06-03-2025, 10:55 PM
సుబ్రహ్మణ్యం తను 'అన్ని వివరాలూ ఇచ్చి తప్పు చేశానా' అని తనని తానే ప్రశ్నించుకున్నాడు. ఈ లోపున మరో మారు ఫోన్ మోగింది. నెంబర్ చూడగానే అర్థమైంది, ఇందాకటి వ్యక్తే మళ్ళీ ఫోన్ చేశాడు.
ఆదుర్దాగా ఉన్న సుబ్రహ్మణ్యం ఒక్కసారిగా ఫోన్ తీసుకుని, అవతల వ్యక్తి మీద విరుచుకుపడ్డాడు.
'మీరు 250 అని చెప్పి, 25000 ఎందుకు నా అకౌంట్ నుంచి విత్ డ్రా చేశారు?'
'సారీ సార్. అది చెబుదామనే మీకు ఫోన్ చేశాను. నేను 250 పాయింట్ సున్నా సున్నా అని రాసిస్తే, పొరపాటున మా క్లర్క్ 25000 అని కొట్టాడు. అందుకనే ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేయడానికి మీకు మళ్ళీ ఫోన్ చేసాను. ఇప్పుడు మీకు మరో ఓటిపి వస్తుంది. అది కనుక చెప్తే ఆ 25000 రివర్స్ అయిపోతుంది. తప్పు జరిగి మీకు ఇబ్బంది కలిగించాను కాబట్టి, ఆ 250 మా సంస్థ భరిస్తుంది. మళ్లీ క్షమించండి సార్. ఓటిపి నెంబర్ చెప్పండి.'
అతని మాటలతో స్థిమిత పడ్డ సుబ్రహ్మణ్యం ఫోన్లో వచ్చిన ఓటీపీ చూసి, 'సార్ రాసుకోండి. 8 5 9 4 1 2. ఈసారి మాత్రం ఏమీ పొరపాటు చేయకండి సరేనా.'
'అలాగే సార్! ఈసారి పొరపాటు జరగదు. మీ రిపోర్టులు త్వరలోనే పంపిస్తాను.'
అమ్మయ్య అనుకుంటూ ఫోన్ పెట్టాడు సుబ్రహ్మణ్యం.
అదే క్షణంలో బ్యాంక్ అకౌంట్ లో మరో 25 వేలు విత్ డ్రా అయినట్టుగా మెసేజ్ వచ్చింది. ఈసారి మరింత కంగారు పడ్డాడు సుబ్రహ్మణ్యం. కానీ ఇంతకుముందు జరిగినట్టుగానే మళ్లీ పొరపాటు చేశారేమో, ఒకసారి ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది అని ఆ నెంబర్ కి ఫోన్ చేశాడు. ఫోను స్విచ్ ఆఫ్ చేసినట్టుగా మొబైల్ సమాచారం వచ్చింది. మళ్ళీ మళ్ళీ ఎంత ప్రయత్నించినా ఫోను పలకడం లేదు. ఈసారి సుబ్రహ్మణ్యం తను 'మోసపోయానా!' అనే ఆలోచనలో పడ్డాడు. ఎందుకైనా మంచిది ఒకసారి కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ రోజు అకౌంట్ నెంబర్ ఇవ్వని ఒకే ఒక వ్యక్తి కృష్ణమూర్తి.
పరుగు పరుగున కృష్ణమూర్తి ఫ్లాట్ కి వెళ్ళాడు సుబ్రహ్మణ్యం. అతని గాబరా చూసిన కృష్ణమూర్తి, మంచినీళ్లు ఇచ్చి కూర్చోబెట్టి, విషయం కనుక్కున్నాడు. అతనికి వెంటనే అర్థమైంది సుబ్రహ్మణ్యం మోసపోయాడు అని. అతను అవతల వ్యక్తికి ఓటిపి చెప్పాడు కాబట్టి, అతని అకౌంట్లో డబ్బులు విత్ డ్రా చేసి ఉంటారు. ఎందుకంటే అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, పుట్టిన తేదీ మొదలైన వివరాలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి.
