Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#55
యశోధర
[font=var(--ricos-font-family,unset)] [/font]
[font=var(--ricos-font-family,unset)][Image: image-2025-02-07-130826463.png][/font]

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు






ప్రస్థలను రాజధానిగా చేసుకుని త్రిగర్త రాజ్య భువనాధీశుడు యశోపిత త్రిగర్త రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతని కుమార్తె యశోధర. యశోధర పేరుకు తగినట్లుగా రాజనీతి, కుటుంబనీతి, సమాజ నీతి, వేద పురాణేతిహాస నీతి, మనునీతి, మానవనీతుల మూలాలెరిగి మసులుకునే పరిపూర్ణ విజ్ఞానవంతురాలు. మహా యశస్సు కలిగిన ధైర్యవంతురాలు. సుపరిపాలన దక్షత కలిగిన సుశిక్షుతురాలు. యశోధర దుర్జనుల పాలిట సింహ స్వప్నం. సజ్జనుల పాలిట ఆపన్న హస్తం. పరోప కారుల పాలిట పరమామృత తేజం. 



 యశోధర పితృ దేవుని ఆదేశానుసారం ఎల్లవేళలా మూడు నదులు ప్రవహించే త్రిగర్తను సుసంపన్నం చేయసాగింది. అవకాశవాద ధర్మాన్ని అనుసరించేవారి మెడలు వంచేది. మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా మంచి మార్గాన కష్టపడేవారిని యిష్టంగా అభిమానించేది. 



 ఒకానొకప్పుడు విపాసా నది సమీపాన ఉన్న జన నిశ గ్రామం దేవతా సంచారానికి బహుదూరంగ ఉండేది. అక్కడివారు యజ్ఞయాగాదులు అంటే అసహ్యించు కునేవారు. విచ్చలవిడితనమంటే మహా యిష్టపడేవారు. పర సంపదను, పర స్త్రీలను అపహరించడమే ప్రధా కర్తవ్యంగా భావించేవారు. దైవ ధూషణంటే అదే ధర్మ పథం అనేవారు. 
 త్రిగర్త రాజ్యాన్ని ఆనుకుని ఉన్న జననిశ గ్రామం వంక చూడటానికే దేవతలు సహితం భయపడుతున్నారు అని తెలుసుకున్న యశోధర సుసైన్యంతో జననిశ గ్రామం వెళ్ళింది. ఆమె సుసైన్యంలో మగవారితో పాటు ఆడవారు కూడా ఉన్నారు. అందు సంసప్తక బృందం కూడా ఉంది. చేసిన ప్రతిజ్ఞ నుండి ఏనాడూ వెను తిరగని సంసప్తక బృందం జననిశ గ్రామం లోని రాక్షస భావ జాలం కలవారినందరిని సూక్ష్మ వలయ సమరం లో మట్టి కరిపించింది. అప్పుడు యశోధర కత్తి పట్టనవసరం లేకపోయింది. 



 యశోధర జననిశ గ్రామ వాసులతో, "మహా జనులారా! యజ్ఞ యాగాదుల వలన ప్రకృతి సంరక్షింప బడుతుంది. ప్రకృతి పచ్చగా ఉంటే సకాలంలో వర్షాలు పడతాయి. పాడి పంటల తో గ్రామం పచ్చగా ఉంటుంది. 



అప్పుడు గ్రామ దేవతల కరుణ పుష్కలంగా ఉంటుంది. 
దేవతా సంచారం గల ప్రాంతంలో హింస తగ్గుతుంది. అలాంటి పవిత్ర ప్రాంతాల్లో మహోన్నత మానవ శక్తి మాధవ శక్తిగా ఎదుగుతుంది. మహోన్నత గమ్యం మన కళ్ళముందు తారాడుతుంది. కాబట్టి మీరు మారండి. రక్కస భావాలకు తిలోదకాలు వదలండి. మీకు నేను ఎల్లప్పుడూ దండిగా అండగా ఉంటాను. " అని ప్రజల మనసుకు నాటుకునేటట్లు చెప్పింది. 



జననిశ గ్రామం నడుమ మత్స్యకూర్మవరాహవామనాది యజ్ఞ వేదికలను నిర్మింప చేసింది. వేదికల నడుమ పద్మ వేదికను నిర్మింప చేసింది. యజ్ఞ వేదికలకు తన యశస్సును కొంత ధార పోసి అక్కడ యజ్ఞయాగాదులు జరిగేటట్లు చేసింది. 



 యశోధర త్యాగానికి సంతసించిన దేవతలు జననిశ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసారు. అక్కడి జనంలో సాత్వికత ఎదిగేటట్లు చేసారు. దానితో యశోధర కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయి. 



