Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#53
'నైస్... '



లలితకి యీ సంభాషణ నచ్చలేదు. వాళ్ళిద్దరినీ తొందర పెట్టింది. తొందర పెట్టడం అంటే, పదే పదే వాచ్ చూసుకోడమే. 



అరగంటలో ఆశ్రమానికి చేరుకున్నారు. ఏంతో విశాలమైన క్యాంపస్. యోగా కోసం ఒక బిల్డింగ్, మెడిటేషన్ హాల్, లైబ్రరీలు మరో బిల్డింగ్ లో.  చివరి బిల్డింగ్ లో ఒక భాగం వృద్ధాశ్రమం, మరో భాగంలో అనాధ పిల్లలకి ఆశ్రయం.



అక్కడ ఆడుకునే పిల్లలు కొందరు, ఆడుకోలేని దివ్యాంగులు కొందరు, అస్వస్థత తో కొందరు కనిపించారు. ఒక వైపు అమాయకమైన ఆనందం, మరో వైపు కళ్ళు తడిపే దృశ్యం. సృష్టిలోని వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. 



బిల్డింగ్ వెనక మీటింగ్ హాల్ లో చాలామంది ఆహుతులు ఎదురుచూస్తూ కూర్చున్నారు. మీటింగ్ లో ధరణి ఆశ్రమ నిర్వాహకులకి వ్యాన్ తాలూకు కాగితాలు అందించింది. మనోహర్ కూడా ఫోటో కోసం చెయ్యి వేసాడు. నలుగురైదుగురు మాట్లాడారు. ధరణి ప్రిపేర్ అయిన స్పీచ్ కూడా పూర్తిగా చెప్పలేక పోయింది. అందుక్కారణం అస్వస్థత తో కనిపించిన చిన్నారులు. ఆమె మనస్సులో వాళ్ళే మెదులుతున్నారు. అక్కడ సభలో వున్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ విచారంగానే కనిపిస్తున్నారు. అలాంటి సమావేశానికి ఖరీదైన దుస్తులు వేసుకొచ్చినందుకు, మేకప్ దట్టించినందుకు, నాలుగు దిశలా వ్యాపిస్తున్న పెర్ఫ్యూమ్ వేసుకొచ్చినందుకు చిన్నతనంగా ఫీల్ అయింది ధరణి.



ఫొటోల్లో అందంగానే కనిపిస్తుంది. ఫోటోలు అన్నీ న్యూస్ పేపర్స్ లో వస్తాయి. కొన్ని టీ వీ ఛానెల్స్ లో కూడా చూపిస్తారేమో. కానీ ధరణి, జీవితంలో మొదటి సారి విచారపడింది. ఇలాంటి మీటింగ్స్ కి రాకూడదు, అని ఒక క్షణం అనిపించింది. 



మరుక్షణం ఆలోచన తప్పనిపించింది. కడుపులో దేవినట్టనిపించింది. రక రకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలు కనిపిస్తున్నారు. వాళ్ళు జన్మలో పాపం చేసారో , యీ జన్మలో యింత చిన్న వయసులో యిలా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఆశ్రయం కల్పించి యింత మంచిగా చూసుకుంటున్నయీ ఆశ్రమ నిర్వాహకులని  అభినందించాల్సిందే. వాళ్ళకి సేవ చేస్తున్న స్టాఫ్ ఎంత మంచివాళ్ళో . ధరణి గుండె బరువెక్కింది.
మీటింగ్ అయిపోయాక ముగ్గురూ ఆఫీస్ కి బయల్దేరారు.
******
ఇంటికి చేరిన  ధరణి కి మనస్సు మనస్సులో లేదు. ఆశ్రమం చుట్టూ తిరుగుతోంది. లోపల అనారోగ్యం తో బాధ పడుతూ, సంతోషంగా కనిపిస్తున్న పిల్లలు, వృద్ధులు, వాళ్లకి సేవ చేస్తున్న ఆయాలు, రేపో మాపో పోతారనిపిస్తున్న మంచాల్లోని పిల్లలు కనిపిస్తున్నారు. 



డ్రెస్ మార్చుకుని కప్ బోర్డు లోని స్కాచ్ విస్కీ బాటిల్ టీపాయ్ మీద పెట్టింది.ఫ్రిడ్జ్ లోంచి సోడా బాటిల్స్ తీసి టీపాయ్ మీద పెట్టింది. కిచెన్ లో హాట్ ప్యాక్ లో పెట్టిన చికెన్ టిక్కా ని ఓవెన్లో రెండు నిముషాలు వేడి చేసి డ్రాయింగ్ రూమ్ లోకి తెచ్చుకుంది. సోఫా లో కూర్చుని స్కాట్లాండ్ నించే తెప్పించిన అందమైన గ్లాస్ లో విస్కీ సుమారుగా ముఫై ఎం ఎల్ వేసుకుంది. సోడా తో గ్లాస్ని  సగం వరకు నింపింది. ఒక డ్రాప్ రుచి చూసింది. లేచివెళ్లి ఫ్రిడ్జ్ లోంచి ఐస్ క్యూబ్స్ తెచ్చుకుంది.  ఒక పీస్ గ్లాస్ లో వేసుకుని టేస్ట్ చేసింది. బాగుందనిపించింది.



