ్బలూ తినడం అనుకో! రిటైరైయ్యాకా కృష్ణారామా అనుకోండీ అంటే, ఇదిగో ఇలా ఏదో ముప్పు తెస్తూ ఉంటున్నారనుకో”

“వింటున్నా వింటున్నా, నీకు అందుకే మీ వాళ్ళు సరైన పేరే పెట్టారే!
  అయ్యిందా నీ సోదీ, ఇంకా ఉందా? నేనేదో బావతో కబుర్లు చెపుతున్నానని అక్కడ జలజం చెవుల్లో సీసం పోసేస్తే నాకు నీ నేరాల చిట్టా వినపడట్లేదనుకుంటున్నావేమో! అన్నీహ్...  వినిపిస్తున్నాయ్” ఝాడిస్తూ సాధించాడు సుబ్బారావు.
“ఒదినంటోందని కాదు కానీ, నీకెందుకన్నయ్యా ఊళ్ళో గొడవలూ అవీను? నాలుగు రాళ్ళు వస్తాయి, కాలక్షేపంగానూ ఉంటుందనేగా ఆ  పంచాయితీ కార్యాలయంలో చేరావు. నీకసలు ఆ పనితో తీరికెక్కడిదీ? ఇంకా ఊళ్ళో గొడవల్లోకెళ్ళడానికి సమయం నీకు ఎక్కడు కుదురుతుందీ!?” ప్రశ్నలోనే ఆశ్చర్యాన్నీకలిపి విసిరింది జలజాక్షి.
“నన్ను ముందు స్నానం చేసి రానిస్తారా, మీ ఒదినా మరదళ్ళిద్దరూ, లేక చెరోవైపూ చేరి తలంటు పోసేస్తారా?”  ఎడం భుజమ్మీది తువ్వాలుని తీసి రోషంగా దులిపి కుడి భుజ మ్మీద వేసుకుంటూ నూతి పళ్ళెం దగ్గరికి వెళ్ళిపోయాడు.
 
“హయ్యోరామ! ఇంకెక్కడిదీ!! మీ అన్నయ్య నిర్వాకానికి అదెప్పుడో చెట్టెక్కింది. ఆ ముచ్చటా చెపుతాను విను” వచ్చిన అవకాశాన్ని వదలకుండా ఆ కథలోకి దూకి వల్లించడం మొదలెట్టిది సోత్తల్లి.
“మొన్నామధ్య ప్రభుత్వ కార్యాలయాల్లో రిటైరైనవారిని కూడా కాంట్రాక్టులో తీసుకుంటున్నారని చెప్పుకున్నారు విన్నావా?పూర్వరోజుల నాటి అదేదర్పం, హోదా ఉంటుందంటూ, దానికి దరఖాస్తు పెట్టుకున్నారులే.అంత వరకూ సంతోషమే. రెండు నెలలకి ‘ఆన్ ఇండియా గవర్నమెంటు సర్వీస్’ ముద్ర వేసున్న కవరు తెచ్చాడు పోస్ట్ మాన్.  ఇచ్చినవాడు ఊరికే ఇవ్వకుండా,తంతే బూరెలబుట్టలో పడ్డట్టు, వయసు మళ్ళినా మీకు వచ్చేసింది సార్. మీరు దరఖాస్తు పెట్టుకున్న ప్రభుత్వోద్యోగంలోమళ్ళీ అధికారి హోదాలో దర్జాగా ఉంటారు. ఇంతటి శుభవార్త మోసుకొచ్చిన నా నోరు తీపి చెయ్యాల్సిందే. మళ్ళీ వచ్చేసరికి స్వీటు సిద్ధం చేయండి” అంటూ సైకిలెక్కి రైయ్యి మన్నాడు.
“అంతే, ఇంక మీ అన్నయ్య కాళ్ళు నేలమీదుంటేనా!ట్రంకు పెట్టిలో భద్రంగా దాచిన ఏళ్ళ నాటి పాతకోటు తీసారు. దాని దుమ్ము దులిపేసరికి అరడజను తుమ్ములు ఆక్కుండా వచ్చాయనుకో.  అసలే కరోనా వెళ్ళి ఎన్నాళ్లో అవ్వలేదు, ఇన్ని తుమ్ములు తుమ్మితే అపార్థాలు అనర్థాలు అంటే వింటేనా!! ఆగండీఅసలేంచేద్దామని ఈ ప్రయాణం అని ఎంత అడిగినా చెప్పకుండా, ఎవరితోనూ పేచీ పెట్టుకుని నోరుపారేసుకోవద్దని ఎంత చెప్పినా వినకుండా, తగుదునమ్మా అని బయల్దేరారు.  బొబ్బిలి యుద్ధంలో కత్తి చేతపట్టి తాండ్రపాపారాయుడు రంగంలోకి దిగినట్టు, కోటు తగిలించుకుని, ఆకవరును చేత పుచ్చుకుని పంచాయితీ కార్యాలయం వైపు దారిదీసారు.
వెళ్లారే అనుకో, తిన్నింటి వాసాలు లెక్కెట్టాలా? ఆ పంచాయితీ కార్యాలయంలోని అవకతవకలన్నీ వల్లించడం, నలుగురుకీ తెలుస్తుందన్న ఆలోచన లేకుండా అయినవీ కానివీ అనడం. తనలాంటి అనుభవజ్ఞులను అమర్యాదగా వ్యవహరిస్తున్నారని వాళ్ళని దుమ్మెత్తి పోసారుటయ అక్కడున్న గుమాస్తా మీద రంకెలేస్తూ, ‘చూడవోయ్, మాలాంటి వాళ్ళ అనుభవాన్ని కావాలనుకుని మళ్ళీ పిలిచిమరీ నియమిస్తోంది ప్రభుత్వం.ఆ విలువ మీకు తెలియక ఇలా అఘోరిస్తున్నారు. ఇంక ఇలాంటి మర్యాదలేని చోట పనిచేసే ఖర్మ నాకులేదు’అరచీటీలో రాజీనామాను విసిరి, నానా మాటలూ అంటూ వారి మీద వీరతాండవం చేసివచ్చారు” వాబోయిది సోత్తల్లి.
“పోనీలే ఒదినా పోతేపోయిందిలే వెధవ ఉద్యోగం. ఏదిఏమైనా, అన్నయ్యన్నట్టు, ప్రభుత్వోద్యోగంలో ఉన్న గౌరవమే వేరూ!” బుగ్గన చెయ్యెట్టి గర్వంగా కనుబొమ్మలెగరేస్తూ అంది జలజాక్షి.
“ఆగాగు, ఇంకా నేను చెప్పడం ఇంకా పూర్తవ్వందే!!!”
ఒదినన్న మాట అర్థంగానట్టు చూసింది జలజాక్షి.

