28-06-2019, 08:42 PM
(27-06-2019, 07:43 AM)stories1968 Wrote:సెక్షన్ 497 రద్దుతో వివాహ వ్యవస్థకు చేటు
భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 497ను రద్దు చేయరాదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ సెక్షన్ రద్దు వల్ల వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని పేర్కొంది. ఒక పురుషుడికి మరో వివాహితతో అక్రమ సంబంధం ఉంటే ఆ పురుషుడికి మాత్రమే శిక్ష విధించాలని సెక్షన్ 497 చెబుతోంది. ఈ సెక్షన్ చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలయిన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. ‘‘సెక్షన్ 497.. వివాహ వ్యవస్థకు రక్షణగా, తోడ్పాటుగా ఉంది. ఈ సెక్షన్‌తో పాటు క్రిమినల్ శిక్షా స్మృతిలోని 198(2)ను కొట్టివేయడం.. వివాహ వ్యవస్థకు, వివాహ పవిత్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే భారత విలువలకు చేటు చేస్తుంది. భారత సమాజం విశిష్ట నిర్మాణం, సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని వివాహ పవిత్రతను కాపాడడానికి ఈ చట్టంలోని నిబంధనలను శాసన వ్యవస్థ తన వివేచనతో ప్రత్యేకంగా రూపొందించింది.’’ అని అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. అక్రమ సంబంధాలు నేరం కాదని ప్రకటిస్తే వివాహబంధపు పవిత్రత బలహీనపడుతుందని పేర్కొంది. క్రిమినల్ న్యాయ వ్యవస్థలో సంస్కరణలపై జస్టిస్ మలిమథ్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్రం ప్రస్తావించింది. సెక్షన్ 497ను స్త్రీ-పురుష వ్యత్యాస రహితంగా మార్చాలని ఆ కమిటీ సూచించింది. ఈ అంశాలన్నింటినీ ప్రస్తుతం న్యాయకమిషన్ పరిశీలిస్తోందని, సెక్షన్ 497లో సవరణలకు సంబంధించి లా కమిషన్ తుది నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపింది. పరాయి వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఐదేళ్లకు మించకుండా కారాగార శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించాలని సెక్షన్ 497 చెబుతోంది. దీన్ని రద్దు చేయాలని ఇటలీలో నివాసం ఉంటున్న భారతీయ వ్యక్తి జోసెఫ్ షైన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు దీన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపించింది. పురుషులపై వివక్ష చూపిస్తున్నందున ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని జోసెఫ్ పేర్కొన్నారు. లైంగిక సంబంధానికి పరస్పర అంగీకారం ఉన్నప్పుడు అందులో ఒకరు బాధ్యులు కాదనడం సరైనది కాదన్నారు. భర్త అనుమతితో మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంటే నేరం కాదని ఈ సెక్షన్ చెబుతోందని, అంటే మహిళ.. పురుషుడి ఆస్తి అన్నట్లుగా ఉందని, ఇది పరోక్షంగా మహిళలపై వివక్షేనని పిటిషనర్ వాదించారు.
(27-06-2019, 07:44 AM)stories1968 Wrote: వివాహేతర సంబంధాలు
497పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
The Supreme Court Says Adultery prima facie violative of right to equality.
వివాహేతర సంబంధాలను (ఆడల్టరీ) నేరంగా పరిగణించే ఇండియన్ పీనల్ కోడ్‌లోని 497వ సెక్షన్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన సమానత్వపు హక్కును ఈ సెక్షన్ ఉల్లంఘిస్తున్నట్టు ప్రాథమికంగా కనిపిస్తోందని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాహేతర సంబంధాల విషయంలో వివాహితలను మినహాయించి.. పెళ్లయిన పురుషుడిని మాత్రమే శిక్షించే సెక్షన్ 497ను రద్దు చేయాలంటూ జోసెఫ్ షైనీ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ ధర్మాసనంలో ఆర్‌ఎఫ్ నారీమన్, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్, ఇందూ మల్హోత్రా తదితర న్యాయమూర్తులు ఉన్నారు. వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు సెక్షన్ 497ను కొనసాగించాల్సిన అవసరముందన్న కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఇదే వాదనను పాటించినట్టయితే ఇప్పుడున్న నేరం కన్నా తీవ్రమైన నేరంగా దీనిని పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్ వాదనల సందర్భంగా పేర్కొన్నారు. వివాహేతర లైంగిక సంబంధాలు ఉంటే.. ఆ పరిణామాలతో సంబంధం లేకుండానే.. పెళ్లి రద్దుకు దారితీసేవిధంగా ఈ చట్టం ఉందని ఆయన అన్నారు.
సెక్షన్ 497 ప్రకారం.. పెళ్లయిన స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేక ఈ రెండూ గానీ ఉంటాయి. స్త్రీకు ఇవేమీ ఉండవు. ఆమె అసలు నేరస్తురాలే కాబోదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం మతానికి, జాతికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా స్త్రీ, పురుషులంతా చట్టం ముందు సమానమే అయినప్పుడు 497 సెక్షన్ కూడా ఆ ఆర్టికల్‌కు లోబడే ఉండాలని, కాబట్టి ఈ సెక్షన్‌ను చెల్లబోదని పిటిషనర్ వాదిస్తున్నారు.
(27-06-2019, 07:45 AM)stories1968 Wrote: సెక్షన్ 497 ఏమి చెబుతోంది?
‘‘ఎవరైనా తనకు తెలిసిన లేదా వేరే వ్యక్తి భార్య అని భావించిన మహిళతో... ఆ వ్యక్తి (భర్త) అనుమతి లేకుండా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది వివాహేతర సంబంధం కింద నేరం అవుతుంది. అత్యాచారం కిందికి రాదు’’ ఇందుకు అయిదేళ్ల జైలు శిక్షగానీ, జరిమానాగానీ, రెండూగానీ విధించే అవకాశం ఉంది.
ఏంటి స్టోరిస్ గారు....కొంపతీసి నా మీద ఏదైనా కేసు పెట్టబోతున్నారా....




