Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#54
'అందరూ అనాధలేనా స్వామీ?' ధరణి ప్రశ్నించింది. 



'అందరూ కాదమ్మా.... కొంతమంది పేద తల్లితండ్రులు వాళ్ళ పిల్లలికి ట్రీట్మెంట్ మేము యిప్పిస్తామని  మా దగ్గిర వదిలి వెళ్ళారు . మేము భగవంతుడి ప్రసాదమని భావించి వాళ్ళని కూడా చేరదీసాము..... మాకు వచ్చే డొనేషన్లు సరిపోవు.... ఎవరికి  ట్రీట్మెంట్ అత్యవసరమో, వాళ్ళకి చేయిస్తుంటాము...'



'తలస్సేమియా పిల్లలు యిద్దరికీ ట్రీట్మెంట్ ఖర్చు చాలా వుంటుంది కదా?'



'అవునమ్మా.... రక్త మార్పిడికి, మందులకి నెలకి ముఫై వేలవుతుంది ... శస్త్రచికిత్స చేయించాలంటే ఒక్కొక్కరికీ కనీసం పాతిక లక్షలవుతుంది... '



ధరణి ఆలోచిస్తూ, కిచెన్ వైపు నడిచింది. అక్కడ వంటలు చూసి ఆశ్చర్యపడింది. మేడం వైపు ప్రస్నార్ధకంగా చూస్తోంది లలిత . 



' పిల్లలిద్దరి చికిత్సకీ  నెలనెలా ముఫై వేలు నేను యిస్తాను. వాళ్ళిద్దరి సర్జరీ కి ఏర్పాట్లు కూడా చూస్తూ వుండండి... ' అంది ధరణి.



 'భగవత్ ప్రసాదం తల్లీ,' అన్నాడు స్వామి.



లలిత ఒక్కసారిగా షాక్ తింది . మేడం గురించి స్టాఫ్ కధలు కధలుగా చెప్పుకుంటుంటారు. ఆవిడ దుబారా ఖర్చుల గురించి, విలాసవంతమైన జీవితం గురించి ఎన్నో రూమర్స్ వున్నాయి. ఆమె అసలు యీ ఆశ్రమం చూద్దామనడమే షాకింగ్ అయితే, యిప్పుడు నెలకి ముఫై వేలు యిస్తామనడం, సర్జరీ ఖర్చులు భరిస్తాననడం  యింకా పెద్ద షాక్ అనిపించింది లలితకి. 
తర్వాత మరికొన్ని వివరాలు తెలుసుకుని ధరణి బయల్దేరింది. 'లలితా, నువ్వు నన్ను యిక్కడికి తీసుకొచ్చి మంచి పని చేసావు..... నా జీవితంలో యీ రోజు ఒక టర్నింగ్ పాయింట్ లలితా...' అంది. 



ధరణికి గాలిలో తేలిపోతున్నట్టుంది. మనసుకి హాయిగా వుందనిపించింది . రాత్రంతా గిల్టీ ఫీలింగ్. నిద్ర పట్టలేదు. తను చేస్తున్న తప్పులన్నీ ఒక సీరియల్ లా కనిపించాయి. ప్రపంచంలో ఎంతమంది డబ్బు లేక కష్టాలు పడుతున్నారో! తనకి డబ్బు ఎక్కువై ఏం చేయాలో తెలియక విశృంఖలంగా ప్రవర్తిస్తోంది. 



ఇంటికి చేరిన ధరణి వాష్ బేసిన్ దగ్గర నిలబడి మేకప్ ని శుభ్రం చేసుకుంది. పావుగంట పట్టింది. తర్వాత అద్దంలో ముఖాన్ని వివరంగా చూసుకుంది. చర్మంలో కాంతి లేదు. కళ్ళ కింద కొంచం నల్ల చారలు వస్తున్నాయి. చెక్కిళ్ళు కొంచం జారుతున్నట్టున్నాయి. మేకప్ పైపై మెరుగులు పెంచుతూ, అసలు అందాన్ని తగ్గిస్తుంది. వయసుని పదేళ్ళు పెంచేస్తుంది. మేకప్ మానేస్తే యిద్దరు తలస్సేమియా పేషెంట్స్ కి రక్త మార్పిడికి సరిపోతుంది. అలాగని ఆఫీస్ కి మేకప్ లేని ముఖంతో వెళ్తే గుర్తుపట్టరేమో !?... దేశీయ మేకప్ లైట్ గా చేసుకుని , ముఖాన్ని కాపాడుకోవాలి, అని తీర్మానించుకుంది ధరణి. దేశీయ మేకప్ గురించిన వివరాలు గూగుల్ లో సెర్చ్ చేసింది. మంచి సమాచారం దొరికింది. వెంటనే దేశీకి మారిపోవాలని నిర్ణయించింది.