పక్కనే వున్నరిమోట్ తో టీ వీ ఆన్ చేసింది. న్యూస్ చూస్తూ గ్లాస్ లోని విస్కీ ని కొద్ది కొద్దిగా చప్పరిస్తొంది. సంతోషానుభూతిని, సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్, పొందుతోంది. క్షణాల్లో మధ్యాహ్నం ఆశ్రమంలోని సీన్స్ మదిలో మెదిలాయి. అంతే. విస్కీ లోని చెడుతనము నాలుక్కి తగిలింది.



కడుపులో మళ్ళీ దేవినట్టయింది. ఒక్క గుటకలో మిగిలిన డ్రింక్ తాగేసింది. మరో అయిదు నిముషాల్లో మరో రెండు డ్రింక్స్ గటగటా తాగేసింది. ఇక తాగలేక పోయింది. విస్కీ వగరుగా, కొంచం తియ్యగా అనిపించింది. తాగాక ఇక చాలనిపించి, బాటిల్ ని మళ్ళీ కప్ బోర్డు లో పెట్టేసింది. కొంచం మత్తుగా అనిపించి సోఫాలో వాలిపోయింది.



ఒక గంట తర్వాత నరసింహ వచ్చి ధరణిని లేపి, వేడి వేడి చపాతీలు, చికెన్ వేపుడు తెచ్చి టీపాయ్ పెట్టి తినమని రిక్వెస్ట్ చేసాడు. నెమ్మదిగా రెండు చపాతీలు తిని ఇక చాలంది. మిగిలిన ఫుడ్ ని తీసి కిచెన్ లోకి వెళ్ళాడు నరసింహ. మిగిలిన ఐటమ్స్ అన్నీ గిన్నెల్లో పెట్టుకుని తను తీసికెళ్ళాడు. నెమ్మదిగా లేచి బెడ్రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద వాలిపోయింది ధరణి.  



తర్వాతి రోజు ఆఫీస్ కి వెళ్లిన గంటకి లలితని తన కేబిన్ కి పిలిచింది ధరణి. 
లలిత ధరణి కేబిన్ కి వెళ్లి ఎదురుగా నిలబడింది. మేడం విషయం గురించి అడుగుతుందో అని ఎదురుచూస్తోంది. తన దగ్గిర పెండింగ్ ఇష్యూస్ ఏమీ లేవు కూడా. 
'లలితా, నీకు అనాధాశ్రమం గురించి ఎలా తెలిసింది?'



అమ్మయ్య, అనుకుంటూ లలిత చెప్పింది, 'నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది మేడం . నేను నెల నెలా వెయ్యి రూపాయలు డొనేట్ చేస్తుంటాను...'



' సీ ... మనం యీ రోజు సాయంత్రం ఒక సారి అక్కడికి వెల్దామా?...'



'అలాగే మేడం '



సాయంత్రం ఆఫీస్ అయ్యాక లలిత ధరణి దగ్గిరకి వచ్చింది. నిజానికి ధరణికి టైమింగ్స్ అంటూ వుండవు. అయినా అయిదింటికి లలితతో వెళ్ళడానికి సిద్ధమైంది. ఇద్దరూ ధరణి కారులో ఆశ్రమానికి వెళ్ళారు . అక్కడ స్వామి రామానంద ని కలిసారు . ఒకసారి పిల్లల్ని చూడాలని వుంది, అన్నది ధరణి. ముగ్గురూ పిల్లలు వుండే బిల్డింగ్ కి వెళ్ళారు. స్వామి రామానంద పిల్లల్ని చూపిస్తూ, 'వీళ్ళిద్దరూ పోలియో బాధితులు, వీళ్ళు ఆరుగురు మానసికంగా ఎదగని పిల్లలు, వీళ్ళిద్దరూ పుట్టు గుడ్డి , యీ పిల్లగాడు ప్రమాదంలో రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు, యీ యిద్దరూ తలస్సేమియా వ్యాధితో బాధపడుతూ, చావు కోసం ఎదురు చూస్తున్నారు, వీళ్ళు పదిమంది ఆనాధలు, అడుక్కుంటుంటే సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకొచ్చి మాకు అప్పగించారు.... యింకా నలుగురు రకరకాల కాన్సర్ వ్యాధులతో బాధపడుతూ ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో వున్నారు...ముగ్గురికి గుండెలో చిల్లు వుంది. వాళ్ళకి శస్త్రచికిత్స చేయించాలి ' అని వివరించాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - చివరకు మిగిలేది.. - by k3vv3 - 19-02-2025, 05:35 PM



Users browsing this thread: 1 Guest(s)