Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#79
"నిన్న నాతో ప్రీతిగా మాట్లాడాడమ్మా!"



"అంటే!"



"నేను వచ్చినప్పటి నుంచీ నిన్న మాట్లాడినట్లుగా అంతకుముందు ఎప్పుడూ మాట్లాడలేదు" చిరునవ్వుతో చెప్పింది దీప్తి.



"దాని అర్థం!" అడిగింది ప్రణవి.



" మాటల్లో నామీద తనకున్న అభిమానం వ్యక్తమయిందమ్మా!.." మెల్లగా చెప్పింది దీప్తి.



"మీ అత్తామామలు ఏమన్నారు?.."



"వారిరువురికీ నేనంటే ఎంతో ప్రేమ.."



"అయితే.. ఇంకా సందేహం ఎందుకు? ఈశ్వర్ నీకు కాబోయే భర్త" నవ్వింది ప్రణవి.



"మరి నాన్నా!.." సందేహంతో తల్లి ముఖంలోకి చూచింది దీప్తి.



"మీ నాన్న అహంకారి, స్వార్థపరుడు. వారిని గురించి నీవు ఆలోచించి నీ బుర్రను పాడుచేసికోకు. వారందరితో కలిసి ఢిల్లీకి వెళుతున్నావు కదా!.. సమయం చూచి నీ నిర్ణయాన్ని ఈశ్వర్కు చెప్పు.. సరేనా!"



"అలాగేనమ్మా!"



"నేను మా వదిన లావణ్యతో మాట్లాడుతాను. ఆమెకు నేనంటే ఎంతో అభిమానం. నా కోర్కెను కాదనదు."



"మరి మామయ్య!."



"ఆయన ధర్మరాజు. మీ అత్తయ్య మాటను ఏనాడూ కాదనడు!" నవ్వింది ప్రణవి.



ప్రజాపతి గదిని సమీపించి గొంతు సవరించాడు.
దీప్తి.. ప్రణవి ఉలిక్కిపడి ద్వారం వైపు చూచారు. ప్రణవి మంచం దిగి ప్రజాపతిని సమీపించింది.
"ఏమండీ!.. ఏమన్నా కావాలా!.." అడిగింది ప్రణవి.



"అమ్మాయితో విషయం చెప్పావా!"



"చెప్పానండీ!"



"ఏమండి?"



"సిగ్గుతో మౌనంగా తల దించుకుంది"



"అంటే మౌనం అంగీకార సూచనేగా!"



అవునన్నట్లు ప్రణవి తలాడించింది.
ఐదు నిముషాల క్రిందట ప్రజాపతికి నాగమణి ఫోన్ చేసింది. తన ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చేరానని చెప్పింది. కారణంగా ప్రజాపతి చెన్నైకి బయలుదేరాడు.
"అర్జంటు పనిమీద చెన్నై బయలుదేరుతున్నాను. వచ్చేదానికి రెండురోజులు పట్టవచ్చు జాగ్రత్త" చెప్పాడు ప్రజాపతి.



"మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి" అంది ప్రణవి.



ప్రజాపతి వేగంగా పోర్టికో వైపుకు నడిచాడు.
***
శివరామకృష్ణ వ్యాపారంలో భాగస్థుడు దండాయుధపాణి. నందిని పందిగా, పందిని నందిగా మార్చగల సమర్థుడు. ఎంతటివారినైనా తన నక్క వినయంతో, చమత్కారమైన మాటలతో.. ఆకట్టుకోగల ప్రజ్ఞాశాలి. అతనిలోని లక్షణాలు నచ్చినందున శివరామకృష్ణ అతన్ని తన వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకొన్నాడు ఐదు సంవత్సరాల క్రిందట.



నాలుగు సంవత్సరాలు కాంట్రాక్టు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. ఐదవ సంవత్సర ఆరంభం నుంచి దశ మారిపోయింది.



దానికి కారణం.. దండయుధపాణి చాకచక్యం.. అతనిలో దినదినాభివృద్ధిగా పెరిగిన స్వార్థం.
స్వార్థం.. ప్రతి ఒక్కరికి పైకి రావాలని వుంటుంది. శివరామకృష్ణ కొడుకులు చంద్రం, రాఘవ, వైశాలి, శారదల వివాహాలు జరిగాయి. కొడుకులిద్దరూ తల్లి, తండ్రి ప్రమేయం లేకుండా వారితో చదివిన గొప్ప ఇంటి అమ్మాయిలను వివాహం చేసుకొని అర్థాంగుల అభిప్రాయం ప్రకారం విదేశాల్లో స్థిరపడిపోయారు. కూతుళ్ళ వివాహం శివరామకృష్ణ ఇష్టానుసారంగానే జరిగాయి. వారూ తమ భర్తలతో ఒకరు బొంబాయిలో, మరొకరు చైన్నైలో వుంటున్నారు. కొడుకులు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చి శివరామకృష్ణ ఇంట్లో చుట్టాలుగా నాలుగురోజులు ఉండి, సువిశాల భారతదేశంలోని ముఖ్యపట్టణాలైన కాశ్మీర్, ఊటి, కోడైకెనాల్, ననెటాల్ మొదలగు సుందర ప్రదేశాల్లో ఆనందంగా తన అర్థాంగులతో గడిపి విదేశాలకు తిరిగి వెళ్ళిపోయేవారు.
హరికృష్ణకు తాను ఇచ్చిన మాట ప్రకారం.. వాణిని తన కొడుకు చంద్రశేఖర్కు ఇల్లాలిగా చేయలేకపోయాడు. కారణం చంద్రశేఖర్ తన క్లాస్మేట్ దివ్య అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్న కారణంగా వరించి అక్కడే వివాహం చేసుకొన్నాడు.



 ఇక, .. రెండవవాడు రాఘవ.. ఆస్ట్రేలియాలో వుంటూ తన తోటి ఆఫీస్లో పనిచేసే ఇండియన్ క్రిస్టియన్ యువతి రోసిని ప్రేమించి వారి పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియాలోని చర్చిలో వివాహం చేసుకొన్నాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 13 - by k3vv3 - 24-02-2025, 11:24 AM



Users browsing this thread: 1 Guest(s)