Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#48
సారస్వతి మాటలను అనుసరించి మతినార మహారాజు  సత్త్ర యాగ నియమాలను పెంచాడు..మరింత నియమ నిష్టలతో సత్త్ర యాగం చేసాడు. దానితో తన రాజ్యంలో విజ్ఞాన బలం పెరిగింది. ప్రజల ఆలోచనాధోరణి మారింది. శ్రమశక్తి పెరిగింది. ఇదంతా తెలిసిన మతి నార మహారాజు సారస్వతిలో చదువుల తల్లి సరస్వతి ని చూసాడు. సారస్వతి మీద భక్తి బాధ్యతలతో కూడిన ప్రేమాభిమానాలను పెంచుకున్నాడు.



మతినార మహారాజు మనోభావం గ్రహించిన సారస్వతి తనూ తన సోదరుడు జ్ఞాన జలం తాగి ఎలా ఎదిగింది మతినార మహారాజు కు చెబుతూ రాజుకు జ్ఞాన జలం అందించింది. సారస్వతి ఇచ్చిన జ్ఞాన జలాన్ని మతి నార మహారాజు తన రాజ్యంలోని వారందరికి అందించాడు. ప్రజలలో మహా తేజస్సుతో కూడిన శక్తి వచ్చింది. వారిలో "కరువు రక్కసిని తరిమి కొడదాం" అన్న సదాలోచన పెరిగింది.



సరస్వతీ నది అలల మీద ఏర్పాటు చేసిన సారస్వతి జన్మదిన వేడుకలకు మతినార మహారాజు,అతని అనుచరులతో పాటు వచ్చాడు.  వేడుకకు హయగ్రీవ స్వామి కూడా వచ్చాడు. జ్ఞాన స్వరూపిణి సరస్వతి హయగ్రీవ స్వామిని తన గురువుగా అందరికీ పరిచ యం చేస్తూ, "హయగ్రీవ స్వామి వేద సంరక్షకుడు. వేద జ్ఞాన తేజోవిలాసి. విష్ణు స్వరూపుడు. సుందరానంద హయగ్రీవ తేజం అంటూ హయగ్రీవ స్తోత్రం తో స్వామిని పూజించింది.



హయగ్రీవ స్వామి సరస్వతీ నది పుణ్యస్త్రీగ మారడానికి కారణం ఇలా చెప్పాడు.



"ఒకసారి దుర్వాసన మహర్షి వేద మంత్రాలను శ్రుతి మించిన ఉచ్ఛారణ తో ఉచ్ఛరించాడు. అప్పుడు సరస్వతీ నదిలోని అలలు హేళన చేసినట్లు ఎగసి పడినవి. అందుకు దుర్వాసుడు కోపించి సరస్వతీ నది.. నువ్వు మానవ కాంతవై జన్మించి ఇద్దరు బిడ్డలకు తల్లివవుదువుగాక అని శపించాడు. శాప ప్రభావం తో సర స్వతి నది ఉభయభారతి అయ్యి సారస్వతికి, సరస్వత కు తల్లి అయ్యింది.  సారస్వతి కారణ జన్మురాలు" అని  హయిగ్రీవ స్వామి చెప్పాడు. 



గుర్రపు తలతో తెల్ల ని వస్త్రాలతో తెల్లని రంగుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తు న్న హయగ్రీవ స్వామి ని అందరూ స్తుతించారు.



అనంతరం సారస్వతి "సరస్వతీ మాత బ్రహ్మముహూర్తం లో వాగుపాసకుల నాలుక మీద ఉంటుంది. ఓం ఐం ఐం ఐం హ్రీం హ్రీం హ్రీం  సరస్వత్యైః నమః అని ప్రార్దిస్తే తల్లి కరుణిస్తుంది" అని మతినార మహారాజు కు చెప్పింది. 



సారస్వతి మాటలను విన్న మతినార మహారాజు "శ్వేత స్వరూపిణి అయిన సరస్వతి మాత, సరస్వతి నది జ్ఞాన తేజం కనులార చూసాను. మనసార తల్లి చరణ సేవ చేసాను. మరి నీల సరస్వతీ మాత స్వరూపం ఎలా ఉంటుంది? తల్లి ని ఎలా పూజించాలి?" అని సారస్వతిని అడిగాడు.



