Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#52
ఇలినుడు తురు రాజు మీద యుద్దం ప్రకటించాడు. తురు రాజు, అతని సైన్యం తమ రాజ్యం చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెరువులలో శత్రువుల నిమిత్తం రకరకాల విషపూరిత మత్స్యముల వస్త్ర ధారణతో తిరగ సాగారు. తురురాజు వ్యూహాన్ని గమనించిన ఇలినుడు చేపలు పట్టు గాలపు ముల్లుల వస్త్ర ధారణ తో తన సైన్యాన్ని చెరువులలోకి దింపాడు. తను పెద్ద గాలపు ముల్లు వస్త్రాన్ని ధరించి, వలతో చెరువులోకి దూకాడు. 



ఇలినుడు రూపాన్నిచూచి తురు హడలిపోయాడు. చెరువుల్లో సమరం భయంకరంగా జరిగింది. కడకు తురు సైన్యంలో ఎక్కువ భాగం చనిపోయింది. కొనవూపిరితో ఉన్న సైన్యం గాలాలకు చిక్కింది. కొనవూపిరితో తురు రాజు ఇలినుడు వలలో పడ్డాడు. ఇలినుడు వలను చెరువు గట్టు మీదకు విసిరాడు. వలలోనే తురు రాజు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఇలా తన శత్రువులైన అయిదు మంది రాజులను ఇలినుడు సంహరించాడు. 



 ఇలినుడి ప్రాణ స్నేహితుడు తరంతర మహా రాజు ఇలినుడి విజయాలను ప్రశంసించడానికి ఇలినుడి రాజమందిరానికి వచ్చాడు. తరంతర మహారాజును తగిన విధంగా ఇలినుడు ఆహ్వానించాడు.



 తరంతర మహారాజు ద్వారా రథంతరి సోమ వన మొక్కల గురించి, ఆమె వైద్యం గురించి ఇలినుడికి తెలిసింది. రథంతరిని ప్రత్యేకంగా కలవాలని ఇలినుడు తరంతర మహారాజు తో అన్నాడు. 



 ఒకనాడు బృహస్పతి రథము నీతి ఘోషము రథంతరి పర్ణశాల ముందుకు వచ్చి ఆగింది. అందులో బృహస్పతి శిష్యులు ఉన్నారు. వారంతా మూర్చరోగులని గ్రహించిన రథంతరి వారందరికి మంచి లేపనమును అందించి వారిని రోగ విముక్తులను చేసింది. అలాగే విష్ణువు రథము శతానందం మీద కొందరు మూర్చ రోగులు రథంతరి పర్ణశాలకు వచ్చి వారు రోగ విముక్తులు అయ్యారు. 



 రథంతరి దేవతలకు సహితం వైద్యురాలు అయ్యిందని తెలిసిన అసురగణం, " రథంతరిని మచ్చిక చేసుకుని ఆమె వైద్యం మనకు ఉపయోగపడేటట్లు చెయ్యమని" అసురి అనే రాక్షసిని రథంతరి దగ్గరకు పంపింది. అసురి రథంతరి దగ్గరకు వచ్చింది. తన మంత్ర తంత్ర విద్యలన్నిటిని రథంతరి ముందు ప్రదర్శించింది. తను వచ్చిన పనిని తెలియచేసింది. 



అప్పుడు రథంతరి, " చూడు అసురి.. వైద్యమనేది మహత్తరమైన కళ. దానిని స్వార్థ చిత్తంతో చేస్తే సరైన ప్రయోజనం దక్కదు. 



ఇక సోమ రస వైద్యం పదుగురికి ఉపయోగపడే వారికే ఫలిస్తుంది. కాబట్టి నువ్వు ముందుగా అసురత్వాన్ని వదులుకో " అని అంది. 



 రథంతరి మాటలను అసురి పట్టించుకోకుండా, రథంతరి దగ్గర ఉన్న కొంత సోమ రసాన్ని తన వంటి మీదన ఉన్న పుండుల మీద పోసుకుంది. వెంటనే సురి దేహం మీదన ఉన్న పుండ్లునుండి అగ్ని పుట్టింది. మంటలను తట్టుకోలేక అసురి తనని రక్షించమని రథంతరి కాళ్ళ మీద పడింది.



 రథంతరి త్రికరణ శుద్ధిగా భగవంతుని ధ్యానించి సోమ రసం ను అసురి మీద చల్లింది. అసురి శరీరం మీద ఉన్న మంటలు తగ్గాయి. పుండులు తగ్గలేదు.



