19-02-2025, 05:34 PM
వెలుతురులోకి
రచన: శిరిప్రసాద్
ధరణి గులాబీ రంగు చీర, మాచింగ్ బ్లౌజ్ లో అందంగా మెరిసిపోతోంది. పౌర్ణమి చంద్రుడిలా ఆమె ముఖం వెలిగిపోతోంది. కళ్ళు పెద్దవి కావడంతో వాటికి ఆకర్షణ శక్తి చాలా ఎక్కువ. దానికి తోడు మధ్యస్థంగా నుదురు, పదునుగా కనిపించే ముక్కు, కొద్దిగా గులాబీ వర్ణంలో చెక్కిళ్ళు, లేతగా కనిపిస్తున్న ఎర్రటి పెదాలు, నున్నటి చుబుకం, ధరణి అందాన్ని నిర్వచించ లేక పోతున్నాయి.
ఎంత నిర్వచించలేని అందమున్నా, సమాజంలో స్థాయిని పెంచేందుకు, అందాన్ని ద్విగుణీకృతం చేసుకునేందుకు, అప్సరసే స్వర్గం నించీ దిగొచ్చిందా అనిపించేందుకు దానికి పై అద్దకాలు అవసరం. ధరణి ఆ పనిని లూ రియల్ పేస్ మేకప్ ద్వారా చేసుకుంటుంటుంది. ఎంతో ఖరీదు చేసే ఆ మేక్ అప్ కిట్ కింద నెలకి పది వేలు ఖర్చుపెడుతుంది. అంతేనా అంటే, కాదు. నెలకి రెండు సార్లు బ్యూటీ పార్లర్ కి వెళుతుంది. సగటున ఆ ఖర్చు నెలకి ఓ యిరవై వేలవుతుంది. లిప్స్టిక్ కింద ఓ వెయ్యి రూపాయలవుతుంది. నెయిల్ పోలిష్ కింద మరో వెయ్యి రూపాయలు.
మేకప్ కింద యింత ఖర్చు పెడుతున్నప్పుడు శరీరాన్ని కప్పివుంచే బట్టలకి యెంత పెట్టాలి?
ఖరీదైన కుర్తా సెట్స్ ధరణి వార్డ్ రోబ్ లో మూడు వున్నాయి. ఆ మూడు సెట్స్ ఒకేసారి మూడు లక్షలకి కొన్నది. కంపెనీ ఎం డీ విజిట్ కి వచ్చినప్పుడు వేసుకుంటుంది. కొన్ని ముఖ్యమైన రోజుల్లో సామాన్యులకి ప్రవేశం లేని స్టూడియో లో తీసుకున్న పది సెట్స్ టాప్స్, బోటమ్స్ , కుర్తీస్ , రోజు వాడకం కోసం కనీసం రెండు వేలు ఖరీదు చేసే కాటన్ సారీస్ యాభై వరకు వుంటాయి. ప్రత్యేకమైన ఫంక్షన్స్ కోసం సిల్క్ చీరెలు పదివేల నించి లక్ష ఖరీదు చేసేవి కొన్ని వున్నాయి. క్యాజువల్ డ్రెస్ లు, జీన్స్ పాంట్స్, షర్ట్స్ వంటివి పది జతల పైగానే వుంటాయి . అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫెర్ఫ్యూమ్స్ వాడుతుంది.
ఇక యాభై లక్షల విలువ చేసే బెంజ్ కార్ లో యీ అందాల భామ ఆఫీస్ కి వెళ్తూ వుంటుంది. అయిదేళ్ల కిందట కొనుక్కున్న హ్యుండై కారు, ఎప్పుడో కొనుక్కున్న టీ వీ ఎస్ స్కూటర్ జ్ఞాపకార్ధం గారేజ్ లో వుంచుకుంది . ప్రతి మూడు నెలలకి వాటిని వాడుతూ, సర్వీసింగ్ చేయిస్తుంది.
ధరణి ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తుంది. ఒక మధ్య తరగతి కుటుంబం నించి వచ్చింది. చదువులో ఎప్పడూ నెంబర్ వన్ గా వుండేది . ఐ ఐ టీ లో ఇంజనీరింగ్ చేసి యూ ఎస్ లో మాస్టర్స్ చేసింది. అక్కడే ప్రొఫెసర్ రిఫరెన్స్ తో టాప్ కంపెనీ లో జాబ్ తెచ్చుకుంది. ఐదేళ్లలో మూడు కంపెనీలు మారి ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో స్థిర పడింది. మేధస్సు తో పాటు, యింగితం వున్న వ్యక్తి కాబట్టి చురుగ్గా వుండడంతో పై స్థాయికి త్వరత్వరగా ఎదిగింది. శాలరీ ప్యాకేజీ సంవత్సరానికి రెండు కోట్లు. కంపెనీ షేర్స్ పది వేలున్నాయి. ఏటా లాభంలో వాటా కింద ఓ యాభై లక్షలు సంపాదిస్తుంది. టాప్ కంపెనీలని క్లైంట్స్ గా చేర్చి టాప్ మానేజ్మెంట్ మెప్పు పొందింది. ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఊరు నించి ఒక మధ్య తరగతి భార్య భర్తలని తెచ్చి తోడుగా వుంచుకుంది . వాళ్ళే ఆమెకి అన్నీ అవసరాలు తీరుస్తుంటారు. ఇంకా పెళ్ళి చేసుకోలేదు.
