30-01-2025, 11:46 AM
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 12
హరికృష్ణ కార్లో పాలఫ్యాక్టరీకి బయలుదేరాడు. దార్లో సీతాపతి అతనికి కనిపించాడు. కారుని ఆపి సీతాపతిని రమ్మని చెయ్యి వూపాడు హరికృష్ణ.
బిక్కముఖంతో సీతాపతి... వారు కూర్చొని వున్న వైపుకు వచ్చి నిలబడ్డాడు.
"నమస్కారం మామయ్యా!" అన్నాడు.
"సీతా!... కారు ఎక్కు" చెప్పాడు హరికృష్ణ.
తిరిగివచ్చి డోర్ తెరచుకొని వారి ప్రక్కన కూర్చున్నాడు సీతాపతి.
’మామయ్య నన్ను ఎందుకు కార్ ఎక్కమన్నారో!.... శార్వరి తనతో నేను చెప్పిన మాటలు మామయ్య, అత్తయ్యలకు చెప్పిందా!... వారి ముఖం ఎంతో గంభీరంగా వుంది. మామయ్య చాలా గొప్ప వ్యక్తి. నా తండ్రిలా నీచప్రవృత్తి కలవాడు కాదు. నాకు ఏదో సందేశాన్ని ఇవ్వడానికే రమ్మన్నాడు. ఏం చెప్పబోతాడో ఏమో!’ భయంతో ఒదిగి కూర్చొని అనుకొన్నాడు సీతాపతి.
"నీవు బి.టెక్ చదువుతున్నావు కదూ!"
"అవును మామయ్యా."
"ఎన్నో సంవత్సరం?"
"ఫైనల్ ఇయర్!"
"అంటే వచ్చే మార్చికి బి.టెక్ కంప్లీట్ అవుతుందన్నమాట!"
"అవును"
"బి.టెక్ కాగానే ఎం.టెక్ చదవాలని వుందా లేదా!..."
"చదవాలని వుంది మామయ్యా!..."
తలాడించాడు హరికృష్ణ సాలోచనగా....
"సీతా!...."
"చెప్పండి మామయ్యా!"
"నీకు, శార్వరికి వయస్సులో వ్యత్యాసం ఎంతో నీకు తెలుసా!"
తెలీదన్నట్లు తలూపాడు సీతాపతి.
"మన రెండు కుటుంబాల మధ్యనా గత మూడు సంవత్సరాలుగా ఎలా వుందో నీకు తెలుసుగా!"
"నేను మీ నాన్నలాంటి వాణ్ణి కాను..."
"ఆ విషయం నాకు తెలుసు మామయ్యా! మీ మంచితనాన్ని గురించి అమ్మ అప్పుడప్పుడూ చెబుతూ వుంటుంది."
"నాది మంచితనమో, చెడ్డతనమో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు నా తండ్రి కొన్ని విషయాలను తెలియజేశాడు. ఆ మార్గాన నన్ను నడిపించాడు. వారు వున్నంతవరకూ... వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఆ విధానాలు నచ్చినందున పాటిస్తున్నాను. నీకు నీ తండ్రి ఏమి నేర్పలేదా!"
తన తండ్రి తత్వాన్ని గురించి తల్లి ప్రణవి చెప్పగా కొన్ని తెలిశాయి. వాణి వివాహ విషయంలో ప్రజాపతి... తన రాజకీయ ప్రయోజనాల కోసం, వాణి వివాహాన్ని కులం కాని వాడితో జరిపించడం తనకు తెలుసు. తన తండ్రి తత్వం ఇదే అని తెలిసిన తర్వాత అతని నుండి తాను నేర్చుకోవలసినది ఏదో తోచలేదు సీతాపతికి. మనస్సున తండ్రి మీద ద్వేషం... విద్యార్థి దశలో అతన్ని ఎదిరించి విమర్శించి ఎక్కడికి పోగలడు? ఏం చేయగలడు?..
హరికృష్ణ ప్రశ్నకు మౌనమే సీతాపతి వంతు అయింది. కారు పాలఫ్యాక్టరీ పోర్టికోలో ఆగింది.