“ఈయనెంత నోరు పారేసుకున్నా, ‘పోన్లెండి సుబ్బారావుగారు, మీ సేవలను పొందే అదృష్టం మాకు లేదనే అనుకుందా. ఇదిగోండి ఇవాల్టి వరకూ మీకురావలసిన బాకీలు. అణా పైసలతో సహా చెల్లించేస్తున్నాను’ మర్యాదగా చెప్పి సంతకం తీసుకుని సాగనంపాడు గుమాస్తా.  ఎప్పటికప్పుడు మీ అన్నయ్య పెడుతున్న పేచీకి, ఏనాడైనా నేనే రానని ఆయన అన్ననాడు వెంటనే జీతభత్యాల రొక్కాన్ని అప్పచెప్పి పంపించాలని వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడో నిర్ణయించుకున్నారుట. ఉత్తర్వులు చేతిలో ఉన్నాయేమో, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గుమాస్తా దివ్యమైన ఆ సత్కార్యాన్ని చడీచప్పుడు కాకుండా కానిచ్చేసేసాడు. ఉన్నది కాస్తా ఊడి సర్వమంగళం పాడింది”
“ఆ ఉద్యోగం లేదన్న మాట ఇందాకే చెప్పావుగా, ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన సంగతేంటీ? ఆర్నెల్ల సావాసంలో వారు వీరవుతారన్నట్టు అన్నయ్య చాదస్తమే నీకూ పట్టుకున్నట్టుంది” చిక్కుముడి విడక విసుక్కుంది జలజాక్షి.
“ఇంటికొచ్చిన సుబ్బారావు, కోటుని చిలక్కొయ్యకు తగిలించి, ఉయ్యాలా బల్లమీద రంగనాధస్మామిలా వాలి, సోదితల్లిని వైపుకి వీర గర్వంతో చూపు విసిరి కవరు విప్పాడు. ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చింది. గర్వంతో ముఖం మరింత ప్రకాశించింది.  75వ గణతంత్ర దినోత్సవ వేడుకల అభినందనలు తెలియజేస్తూ ప్రధానమంత్రి సంతకంతో వచ్చిన లేఖ అది.  ఈ మధ్య ఇలాంటివి బోల్టు మందికి వస్తున్నాయిటగా. మొన్న అదేదో దేశం ఉన్న క్రికెట్టు వీరుడికీ, మరేదో ఊళ్ళోని రైతన్నకీ అలా బోల్డు మందికి వస్తున్నాయిట.  ఐనా, చేసే ప్రతీ పనిలోనూ అంత తొందరపాటు పనికిరాదొదినా!  అప్పట్నుంచీ మొహం చెల్లక పంచాయితీ కార్యాలయం వీధిలోకి వెళితే ఒట్టు. అక్కడికీ ఆవేళ మన రమణంటూనే ఉన్నాడు, ‘బావా కవరు విప్పి చూడనా బావా అని. వింటేనా!?”
­­­­­­­­­­­­­
“చెప్పవే చెప్పూ, ఇంకా ఉన్నవీ లేనివీ కలిపి మరీ చెప్పు.
 అసలు నా అనుభవం వాళ్ళకి ఉపయోగ పడుతుందిని కానీ, లేకపోతే ఈ వయసులో ఉద్యోగం చెయ్యాల్సిన ఖర్మ నాకేంటే! షేవింగ్ లేక గడ్డం పెరిగినట్టు, సేవింగ్ లేక బ్యాంకు ఖాతా చిక్కుతుందని, స్వామికార్యం స్వకార్యం అవుతుందీ, నాకూ కాలక్షేపమనీ ఆ పనికొప్పుకున్నాను కానీ!” ఒంటికాలి మీద లేచాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - రెండు పేటల గొలుసు - by k3vv3 - 07-03-2025, 08:32 AM
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM



Users browsing this thread: 1 Guest(s)