Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#51
అనారోగ్యం తో మన ప్రజలు ఎవరైనా వారి వారి రాజ్యాలకు వెళితే వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మన ప్రజల శక్తి యుక్తులను, అదృష్ట దీపికలను వారు తమకు అనుకూలంగా వినియోగించు కుంటున్నారు. అయితే మన ప్రజలు అధిక శాతం మంది అనారోగ్యానికి గురైనప్పటికీ రాజ్యాన్ని వదలడం లేదు. వారి దేశభక్తి నిజంగ అద్భుతం. అమోఘం. అనిర్వచనీయం. 



 ఇక మీదట శత్రు రాజుల మనుషులు మన రాజ్యాలలోకి రాకుండా మనం మరిన్ని జాగ్రత్తలు తీసు కోవాలి. మన ప్రజలను మనం మరింత జాగ్రత్తగా కాపా డుకోవాలి. ఇలాంటి జాగ్రత్తల విషయం లో నేను ముందుంటాను అని మీకు మాట ఇస్తున్నాను. అలాగే తురు సంహారం త్వరలోనే జరుగుతుంది అని మీకు మాట ఇస్తున్నా ను. 



ఇక మా తండ్రి గారైన త్రస మహారాజు గారి మాటలను అనుసరించి అర్హులకు తగినట్లుగా ధనమిస్తాను. యాచకులను నిరాశ పరచను. రాజసభలో మనసుకు ప్రీతి కలిగించేది, మేలైనది, ఉచితమైనది, సత్యమైనది, తీయనిది, విస్తృతం కానిది ధర్మంగా ఉండే మాటలే మాట్లాడతాను.. అలాంటి మాటలు మాట్లాడే సామర్థ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాను. " అని అన్నాడు. 






 ఇలినుడి మాటలను విన్న సామంత రాజు లు, "దండితాహితవీర ! సూరినిధాన ! దానవినోద !" అని ఇలినుడిని రకరకాలుగా ప్రస్తుతిస్తూ మనఃపూర్వకము గా మహదానందం పొందారు
........... 
 రథంతరి తన ప్రాణ స్నేహితురాళ్ళు తినిస, వేదస, రథద్రువు మొదలైన వారందరితో కలిసి సోమ వనమును పెంచసాగింది. ఆకులు లేకుండా ఆకు పచ్చని సన్నని కాండంతో ఏపుగ పెరుగుతున్న సోమ వనమును చూచి రథంతరి మిక్కిలి సంతోషించింది. 



 రథంతరి " ఓమ సోమ" అంటూ సోమ మొక్కల గురించి పరిపూర్ణంగ పరిశోధన చేయసాగింది. సుషోమ, అర్జికీయ అనే ప్రాంతములలో సోమ అధికం గా దొరుకుతుంది అని తెలుసుకుంది. చెలికత్తెలతో రథంతరి సుషోమ, అర్జికీయలకు వెళ్ళింది. అక్కడి సోమ మొక్కల సువాసనకు రథంతరి తనువు మైమరచిపోయింది. ఆమెకు తన ఆయుష్షు మరో నాలుగు సంవత్స రాలు పెరిగిందా? అని అనిపించింది.



 రథంతరి సోమ తీగల నుండి వచ్చే తెల్లని పా లను చూసింది. అలాగే సోమ తీగలకు ఉన్న తెల్లని పువ్వులను, ఆకు పచ్చని పువ్వులను చూచింది. అంత చెలికత్తెలతో, "చెలికత్తెలారా! సోమ రసం అంటు వ్యాధులను పోగొడుతుంది. మూర్చ రోగాన్ని తగ్గిస్తుంది. మంచి నిద్రను కలిగిస్తుంది. శరీరం మీద ముడుతలను తగ్గిస్తుంది. యౌవన శోభను పెంచుతుంది. అజీర్తిని తగ్గిస్తుంది. మానసిక వ్యాధులను నిరోధిస్తుంది. సోమ రసం ను మరి కొన్ని ఔషదాలతో కలిపితే అది మరిన్ని వ్యాధులను తగ్గిస్తుంది. మానవుని మాధవునిగ మలుస్తుంది. ఇలాంటి పవిత్ర ఔషద సంపదను మనం ముందు యుగాలవారికి అందించాలి. " అని అంది. 