హరికృష్ణ దిగాడు. దిగిన సీతాపతి వారి ముఖంలోకి చూచాడు. "రా!..." అన్నాడు హరికృష్ణ.
ముందు హరికృష్ణ, వెనకాల సీతాపతి. హరికృష్ణ ఆఫీస్ గదిలో ప్రవేశించారు. హరికృష్ణ తన స్థానంలో కూర్చున్నాడు. వారి రాకను గమనించిన అకౌంట్స్ మానేజర్ సుందరయ్య తలుపుతట్టి లోనికి వచ్చి విష్ చేశాడు.
"సుందరయ్యగారూ!... మిమ్మల్ని పదినిముషాల తర్వాత లోపలికి పిలుస్తాను" అన్నాడు హరికృష్ణ.
"సరే సార్!...." సుందరయ్య వెళ్ళిపోయాడు.
"సీతా!... చదువుమీద ధ్యాస వుంచు. చదువుకొనవలసిన వయస్సు నీది. నేడు వస్తున్న సినిమాలు.. వచ్చిన ఐఫోన్స్... వాట్సప్, గూగుల్ వీటన్నింటినీ చూచి మనం కూడా అందులో కనబడే వారిలాగానే తయారుకావాలనుకోవడం మంచి నిర్ణయమే!... కానీ... నీవు చూచించి మంచిదా!... చెడ్డదా అని ఆలోచించి... మంచిని నేర్చుకోవాలి. పాటించాలి. ఒకసారి చూచిన చెడ్డను మరోసారి చూడకూడదు. నీమీద మీ అమ్మానాన్నలకు ఏవేవో ఆశలు వుండవచ్చు.
అలాగే నాకు నా బిడ్డల విషయంలో కొన్ని ఆశలు వున్నాయి. కాబట్టి నీవు... శార్వరికి ఫోన్ చేయడం కాని, ల్యాప్టాప్లో వాట్సప్లో చాటింగ్ చేయడం గాని, ఇక మీదట ఎన్నడూ చేయకు. నేను చెప్పింది నీ మంచికేనని అర్థం చేసుకో. శార్వరి అమెరికాకు వెళ్ళాలని, తాను గొప్ప డాక్టర్ కావాలని ఆశపడుతూ వుంది. ఆ పిల్ల మనస్సును ప్రేమపేర కలుషితం చేయకు. నీ చర్యలను గురించి ఆమె నా భార్యకు చెబుతుంటే విన్నాను.
ఎటువంటి పరిస్థితులోనూ నేను నా బిడ్డను మీ ఇంటికి కోడలిగా చేయలేను. ఇది నా నిర్ణయం. పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకోకు. బుద్ధిగా చదువుకో. మంచి పేరు సంపాదించుకో. నా బిడ్డను మరిచిపో! నీ మేలుకోరి ఈ విషయాలన్నీ నీకు చెప్పాను" ఎంతో సౌమ్యంగా హరికృష్ణ సాగించిన సంభాషణ ఆపాడు.
సీతాపతి ముఖం... శరీరానికి చెమట పట్టింది.
"ముఖం నిండా చెమట... తుడుచుకో" తన కుర్చీ వెనుక వున్న టవల్ను అందించాడు హరికృష్ణ సీతాపతికి.
టవల్ అందుకొన్నాడు సీతాపతి. ముఖం తుడుచుకొన్నాడు. జగ్లో వున్న నీటిని గ్లాసులో పోసి అందించాడు.
"తాగు" అన్నాడు హరికృష్ణ.
గ్లాసులోని నీళ్ళను గటగటా త్రాగాడు సీతాపతి.
"పాపం... మీ అమ్మ!... అమాయకురాలు. ఎంతో దైవభక్తి కలది. ఆమె మనస్సుకు కష్టం కలిగించేలా నడుచుకోకు."
తలాడించాడు సీతాపతి.
"కాఫీ... టీ త్రాగుతావా!..."
వద్దన్నట్లు తలాడించాడు సీతాపతి.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