దుస్తులు మార్చుకుంది. తను వేసుకునే నైటీ ధర ఏడువేల అయిదొందలు. వెయ్యి రూపాయల్లో మంచి నైటీ దొరకదా? అందులో మిగిలే డబ్బు పిల్లాడి వైద్యానికో సరిపోతుంది కదా?... అలా చేస్తే తను నైటీలు, డ్రెస్  కొనుక్కునే బౌటిక్ వాళ్ళ ఆదాయం తగ్గిపోదా?... తగ్గుతుందేమో కానీ, వీధిన పడరు కదా?... వాళ్ళ దగ్గిర కొనుక్కునే వాళ్ళు వందల్లో వుంటారు. నామీద పడి బతకడంలేదు కదా!... 



చీరల విషయంలో కూడా పాలసీ మార్చాలి   యికనించి మంచి కాటన్ చీరలు కట్టుకోవాలి. గంజి పెట్టి వుతికించి, యిస్త్రీ చేయించి కట్టుకుంటే అందంగా కనిపించనా?  ... డ్రెస్ మీద కూడా ఎంతో పొదుపు చేయచ్చు; ఎంతో మంది ప్రాణాలు కాపాడచ్చు. 



'ప్రపంచాన్ని మార్చలేను కానీ, నన్ను నేను మార్చుకోగలను,' అనుకుంది ధరణి.
డ్రింక్స్ తయారు చేసుకుంది. ఒక్కో సిప్ చప్పరిస్తూ, సోఫాలో వెనక్కి వాలిపోయి ఆలోచనలో పడింది ధరణి. గుండె బరువు కొద్దిగా తగ్గినట్టనిపించింది. తన అకౌంట్ లో ఎనభై లక్షలున్నాయి; వాటిని యిద్దరి పిల్లల సర్జరీ కి వుపయోగించవచ్చు . తన ఖర్చుల్ని గణనీయంగా తగ్గిస్తే ఆశ్రమంలో పిల్లల్ని ఆరోగ్యవంతుల్ని చేయచ్చు; మంచి చదువు చెప్పించచ్చు; మంచి జీవితాల్ని యివ్వచ్చు. తన తల్లితండ్రులు కష్టపడి తనకి యింత మంచి చదువు చదివించి, యింత మంచి జీవితాన్నిస్తే, దాన్ని కొద్దిగా అయినా సద్వినియోగం చేయాలి కదా!... ఇంతకాలం బాధ్యతా రాహిత్యంతో బతికింది తను;  ఇక నించైనా కొంచం బాధ్యతతో మెలగాలి, అనుకుంది.



మరో డ్రింక్ తయారు చేసుకుంది. 'స్కాచ్ విస్కీ కి ఇండియన్ విస్కీ కి ఎంత తేడా వుంటుంది? .... రుచిలో కొంచం తేడా, ధరలో చాలా యెక్కువ వ్యత్యాసం... లెట్ మీ షిఫ్ట్  టు ఇండియన్ బ్రాండ్స్, అని నిర్ణయం తీసుకుంది. 



మూడు నెలల్లో తలస్సేమియా పేషెంట్లు యిద్దరికీ బోన్ మారో సర్జరీ చేయించింది ధరణి. తన అకౌంట్ ఆల్మోస్ట్ ఖాళీ అయింది, మనసు సంతృప్తితో నిండిపోయింది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - చివరకు మిగిలేది.. - by k3vv3 - 19-02-2025, 05:37 PM



Users browsing this thread: 1 Guest(s)