రథంతరి మాటలను విన్న తినిస, " చెలీ రథంతరి, ముం దు యుగాలవారు ఇలాంటి ఔషదాలు ఉన్నాయంటే అసలు నమ్ముతారా?" అని అడిగింది. 



" నమ్మకపోవచ్చు. అయితే వారు పరిశోధనలు చేసి చివరికి మొక్కల దగ్గరకే వస్తారు. కంటికి కనపడే దానిని ఎవరైనా సరే నమ్మి తీరాల్సిందే. మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా వైద్య పరిశోధనలు చేసే వారిని సతతం ప్రశంసించాల్సిందే.. 



మాయ మాటలతో, మాయ మందులతో మనుషులను మోసం చేసేవారిని కఠినంగా శిక్షించాల్సిందే. గంధర్వులు సోమ రసం గురించి అధికంగా ప్రచారం చేస్తుంటారు. వారికి మనలాంటి వారు కూడా తోడుంటే వైద్య పరంగా మానవాళికి మనం చేయగలిగిన ఉపకారం మనం చేసినట్లవుతుంది. " తినిసతో రథంతరి అంది. 



 పసుపు రంగు కాండం తో ఉన్న సోమ మొక్కలు గురించి రథంతరి ఎక్కువగా పరిశోధనలు చేసింది. ఆమె పెంచే సోమవన సంరక్షకులుగా రథగుప్తి, రథన కుడ్యలు వంటి వారు ఉన్నారు. వారంతా ఆమె తండ్రి ఈలనుని ఆంతరింగికులు. 



 రథంతరి పవిత్రమైన సోమ మొక్కలు మరి కొన్ని కావాలని బ్రహ్మ దేవుని కోరింది. సుర డేగల ద్వారా బ్రహ్మ దేవుడు రథంతరికి సోమ మొక్కలు పంపాడు. 



 రథంతరి తన వనంలో పెరిగిన సోమ మొక్కల కాండములను పరిశీలించింది. చంద్ర కిరణాలతో ఊపిరి పోసుకున్న హిమరాయితో వాటిని చంద్రశిల మీద నూరింది. అంత లేపనములో శ్రేష్టమైన మేకపాలను కలిపింది. ద్రవాన్ని నల్లమట్టితో తయారు చేసిన కుండ లో ఉంచింది. కుండను హోమాగ్ని నడుమనున్న త్రిభుజాకార తిన్నె మీద ఉంచింది. కుండలోని ద్రవం గట్టి పడింది. ద్రవాన్ని మూర్చ పోయిన మేక మీద ప్రయో గించింది. 



లేపన ప్రభావంతో నాలుగు నిమిషాలలో మేక మూర్చ తగ్గిపోయింది. ఆపై మనిషి మీద ప్రయోగించింది. కొందరు మూర్చ పోయిన మనుషులకు లేపనం పని చేసింది కానీ అందరికీ పని చేయలేదు. అంత రథంతరి లేపనములో మరికొన్ని మూలికలను కలిపింది. 



 రథంతరి తినిస, వేదసల సహాయంతో సోమ వనంలో చిన్న సరసును ఏర్పాటు చేసింది. పున్నమి వెన్నెలలో కొన్ని సోమ మొక్కలనుండి స్రవించే సోమ రసం సరసు లోని జలములో ప్రవహించేటట్లు చేసింది. సరసులో జలకాలాడేవారి చర్మవ్యాధులు సమస్తం పోసాగాయి. పాలరాతీతో నిర్మించిన సరసును రథంతరి ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయించేది. రథంతరి తయారు చేసిన సోమ లేపనము మూ ర్చరోగులకు బాగా పని చేయసాగింది.
......... 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - సారస్వతి - by k3vv3 - 31-01-2025, 10:33 AM



Users browsing this thread: 1 Guest(s)