'ఇప్పుడు ఏం చేయాలి?' అని అడిగాడు సుబ్రహ్మణ్యం. 'నాకు తెలిసి మీ సమస్యకి పరిష్కారం లేదు. ఎందుకంటే బ్యాంకులు ఎప్పుడూ చెబుతూనే ఉంటాయి, మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ అందజేయొద్దు అని. అయినా సరే వినకుండా మన సభ్యులంతా అన్ని వివరాలు వాళ్ళకి రాసి ఇచ్చారు. నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పటికే మిగతా వాళ్ళకి కూడా ఫోన్ చేసి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు లాగే ప్రయత్నం చేయవచ్చు. ముందుగా మనం సొసైటీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి, అతనికి విషయం చెప్పి మనవాళ్ళందరినీ ఎలర్ట్ చేయాలి. లేదంటే సాయంత్రం లోపు అందరి అకౌంట్లూ ఖాళీ అయిపోవచ్చు.'
వెంటనే ఇద్దరూ వెళ్లి, సొసైటీ ప్రెసిడెంట్ ని కలిసారు. విషయం తెలుసుకుని ఒక్కసారిగా ఖిన్నుడైపోయాడు సొసైటీ ప్రెసిడెంట్. ఈ తప్పులో తన భాగం కూడా ఉండడం అతన్ని బాధించింది. వెంటనే సొసైటీ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు 'ఎవరికైనా ఓటీపీ నెంబర్ చెప్పమని 'సేవే మా ధ్యేయం' సంస్థ నుంచి ఫోన్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని.' అలాగే వెంటనే మరో నలుగురిని పిలిచి, విషయం చెప్పి, అందరిని తలో ఫ్లోర్ కు వెళ్లి, అందరికీ అర్థమయ్యేలా వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పమని ఆదేశించాడు.
పావుగంటలో ఈ వార్త మొత్తం అన్ని అపార్ట్మెంట్లు సభ్యులకి చేరింది. అప్పటికే మరో నలుగురు తమ ఓటిపి చెప్పి మోసపోయారని వార్త వచ్చింది. అదే సమయంలో, తమ దగ్గర ఉన్న సంస్థ వివరాలతో వెంటనే సెక్యూరిటీ అధికారి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాంకులో కూడా వివరాలు అందజేయడం జరిగింది. అలాగే మరో కొంతమంది మోసపోయే అవకాశం ఉండడంతో, ఈ వార్త కేబుల్ టీవీ ద్వారా, ఇతర మీడియా ద్వారా ఊర్లో అందరికీ చేరేలా చూసాడు కృష్ణమూర్తి.
ఏది ఏమైనా ఉచితానికి ఆశపడి, వివరాలన్నీ చెప్పి, చదువుకుని కూడా విజ్ఞత ప్రదర్శించలేని తమలాంటి వాళ్ళు మోసపోతూనే ఉంటారని సుబ్రహ్మణ్యం అర్థం చేసుకున్నాడు. ఇకమీదట తనలాగా ఎవరికి జరగకూడదని, దానికి తగిన చర్యలు ప్రతివాళ్ళూ తీసుకోవాలని, తనకు తెలిసిన స్నేహితులందరికీ చెబుతూ వస్తున్నాడు సుబ్రహ్మణ్యం.
అతని మాటలు విన్న ఒక మిత్రుడు అన్నాడు, 'నీకు గుర్తుంటే ఆరోజు వైద్య శిబిరం నిర్వహిస్తున్నప్పుడు మాట్లాడిన యాంకర్ చాలాసార్లు చెప్పింది షేవే మా ధ్యేయం అని. తనకి భాష రాదు అని మనం నవ్వుకున్నాం. కానీ, విషయం చెప్పకనే చెప్పింది, 'షేవే (shave) మా ధ్యేయం' అనీ, మనకే అది అర్థం కాలేదు.'
************

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