మతినార మహారాజు మాటలను విన్న సారస్వతి, "సరస్వతీ నది పుణ్య స్త్రీగా మారి జ్ఞాన స్వరూపిణి అయ్యింది. జ్ఞాన స్వరూపిణియే నా తల్లి. ఇక నీల సరస్వతీ మాత మా అమ్మ ప్రతిరూపమే.



నీల సరస్వతీ మాత  సర్వశత్రు క్షయంకరి. భక్తులకు వరదాయిని. శత్రువుల పాలిట భయంకర నీల స్వరూపిణి. తల్లి సౌమ్య రూపంలో ఉంటుంది. క్రోధ రూపం లో ఉంటుంది. చండ రూపంలో ఉంటుంది. హూంకారమయ నీల సరస్వతి బలిహోమ ప్రియురాలు. తల్లిని మనసు పెట్టి ప్రార్థిస్తే మంచి బుద్ధిని, యశస్సు ను, కవిత్వమును ప్రసాదిస్తుంది. సరస్వతీ మాత జ్ఞానానికి, వాక్కుకు ప్రధాన దేవత అయితే నీల సరస్వతి జ్ఞానానికి అవగాహనకు ప్రధాన దేవత. నీల సరస్వతి హోమం మహోన్నత హోమం" అని నీల సరస్వతి హోమం చేసే విధి విధానాలను చెప్పింది. 



సారస్వతి మాటలను అనుసరించి మతినార మహారాజు నీల సరస్వతిని పూజించి మరలా సత్త్ర యాగం చేసాడు.ఇలా మతినార మహారాజు సరస్వతీ నది ఒడ్డున 12 సంవత్సరాల పాటు మహానిష్టతో సత్త్ర యాగాన్ని చేసాడు. మహారాజు చేసే సత్త్ర యాగానికి సారస్వతి  అన్ని విధాలుగా సహకరించింది. దానితో మతినార మహారాజు రాజ్యంలోని కరువుకాటకాలు సమస్తం  తొలగిపోయాయి. ప్రజలందరూ ఆనందంగా జీవించసాగారు. విషయం తెలిసి మతినార మహారాజు మిక్కిలి సంతోషించాడు. సత్త్ర యాగాన్ని ధర్మ బద్ధం గా ముగించాడు.



మతినార మహారాజు సత్త్ర యాగాన్ని ముగించే ముందు యాగాగ్ని దేవుని మనసార చూసాడు. యాగాగ్నిలో సారస్వతి నవ వధువు గా మతినార మహారాజుకు దర్శనం ఇచ్చింది.



మతినార మహారాజు జ్ఞాన స్వరూపిణి సరస్వ తిని ప్రత్యేకంగా కలిసాడు. తన సత్త్ర  యాగ ప్రయోజ నం నెరవేరిందని జ్ఞాన స్వరూపిణి సరస్వతి కి చెప్పా డు. సత్త్ర  యాగ సమయంలో సారస్వతి తనకు చేసిన సహాయం మొత్తాన్ని జ్ఞాన స్వరూపిణి సరస్వతి కి పూస గుచ్చినట్లు చెప్పాడు. యాగాన్ని లో సారస్వతి దర్శన మిచ్చిన సంగతిని కూడ చెప్పాడు . సారస్వతి తన మనసుతో ఎలా పెనవేసుకు పోయింది చెప్పాడు.



జ్ఞాన స్వరూపిణి సరస్వతి మతినార మహారాజు మాటలను విని చిరు దరహాసం తో తన సమ్మతిని తెలిపింది. అంత సారస్వతి మతినార మహారాజు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది . . పుణ్య దంపతులకు పుట్టిన కుమారుని పేరు త్రసుడు. త్రసుని మనుమడు దుష్యంత మహా రాజు.



                    శుభం భూయాత్ 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - శుభాంగి - by k3vv3 - 25-01-2025, 01:16 PM



Users browsing this thread: