Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఇంకెంత సేపు
#56
వెళ్లి వాళ్ళని హెచ్చరించుదామానుకుని, మావి పోలేదా, వాళ్ళవి పోతే నాకెందుకు అనుకుని  వచ్చి, పక్కన అద్దికున్న వాళ్ళు కూడా వడియాలు పెట్టుకున్నారోయ్ అన్నాడు భార్య తో.
రోజు సాయంత్రం మేడమీదకి వెళ్లి చూసేవాడు సీతారామయ్య, వాళ్ళ వడియాలు కాకులు ఎత్తుకువెళ్ళయో లేదో అని. పెట్టిన వడియాలు పెట్టినట్టు వుండేవి. భార్య కి చెప్పి, బహుశా వాళ్ళు కారం ఎక్కువ వేసుకొని వుంటారు, నువ్వు వేయమంటే మీకు బీపీ అని చెప్పి నడిచప్పిడి గా చేసావు అన్నాడు సీతారామయ్య.



నాలుగు రోజుల తరువాత, అద్దెకున్న వాటలోని మూర్తిగారు చేతిలో ఒక పొట్లంతో వచ్చి, టేబుల్ మీద పెట్టాడు. 



ఏమిటి మూర్తి గారు పొట్లం అన్నాడు సీతారామయ్య.



ముందు మీరు నన్ను క్షమించాలి, మీరు బూడిదగుమ్మడి కాయ కొనడం చూసి, నేను కూడా బూడిదగుమ్మడి కాయ కొని మా ఆవిడ కిచ్చి వడియాలు పెట్టమని చెప్పాను. అయితే అందరు భార్యలు అనే విధంగానే తను కూడా నడుం నొప్పి, వడియాలు పెట్టలేను అంది. దానికి మా మహాలక్ష్మి అక్కయ్య గారు వడియాలు పెడుతున్నారు, మనకి కూడా పెట్టి యిమ్మంటాను, నీకు రాదు అని చెప్పి అడుగుతాను అన్నాను.



తరువాత కాయ విషయం, వడియాలు విషయం మర్చిపోయాను. నాలుగు రోజుల క్రితం సాయంత్రం మేడమీదకి వెళ్ళినప్పుడు వడియాలు చూసి, అరే పాపం.. నేను పెట్టలేను అని వడియాలు పెట్టేసింది అనుకుని, పచ్చి వడియాలు వేయించుకుని తింటే బాగుంటాయి అని కొన్ని వడియాలు తీసుకుని వేయించుకుని తిన్నాను. 



అయితే అప్పుడు మా ఆవిడ తాంబూలం తీసుకోవడానికి పక్క వీధిలో కి వెళ్లడం తో తనకి విషయం తెలియదు.



రుచి మరిగిన నోరు వూరుకోదు అని, మర్నాడు కూడా కొన్ని వడియాలు తీసుకుని నా భార్యకిచ్చి వేయించమన్నాను.



 తను వడియాలు ఎవ్వరు యిచ్చారని అడిగితే, నువ్వు పెట్టావుగా అన్నాను. 



అయ్యే రాత, అటు చూడండి టేబుల్ క్రింద అంది. 



మా బూడిదగుమ్మడి కాయ ముసముసి నవ్వులు నవ్వుతు కనిపించింది.  అయితే వడియాలు మన యింటి యజమాని గారివి అన్నమాట, కొంపములిగింది అనుకుని, అప్పటికప్పుడు మా ఆవిడ చేత వడియాలు పెట్టించి, ఎండిన తరువాత యిప్పుడు కొన్ని మీకు తీసుకొని వచ్చాను. నా పొరపాటు కి క్షమించండి అన్నాడు మూర్తి.



మేము కాకులు ఎత్తుకుపోయాయి అనుకున్నాము. తెలియక చేసినదానికి క్షమించడం లాంటి పెద్ద మాటలు ఎందుకు మూర్తి గారు అన్నాడు.
***
ఆగు, కథ బాగుంది కదా అని చూసేస్తున్నావు, అసలు వడియాలు ఎవరు కనిపెట్టారు, వాటిని ఏమి చేసుకుంటారో చెప్పు, జవాబు తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు ఆవలిస్తో భేతాళుడు.



నిజానికి విక్రమార్కుడుకి కథలో  ఎందుకు వాళ్ళు కంగారు పడుతున్నారో, వడియాలు ఏమిటో, ఎండపెట్టడం ఏమిటో ఒక్క ముక్క అర్ధం కాలేదు. తనకి రాజకుమారులు వేటకు వెళ్లి చేపలు ఎండపెడతారని తెలుసు అంతే అనుకుని మాట్లాడకుండా వున్నాడు.



ఏదో ఒక జవాబు చెప్పవయ్యా రాజా, నేను త్వరగా చెట్టు మీదకి ఎగరాలి అన్నాడు భేతాళుడు.



కాలం గడిచి అడివిలో నుంచి బయటకు వచ్చేస్తున్నాడు తప్పా విక్రమార్కుడు ఒక్క మాట మాట్లాడలేదు. అంతలో భుజం మీద వున్న భేతాళుడు విక్రమార్కుడికి ఎదురుగా నిలబడి, రాజా నువ్వే గెలిచావు. యిహనుంచి నేను నీ అదుపులో వుంటాను, నువ్వు చెప్పింది చేస్తాను అన్నాడు వినయంగా.



భేతాళా! నువ్వు నీ చెట్టు మీదనే వుండి, దారిన వెళ్తున్నవారికి శ్రమ తెలియకుండా కథలు చెప్పి, వాళ్ళు ఏమి జవాబు చెప్పారో నాకు ప్రతీ ఉదయం చెప్పాలి. కథలు మా కవులకి నేను చెప్పి పరీక్ష పెడతాను అని చెప్పి, యిప్పుడు ముందుగా దంపతుల యింటికి వెళ్లి వడియాలతో వాళ్ళు ఏమి చేసుకున్నారో అవి తీసుకుని రా అన్నాడు.



ఆజ్ఞ అంటూ భేతాళుడు మాయం అయ్యాడు. విక్రమార్కుడు యింటికి చేరి భోజనం కి కూర్చుని, మహారాణికి వడియాల గురించి చెప్పుతోవుండగా, భేతాళుడు నాలుగు గిన్నెలు తో  ప్రవేశించి మహారాజా! యివిగో వాళ్ళు చేసుకున్న వంటలు. వడియాలు వేసిన పనసపోట్టు కూర, ఉల్లిపాయలు వడియాల పులుసు, వేయించిన వడియాలు, ఎందుకైనా మంచిది అని కొన్ని వడియాలు కూడా తీసుకుని వచ్చాను, మీకు మహారాణి గారు వండి పెట్టడానికి అన్నాడు భేతాళుడు.



మాట విని మహారాణి కోపంగా చూసింది భేతాళుడు వంక.
***
ఆమ్మో! భేతాళుడు మన వడియాలు ఎత్తుకుపోతున్నాడు అంటూ పెద్ద కేక పెట్టాడు సీతారామయ్య. 



పడుకోండి మీ వడియాలు పాడుగాను, నిద్రలో కూడా తిండి పిచ్చే. యింకా తెల్లారలేదు అని కసిరింది మహాలక్ష్మి.
[font=var(--ricos-font-family,unset)]     [/font][font=var(--ricos-font-family,unset)] [/font]

శుభం  
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - రమణారావూ-రాశిఫలాలూ - by k3vv3 - 09-02-2025, 07:34 AM
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM



Users browsing this thread: 1 Guest(s)