 యశోధర కీర్తి ప్రతిష్టలకు తగిన వరుని తీసుకువచ్చి, ఆమె వివాహం చేయాలని ఆమె తండ్రి యశోపిత దేశదేశాల నుండి యువ రాజుల చిత్ర పటాలను తెప్పించి, వాటిని ప్రత్యేక మందిరాన ఏర్పాటు చేసాడు. ప్రశాంత సమయంలో పెళ్ళి కొడుకుల చిత్ర పటాలున్న గదిని సందర్శించమని యశోపిత తన కుమార్తె యశోధరకు చెప్పాడు. యశోధర తండ్రి ఆనతిని శిరసా వహించింది. తన చెలికత్తెలతో చిత్ర పటాలను తిలకించి చిలిపి కవితలను అల్లింది. 



 చంద్రవంశ రాజు భరతుని వంశాన జన్మించిన సుహోత్రుడు తన కుమారుడు హస్తికి పట్టాభిషేక మహోత్సవాన్ని ఏర్పాటు చేసాడు.. పట్టాభిషేకానికి అంగ వంగ కళింగ కాంభోజ టేంకణ పుళింద బాహ్లీక విదర్భ విదేహ సాళ్వ సింధు మత్స్య గాంధార అంబష్ఠ మల్ల చేది వత్స త్రిగర్తాది అనేక రాజ్యాల రాజులు, సామంతులు హాజరయ్యారు. 



పట్టాభిషేక మహోత్సవానికి త్రిగర్త రాజ్య రాజు యశోపిత, యువరాణి యశోధర ఆమె ముఖ్య అనుచర గణం, ప్రాణ స్నేహితురాళ్ళు సత్య ధర మొదలైనవారు, వారికి సంబంధించిన బంధుగణం కూడ హాజరయ్యింది. 



 యశోధర హస్తి మహారాజు పట్టాభిషేకం కు హాజరవ్వడమే కాకుండా సుహోత్రుని అభ్యర్థన మేరకు తమ నృత్య కళాకారిణులతో త్రిగర్త, విహంగ, అచల వ్యూహాల నృత్యాలను చేయించింది. అక్కడి వారందరినీ ఆనందింప చేసింది. యశోధరే ఆయా నృత్యాల రూప కల్పన చేసింది. అందుకు హస్తి మహారాజు యశోధర ను ప్రత్యేకంగా అభినందించి సన్మానించాడు. సన్మాన సభను చూచిన రాజులందరు యశోధరను పలు రీతుల్లో అభినందించారు.
 
పదనెక్కిన చురకత్తుల ప్రతాపజ్వాలల ప్రభ, మహోన్నత మానవీయ సహృదయ గౌరవ మర్యాదల ప్రభల నడుమ యశసిస్తున్న హస్తి మహారాజు ముఖాన్ని చూచిన యశోధర "హస్తి మహారాజు కారణ జన్ముడు. చరిత్ర.. కాదు కాదు.. యుగయుగాల చరిత్ర శాశ్వతంగా గుర్తు పెట్టుకునే పని ఏదో ఒకటి చెయ్యడానికే భారత దేశాన హస్తి మహారాజు జనించాడనిపిస్తుంది" అని మనసులో అనుకుంది. 



పట్టాభిషేక మహోత్సవం కు వచ్చినవారందరికి సుహోత్రుడు ప్రత్యేక విడిది మందిరాలను ఏర్పాటు చేసాడు. హస్తి మహారాజు తల్లి సువర్ణాదేవి యశోధరకు ప్రత్యేక విడిది మందిరం ఏర్పాటు చేసింది. విడిది మందిరం దేవేంద్ర లోక మందిరాలను మించిన అందం తో కళకళలాడుతుంది. విడిది మందిరాన్ని చూచిన యశోధర ప్రాణ స్నేహిరాలు సత్యధర, "చెలి యశోధర, ఇలాంటి విడిది మందిరాలను మనం దేవేంద్ర లోకాదులలో చూడగలమేమో గానీ భూలోకంలో మాత్రం చూడలేం కదా?" అని యశోధరతో అంది. 



"నిజం చెప్పావు సత్యధర. హస్తి మహారాజు తండ్రి సుహోత్ర మహారాజు వంద రాజ సూయాగాలు పైగా చేసారు. అలాగే లెక్కకు మించిన అశ్వ యాగాదులను చేసారు. గజబలాన్ని, అశ్వ బలాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. తన రాజ్య ప్రజల గృహాలను పసిడిమయం చేసారు. రాజ్య పటిష్టత కోసం అనేక పథకాలను అమలు చేసారు. ఇలా ప్రజలను ప్రకృతిని సంరక్షిస్తూ దేవ గణాన్ని సంతృప్తి పరిచారు. సుహోత్రుడు ప్రజలకు పంచిన సంపదలు వారి వారి కుటుంబాలకు రెండు తరాలకు మించి సరిపోతాయి. అలాంటి సుసంపన్న రాజ్యాన్ని కొడుకు హస్తి మహారాజు కు అప్పగించారు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - రథంతరి - by k3vv3 - 07-02-2025, 01:09 PM



Users browsing this thread: 1 Guest(s)