Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#76
"అత్తయ్యా మామయ్యా! నేవెళ్ళొస్తాను" వారిరువురిని సమీపించి చెప్పింది దీప్తి. 
"మంచిది దీపు" ఏకకంఠంతో హరికృష్ణ, లావణ్య ఒకేసారి అన్నాడు. 
ఈశ్వర్కు శార్వరికి చెప్పి దీప్తి తన కారులో కుర్చొని స్టార్ట్ చేసింది. వరండాలో నిలబడి వున్న హరికృష్ణ, లావణ్యలు దీప్తి కారు వీధిలో ప్రవేశించేంత వరకూ పరీక్షగా ఆమెను చూస్తూ వుండిపోయారు. 
"ఏమండీ!.. "
"చెప్పు లావణ్యా.. "
"దీపూ మనస్సు.. " లావణ్య పూర్తిచేయకముందే హరికృష్ణ. 
"ఎంతో మంచి మనస్సు.. నీలాగే!" నవ్వాడు హరికృష్ణ. 
"దీప్తిని మీరు నా కోడలిగా చేస్తారా!.. "
"చేయవలసింది నేను కాదు. ఆపైవారు.. వారు తలచుకొంటే కానిది లేనిది అంటూ ఏదీ వుండదుగా!.. "
"అవును.. "
"ప్రజాపతి దీప్తి నిర్ణయాన్ని.. "
"కాదన్నాడని దీపు చెప్పింది కదా అమ్మా!.. "
అప్పుడే వరండాలోకి వచ్చిన ఈశ్వర్, లావణ్య సందేహానికి జవాబు చెప్పాడు. 
"అమ్మా!.. మీ అన్నయ్య ఏమనుకొన్నా.. తాతయ్య నీకు ఇచ్చిన ఇంట్లో దీపు హాస్పిటల్ పెడుతుందమ్మా. తన నిర్ణయం మంచిది. దానికి మీరు అంగీకరించారు. నాకూ నచ్చింది కాబట్టి.. మీ సోదరుడు విషయంలో ఏమీ చేయలేడమ్మా!.. " ఎంతో సౌమ్యంగా చెప్పాడు ఈశ్వర్. 
హరికృష్ణ, లావణ్యలు పరీక్షగా ఈశ్వర్ ముఖంలోకి చూచారు. 
" విషయంలో మీ సోదరుడు వ్యతిరేకిస్తే.. వారిని ఎదుర్కొనే దానికి నేను సిద్ధంగా వున్నాను. మంచిని ఆదరించడం మానవ ధర్మం కదా అమ్మా!.. " చిరునవ్వుతో చెప్పి లోనికి వెళ్ళిపోయాడు ఈశ్వర్. 
"లావణ్యా!.. విన్నావుగా నా కొడుకు నిర్ణయం!"
"వాడిది నా పోలిక.. నా కొడుకు" చిరునవ్వుతో చెప్పింది లావణ్య. 
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 12 - by k3vv3 - 07-02-2025, 01:04 PM



Users browsing this thread: 1 Guest(s)