Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#53
 తన రాజ్యంలో గోసంపదను జఢు సైన్యం తమ రాజ్యానికి మళ్ళిస్తుంది అని ఇలినుడికి తెలిసిం ది. ఇలినుడు వెంటనే గో సంరక్షణకు బయలు దేరాడు. అప్పుడు రథంతరి " ఇలిన మహారాజ! అమానుషంగా, అక్రమంగా, ఆహవనీతి రహితంగ వ్యవహరించేవారికి ఎలా బుద్ది చెప్పాలో అలా బుద్ది చెబితే బాగుంటుంది. గోటితో తీసివేయడానికి అనుకూలంగా ఉన్న శత్రు సైన్యానికి గొడ్డలిని ఉపయోగించవలసిన పనిలేదు. మీ రాజ్యంలో యజుర్వేద తేజంతో ప్రకాశించే మేకలు అనేకం ఉన్నాయి కదా? అవే మీ గో సంపదను రక్షిస్తాయి. మీ మేకలను ఒకచోటకు చేర్చండి. " అని అంది రథంతరి. 



 తన రాజ్యంలో ఉన్న మేకలన్నిటిని ఒక చోటకు తీసుకురమ్మని ఇలినుడు సైనికులను ఆజ్ఞాపించాడు. వారు ఇలినుడు చెప్పింది చేసారు. 



 రథంతరి యజుర్వేద మంత్రాలను చదువుతూ మేకలన్నింటికీ సోమ రసం పట్టించింది. మేకలన్నీ జఢు సైన్యం మీద దాడి చేసాయి. ఎడమ చేత కర్ర పట్టుకుని మేక ముఖంతో ఉన్న యజుర్వేద పురుషుడు సమర రంగాన ఆవిర్భవించాడు. 



 రథంతరి మహర్షులతో కలిసి యజుర్వేద మంత్రాలను ఆలపించసాగింది. పసుపు రంగు తేజస్సుతో మేకలన్నీ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడాయి. అలాగే మేక ముఖంతో ఉన్న దక్ష ప్రజాపతి యజుర్వేద పురుషునికి నమస్కరిస్తూ సమర రంగంలో నిలబడి శత్రువులను చీల్చి చెండాడాడు. 



రథంతరి కోరిక మేర అసురి జఢు సైన్యం లో ఉన్న అసురులందరిని మట్టి కరిపించింది. 



 జఢుడు సమర రంగాన మరణించాడు. జఢు సైన్యం భయంతో సమర రంగాన్ని వదిలింది. రథంతరి ఇలినుడు యజుర్వేద పురుషునికి, దక్ష ప్రజాపతి కి సాష్టాంగ పడి నమస్కరించారు. 



 అనంతరం పెద్దల మునుల కోరికను అనుసరించి ఇలినుడు రథంతరి వివాహం చేసుకున్నారు. 



వివాహానికి యజుర్వేద పురుషుడు, దక్ష ప్రజాపతి కూడా వచ్చారు. దక్ష ప్రజాపతి అక్కడి వారందరికి తన కుమార్తె సతీదేవి వృత్తాంతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసాడు. 



 భర్త మాటలను అనుసరించి రథంతరి కాలుష్యమైన పురిష్టీ నదిని పరిశుభ్రం చేసింది. శృతకవన, వృద్ద, దహ్య అను పేర్లు కలవారు పురుష్టీ నదిలో స్నా నం చేసి తమ అంటు రోగాలను పోగొట్టుకున్నారు. రథంతరి పురుష్టీ నదిలోని నీటిని సోమ రసంతో ప్రతి రోజూ పరిశుభ్రంయించేది. 



పదిరోజులకు ఒక పర్యాయం నదిలోని నీటిని మార్పించేది. రాజ్యంలోని సమస్త నదీ తటాకాదులలోని జలాన్ని రథంతరి పరిశుభ్రం చేయించింది. రథంతరి కృత్రిమ మరుత్తుల సృష్టి చేసింది. అందుకు ఆమెకు తోడుగా అసురి, వేదస, తినిస వంటి ఆమె స్నేహితురాళ్ళు ఉన్నారు. దానితో ఇలినుని రాజ్యంలో వాయు కాలుష్యము తగ్గింది. ఇలా ఇలిన ర్మపత్నిగా రథంతరి మరింత పేరు ప్రతిష్టలను తెచ్చుకుంది. 



 రథంతరి మాటలను అనుసరించి ఇలినుడు తన రాజ్యంలోని దేవాలయాల దగ్గర సోమరస గానుగలను ఏర్పాటు చేయించాడు. సోమ రసం మానవుని మాధవునిగా మలుస్తుందని ప్రచారం చేయించాడు. తన రాజ్యంలోని వారందరిచేత ఋగ్వేదం లోని ఏడవ మండలాన్ని వల్లెవేయించాడు. 



 జఢుని సోదరుడు ఇలినుడు రాజ్యం మీదకు అసుర పక్షులను పంపాడు. అది గమనించిన రథంతరి అసుర పక్షులకు అడ్డంగ పెద్ద పెద్ద దుంగలను అసురి చేత అడ్డు పెట్టించింది. దుంగలను చీల్చుకు వెళ్ళే విషసూదులను సైన్యం తో ప్రయోగింప చేసింది. 



సూదులు దుంగలను చీల్చుకుంటూ వెళ్ళి అసురపక్షులను జఢుని సోదరుని చంపేసాయి. శత్రు రాజులందరు మరణించినందకు ఇలినుడు మహదానందపడ్డాడు. అలాంటి రథంతరి ఇలినుడుల కుమారుడే దుష్యంతుడు. పుణ్య దంపతులకు దుష్యంతునితో పాటు సూర, ప్రస , భీమ, వసు అనే సంతానం కూడ ఉన్నారు. 



 దుష్యంతుడు సోమ మొక్కల పెంపకం విషయంలో ఎక్కువ శాతం తల్లి రథంతరితోనే గడిపే వాడు. రథంతరి కుమారునితో, " నాయన దుష్యంత! నిరంతరం జ్ఞానం కలవారి చరితలను అభ్యసించాలి. సజ్జన సాంగత్యం తో కదలకుండా ధర్మాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న ధర్మాన్ని మరిచిపోకుండా క్రమం తప్పకుండా అనుసరించాలి. సద్గుణాలున్న సోదరులను, బంధువులను అభిమానించాలి. " అని అనేక ధర్మా ధర్మాల తారతమ్యాలను తెలియచేసేది. 



 దుష్యంతుడు చిన్న తనం నుంచే అడవులలో పులుల ను సింహాలను వేటాడి పట్టుకునే వాడు. వాటిని మచ్చిక చేసుకునే వాడు. గాయపడ్డ వాటికి మందులు ఇచ్చేవాడు. ఆపై సమస్త విద్యలను అభ్యసించి రాజయ్యాడు.



సర్వే జనాః సుఖినోభవంతు 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - సారస్వతి - by k3vv3 - 31-01-2025, 10:36 AM



Users browsing this thread: 1 Guest(s)