 అసురి రథంతరి మాటలను అనుసరించి వేదా భ్యాసం చేసింది. నిరుపేదలకు శ్రమదానం చేసింది. పరోపకార గుణంతో మెదలసాగింది. అప్పుడు రథంతరి అసురి దేహం మీద ఉన్న పుండ్లుకు సరైన సోమ రసం ఇచ్చింది. అసురి శరీరం తేజోవంతంగా మారింది. ఆపై అసురి రథంతరి స్నేహితురాలిగా ఉండిపోయింది. 



 తరంతర మహారాజు ఆధ్వర్యంలో శ్వావ్యాస మహర్షి ప్రజా క్షేమ యాగాలకు శ్రీకారం చుట్టాడు. యాగాలను రథంతరి నేతృత్వంలో జరిపిస్తే బాగుంటుంది అని తరంతర రాజు శ్వావ్యాస మహర్షి తో అన్నాడు. అందుకు శ్వావ్యాస మహర్షి అంగీక రించాడు. 



 తరంతర రాజు రథంతరిని ప్రత్యేకంగా కలిసాడు. శ్వావ్యాస మహర్షి యాగాల సంగతిని రథంతరికి చెప్పా డు. రథంతరిని ప్రత్యేకంగా ఆహ్వానించాడు. రథంతరికి ప్రత్యేకంగా పద్మ యాగ రథాన్ని ఏర్పాటు చేసాడు. అదే సమయంలో తరంతర మహారాజు ఇలినుడు గురించి కూడా రథంతరికి చెప్పాడు. ఆపై ఇలినుడిని సాదరంగా ఆహ్వానించి తీసుకురండి అని తరంతర మహారాజు ఆంతరంగిక సచివుని పంపాడు. 



 యాగానికి రథంతరితో పాటు అనేకమంది మహర్షులు, రాజులు వచ్చారు. తరంతర మహారాజు అందరిని సాదరంగా ఆహ్వానించాడు. తరంతర మహా రాజు ఇలినుడుకు రథంతరిని పరిచయం చేసాడు. 



 ఇలినుడు రథంతరి విజ్ఞానం గురించి రథంతరి ని అడిగి తెలుసుకున్నాడు. ఆపై తన రాజ్యంలో ఉన్న మూర్చ రోగాలగురించి, జల కాలుష్యం గురించి రథంతరికి చెప్పాడు. రథంతరి ముందుగా జలంలో కలపాల్సిన సుగంధ దినుసులు గురించి చెప్పింది. ఆపై సరోవరాల సమీపాన చేయవలసిన యాగాల గురించి చెప్పింది. 



  యాగానికి ఇలినుడి రాజ్యం నుండి రథవీతి  మహర్షి తన కూతురు తో సహా వచ్చాడు. అలాగే దేవేంద్రాదులు కూడా వచ్చారు. యాగ సమయంలో స్వల్ప అనారోగ్య సమస్య వలన దేవేంద్రుడు మూర్చ పోయా డు. అప్పుడు వశిష్ఠుని కోరిక మేర రథంతరి దేవేంద్రుని మూర్చకు మందు ఇచ్చింది. దేవేంద్రుడు యథాస్థితికి వచ్చాడు. 



 రథవీతి కుమార్తెకు చాలా కాలం నుండి వివాహం కావడం లేదని అక్కడివారందరికి తెలుసు. అందుకు కారణం మూర్చరోగం. రథవీతి కుమార్తె ను చూచిన శ్వావ్యాస మహర్షి ఆమెను వివాహం చేసుకుంటాను అన్నాడు. అందుకు రథవీతి మహర్షి తనను కుమార్తె మూర్చ రోగం గురించి చెప్పి, తన కుమార్తె ను వాంఛించవద్దని శ్వావ్యాస మహర్షి కి చెప్పాడు. 



 రథంతరి రథవీతి కుమార్తె గురించి తెలుసుకుంది. ఆమెకు " ఓమ సోమ.. సోమ సోమ ప్రభావే సర్వ సూక్ష్మ క్రిమి సంహార.. అంటూ చక్కని మందు ఇచ్చింది. 



 అనంతరం రథంతరి కోరిక మీద రథవీతి మహర్షి తన కుమార్తె ను శ్వావ్యాస మహర్షి కి ఇచ్చి వివాహం చేసాడు. తన రాజ్యంలోని రథవీతి కుమార్తె కు వివాహం అయినందుకు ఇలినుడు మిక్కిలి సంతోషించాడు. అందుకు ప్రధాన కారణం అయిన రథంతరిని పలు రీతుల్లో స్తుతించాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - సారస్వతి - by k3vv3 - 31-01-2025, 10:35 AM



Users browsing this thread: 1 Guest(s)