Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#56
హస్తి మహారాజు చూడ చూడ తండ్రికి మించిన తనయుడు లాగా కనపడుతున్నాడు. హస్తి మహారాజు ఉదారుడు. ఉన్నతుడు. ఉర్వీపతి. హస్తి మహారాజు చిన్నప్పుడే సాధు జంతువులతో ఆడుకున్నంత చనువుగా కౄర జంతువులతో కూడా ఆడుకునేవాడని ఇక్కడి వారంతా చెబుతున్నారు. పులుల మీద సింహాల మీద స్వారీ చేసిన హస్తి మహారాజు ఒకసారి జలచరమైన మొసలి మీద కూడా సంచరించాడట. ఇలాంటి మహోన్నతుల ఏలుబడిలో మందిరాలు ఇలా కాక మరెలా ఉంటాయి? అదిసరే, హస్తి మహారాజు నన్ను సన్మానిస్తున్నప్పుడు వారి సామంత రాజు నిశానుని ముఖమును గమనించావా?" సత్యధరని అడిగింది యశోధర. 



"గమనించలేదు. ఏం?.. నీ సన్మానం ను చూచి నిశానుడు
కళ్ళతో నిప్పులు చిమ్మాడా ? తనలో తాను కుళ్ళుకు న్నాడా?" అని యశోధర ను అడిగింది సత్యధర. 



"ఓర్వలేని తనాన్ని ప్రదర్శించడం, కుళ్ళుకోవడం వంటివి కొందరు రాజుల సహజ గుణం. వాటిని మనం అంత తీవ్రంగా తీసుకోరాదు. కానీ నేను నిశానుని ముఖం లోని వికారాలన్నీ గమనించాను. అతను హస్తి మహారాజు కు ఏదో ప్రమాదం తలపెట్టాలనే దుర్బుద్ధి తో ఇక్కడికి వచ్చినట్లు ఉన్నాడు. అతగాడు రాత్రి హస్తి మహా రాజు కు ఏదో అపాయం తలపెట్టేటట్లు ఉన్నాడని నా మనసు నాకు చెబుతుంది. " అని సత్యధరతో అంది యశో ధర. 



"అయితే మనమిప్పుడు ఏం చేద్దాం?" రాణి యశోధరను ప్రశ్నించింది సత్యధర. 



"హస్తి మహారాజు మాతృమూర్తి సువర్ణాదేవి మనకు అంతఃపురం లోని అన్ని మందిరాలను చూపించింది కదా ? మనం కొంత సమయం గడిచిన పిమ్మట హస్తి మహారాజు మందిరానికి వెళ్దాం" అంది యశోధర. 



"అలాగే" అంది సత్యధర. 



 కొంత సమయం గడిచిన పిమ్మట యశోధర మారు వేషంలో సత్యసేన తో హస్తి మహా రాజు మందిరం దగ్గరకు వెళ్ళింది. ఆద మరిచి నిద్ర పోతున్న హస్తి మహారాజు ను చంపడానికి సిద్దమైన నిశానుని యశోధర చూసింది. నిశానుని గుండెల మీదకు పదునైన బాకును విసిరింది. బాకు వలయాకారంగా తిరుగుతూ వెళ్ళి, నిశానుని గుండెను చీల్చుతూ, అతని గుండెల్లో దిగబడింది. బాకుకున్న కాలసర్ప విషం నిశానుని శరీరంలో చొరబడింది. ఒక కన్ను ఎర్రబడగ, మరో కన్ను పచ్చబడగ నిశానుడు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. 



హస్తి మహారాజు నిద్రలేచి జరిగిందంత తెలుసు కున్నాడు. నిశానుని కళేబరాన్ని, కన్నులను చూసాడు. మిక్కిలి సంతోషించాడు. యశోధరను తగిన రీతిలో సన్మానించాడు. 
 సువర్ణాదేవి, సుహోత్రుడు యశోధర తలిదండ్రులను కలిసారు. అనేకానేక విలువైన కానుకలను సమర్పించారు. యశోధరను తమ యింటి కోడలిని చేయమని ప్రార్థించారు. 



 యశోపిత వరుల చిత్ర పటాలున్న గదికి సవర్ణాదేవిని, సుహోత్రుని తీసుకువెళ్ళాడు. గదిలో అన్ని చిత్ర పటాల నడుమ ప్రత్యేక పూజలందు కుంటున్న హస్తి మహారాజు చిత్ర పటాన్ని సువర్ణాదేవి సుహోత్రుడు చూసారు. మిక్కిలి ఆనందపడ్డారు. యశోధర మనసులోని అభిప్రాయాన్ని గమనించారు. 



 యశోధర హస్తి మహారాజుల వివాహం అంగ రంగ వైభవంగా జరిగింది. యశోధర హస్తి మహారాజు వివాహం జరిగిన విధానం సమస్తం గమనించిన కొందరు వారిది, "బ్రాహ్మ" వివాహం అంటే మరికొందరు కాదు కాదు యశోధర తలిదండ్రులు యిచ్చిన గోవులతో గో పూజ చేయడం జరిగింది కావున వారిది "ఆర్ష" వివాహం అని అనేవారు. 



ఇంకొందరు అదేం కాదు కాదు వారి వివాహం లో ప్రాజాపత్యం ఉంది. ఆసురం ఉంది. నిజం చెప్పాలంటే వారిది గాంధర్వ వివాహం అనేవారు. ఇలా ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు యశోధర హస్తి మహా రాజుల వివాహం గురించి చెప్పుకునేవారు. 



యశోధర హస్తి మహారాజు కొంత కాలం హిమాలయాది పుణ్య ప్రదేశాలను సందర్శించారు. అక్కడి మహర్షుల, రాజర్షుల క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు. అటు పిమ్మట తమ తమ సాటి రాజుల సామంత రాజుల రాజ్యాలలో ఉన్న రాజధానులను, దేవళాలను, వింత కట్టడాలను సందర్శించారు. ఆయా రాజుల అతిథి మర్యాదలను వినయంతో స్వీకరించారు. ఆయా రాజులు చేసిన యజ్ఞయాగాదులలో పాలు పంచుకున్నారు. కొందరు సామంత రాజులకున్న సమస్యలను తీర్చారు. 
...
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - రథంతరి - by k3vv3 - 07-02-2025, 01:11 PM



Users browsing this thread: 1 Guest(s)