Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#48
భాస్కర్ ఆర్ధిక పరిస్తితి దృష్ట్యా ఇరవై వేల రూపాయలను చకా చకా ఖర్చు పెట్టేసాడు వేణు. రాఘవ రావు గారి అంత్య క్రియలు అతి ఘనం గా జరిగాయి. రాఘవ రావు గారు పని చెసి రిటైర్ అయిన కాలేజి మొత్తం వచ్చారు. అందరితో కలుపుగోలుగా వుంటూ నోట్లో నాలుకలా మెలిగే రాఘవరావు గారు తన మొత్తం సర్వీస్ లో అజాత శత్రువు అనే బిరుదును సంపాదించారు. ఎవరినైనా నొప్పించే విధం గా ఒక్క మాట కూడా మాట్లాడి వుండరు. అటువంటి మంచి మనిషికి అందరూ అశ్రుతర్పణాలతో వీడ్కోలు పలికారు.



తర్వాత దశ దిన కార్యక్రమం కుడా ఘనం గా జరిగింది. వేణు స్నేహితుల సాయం తో కార్యక్రమం లోటూ రాకుండా జరిపించాడు. ఇంట్లో అంతా సర్ధుకున్నాక అత్తగారిని తనతో తిసుకువెళ్ళే ప్రపోజల్ పెట్టాడు వేణు.



బావా, నాన్న లేరు, ఇంక అమ్మ తప్ప మాకు పెద్ద దిక్కు ఎవరున్నారు ? వున్న దాంట్లో సర్ధుకొని అమ్మను మేము జాగ్రత్తగా చూసుకుంటాము, అమ్మను ఇక్కడే వుండనివ్వు భాస్కర్ అన్నాడు.



"అది కాదు భాస్కర్, అత్తగారికి చేంజ్ ఆఫ్ ప్లేస్ చాలా అవసరం. ఇక్కడే వుంటే మావయ్య గారి స్మృతులు అనుక్షణం వెంటాడుతూ వుంటాయి. అందుకే అక్కడికి తీసుకు వెళ్తాను. వాతావరణం మార్పు వలన ఆవిడ త్వరగా కోలుకునే అవకాశం వుంది అందరినీ కన్విన్స్ చేసాడు వేణు.



రాజీ కూడా ఫోన్ చేసి అన్నయతో, అమ్మతో మాట్లాడి వారిని ఒప్పించింది. వీసా ఫార్మాలిటీస్ పూర్తి చేయించి వారం తర్వాత యశొదను తీసుకొని అమెరికాకు తిరిగి బయలుదేరాడు వేణు. రాజీ అమ్మను చూసి ఎంతో పోంగిపోయింది. అపార్ట్ మెంట్ లో అటాచ్డ్ బాత్రూం వున్న గది, ఫోను, టి వి, డి విడి ప్లేయర్ వగైరా సమకూర్చారు.



నాకెందుకు తల్లీ హడావిడీ అం తా ? అడిగింది యశోద.



అదేమిటండీ అలా అంటారు ? ఇక్కడ వున్నంత కాలం ఫ్రీ గా వుండండి. పైగా మీకు లోటు రానివ్వనని భాస్కర్ వాళ్ళకి మాటిచ్చాను కూడా వినయం గా అన్నాడు వేణు.



రాజీకి ఎంతో సంతోషం గా అనిపించింది. అమెరికా వచ్చిన నాలుగేళ్ళలో అమ్మను ఎంతో మిస్ అయ్యింది. ఇక కొన్నాళ్ళ పాటు అమ్మ దగ్గర హాయిగా వుండవచ్చు అనుకొని ఆనందించింది. ఆమ్మను తన స్వంత తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే వేణు లాంటి భర్త దొరకడం నిజంగా తన అదృష్టం గా భావించింది.



ఇంతలో కిరణ్ నుండి ఫోన్ వచ్చింది. వేణు ఎత్తాడు.



ఏమిట్రా నువ్వు చేసిన వెధవ పని. ముసలిదానిని నీ దగ్గరకు తెచ్చుకున్నావు. అక్కడ మీ బావ దగ్గర వదిలేస్తే పోయేదిగా ? అన్నాడు కిరణ్ చికాకుగా. 



ఒరేయ్ కిరణ్. నన్నెంత తక్కువగా అంచనా వేసావురా ? నేనేమైనా తెలివి తక్కువ వాడిననుకున్నావా ? ప్రతీ పనిలో లాభ నష్టాలు బేరీజు వేస్తే గాని పని చెయ్యను నేను. ఇప్పుడు రాజీకి ఎనిమిదో నెల. ఆరోగ్యం అంతంత మాత్రం గా వుంది. కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు చెప్పారు. డెలివరీ అయిన తర్వాత తల్లినీ, పిల్లనీ కొంత కాలం కంటికి రెప్పలా చూసుకోవాలి. నా వల్ల ఇదంతా జరిగే పనేనా ? ఇక్కడేమో రోజుకు ఇరవై డాలర్లు ఇస్తామన్నా కూడా నమ్మకమైన పని మనుషులు దొరకరు. అందుకే ఆవిడను వెంటబెట్టుకు వచ్చాను.



ఆడాళ్ళందరూ సెంటిమెంటల్ ఫూల్స్. కాస్త ప్రేమ నటిస్తే ఠక్కున వలలో పడిపోతారు. ఒక రెండు సంవత్సరాలపాటు వేళ కింత అన్నం పడేస్తే చాలు ఇంట్లో పనంతా చేస్తూ కుక్కలా పడుంటుంది ముసలిది. ఇక నాకేం చీకూ చింతా లేదు. నౌ ఐకెన్ కాన్సంట్రేట్ ఆన్ మై కెరీర్ విజయగర్వంతో నవ్వుతూ చెప్పాడు వేణు.



వేణూ ! యు ఆర్ రియల్లీ గ్రేట్. నీలాంటి ఇంటెలిజెంట్ ఫెలో నాకు ఫ్రెండ్ కావడం నాకెంతో అదృష్టం. నీ నుండి నేను నేర్చుకోవల్సింది చాలా వుంది మెచ్చుకొలుగా అంటూ డిస్కనెక్ట్ చేసాడు కిరణ్. బెడ్రూంలో ఎక్శ్టెన్షన్ నుండి ఇదంతా విన్న రాజీకి కళ్ళు తిరిగినంత పనయింది. భర్త కుత్సిత తత్వాన్ని, మనీ మైండెడ్ నెస్ అర్ధం అయ్యాక నవ నాడులు కృంగి బెడ్ పై కుప్పకూలిపోయింది. జరిగే తంతు తెలియక పాపం యశోదమ్మ తన గదిలో లవకుశ సినిమా టి వి లో చూస్తూ ఆనందిస్తోంది. 
***
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - బామ్మ....థి గ్రేట్ - by k3vv3 - 30-01-2025, 11:59 AM



Users browsing this thread: 1 Guest(s)