అప్పుడప్పుడు పబ్స్ కి వెళ్తూ ఉంటుంది. తనతో స్నేహం చేసే మధ్య వయస్కులు ఇద్దరున్నారు. వాళ్ళతో కాసేపు డ్రింక్స్, కాసేపు డాన్స్ , మళ్ళీ డ్రింక్స్. తర్వాత బయట స్టార్ హోటల్ లో బఫెట్. ఆ తర్వాత మూడ్ ఉంటే ఆ ఫ్రెండ్ ని యింటికి తీసుకెళ్లి ఆ రాత్రి ఎంజాయ్ చేస్తుంటుంది. అది పెద్ద తప్పు పని అనుకోదు. ఆకలేస్తే హోటల్లో అన్నం తిన్నట్టు. ఒక భౌతిక అవసరం. అంతే. ఆ అవసరం కోసం పెళ్లి అనే గుదిబండని తగిలించుకోడం ఎందుకు, అనుకుంటుంది. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఇలాంటివి తప్పుకాదని అనుకుంటుంది. అయితే ఎందుకో అవి రహస్యం గా వుండాలని కోరుకుంటుంది. అక్కడే అది తప్పు పని అవుతుందని తెలుసుకోలేక పోతుంది. విచిత్రం!
ఆ రోజు కార్పొరేట్ ఆఫీస్ నించి వైస్ ప్రెసిడెంట్ [ పబ్లిక్ రిలేషన్స్ ] వస్తున్నాడు. మనోహర్.
హైదరాబాద్ లో ఒక అనాధాశ్రమానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీ తరఫున ఒక వ్యాన్ డొనేట్ చేయడానికి వస్తున్నాడు. మనోహర్ సీ యీ ఓ కి అత్యంత సన్నిహితుడు. అతగాడి దగ్గిర మార్కులు కొట్టేయాలని మరింత అందంగా తయారైంది ధరణి. అనాధాశ్రమాల గురించి నెట్ లో కొంత మేటర్ సేకరించి చిన్న స్పీచ్ తయారు చేసుకుంది. ఆ కార్యక్రమంలో మాట్లాడాల్సి వస్తే తన హోదాకి తగ్గట్టు మాట్లాడాలి కదా!
ధరణి చక్కగా తయారై ఆఫీస్ కి వెళ్ళింది. అనాధాశ్రమానికి మనోహర్ ని, ధరణి ని తీసికెళ్లేందుకు ఆఫీస్ లో పనిచేస్తున్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ లలిత సిద్ధంగా వుంది. ముగ్గురూ కాఫీ తాగుతూ మాట్లాడుకున్నారు.
'ధరణీ మేడం , మీరు వివాహం ఎప్పుడు చేసుకుంటున్నారు?' అడిగాడు మనోహర్.
'నా పెళ్ళి పట్ల మీకెందుకో అంత ఇంటరెస్ట్?'
' మీరు జీవితంలో అన్నీ సాధించారు. చక చకా పైకెదుగు తున్నారు... పెళ్ళీడు వచ్చేసింది... యింకా ఏమి అడ్డం వస్తున్నాయో... తెలుసుకుందామని...'
'ఏవీ అడ్డం రావట్లేదు... టైం వచ్చినప్పుడు అదే అవుతుంది... '
'అఫ్ కోర్స్, టైం వస్తే అవుతుంది లెండి... ఆ టైం ఎప్పుడా, అని...'
'ఆ టైం వచ్చినప్పుడు మీకు ఇన్విటేషన్ పంపిస్తాను... తప్పకుండా రండి...'
'స్యూర్ ... నేనేమిటి, బోర్డు మొత్తం వస్తుంది... అప్పుడు వాళ్ళకి యిక్కడ ఏర్పాట్లు కూడా నేనే చూసుకోవాల్సి వస్తుంది...'
'తప్పకుండా....'
ముగ్గురూ లేచారు.
'మీరు ఏ ఫెర్ఫ్యూమ్ వాడతారో?... మగవాళ్ళని యిట్టే పడేస్తుంది...'
'థాంక్స్... పెర్ఫ్యూమ్స్ లో ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ ఫేమస్ కదా!... అదే, ఏదో దొరికే వెరైటీ వాడుతుంటాను... '

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