25-01-2025, 01:14 PM
యజ్ఞో వై విష్ణుః అంటే యజ్ఞం విష్ణు స్వరూపం. యజ్ఞం చేయడం వలన వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ప్రకృతి పచ్చగా ఉంటుంది. పశుపక్ష్యాదులు యజ్ఞయాగాదుల నుండి వచ్చిన గాలులను పీల్చడం ద్వారా మహాఆరోగ్యవంతంగా ఉంటాయి. ముఖ్యంగా యజ్ఞ యాగాదుల వద్ద ఉన్న ధేనువులు కామధేనువులుగ శక్తి సామర్థ్యాలను సంతరించుకుంటాయి. యజ్ఞంలో వాడే నెయ్యి , పాలు , వివిధ ధాన్యాలవలన సంప్రాప్తించిన భస్మంతో అనేక ఔషదాలను తయారు చేయవచ్చును.
యజ్ఞాలు ఆరు రకాలుగా ఉంటాయి. అవి ద్రవ్య యజ్ఞం, తాప యజ్ఞం, స్వాద్యాయ యజ్ఞం, యోగ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం,సంశిత యజ్ఞం. ఈ యజ్ఞాలన్నిటినీ నువ్వు ఇంతకు ముందే శాస్త్ర పద్దతిన ఆచరించావు. ఇక ప్రజల క్షేమం, రాజ్య క్షేమం కోరుకునే రాజు సత్త్ర యాగం చెయ్యాలి. 13 రోజులు మొదలుకొని 100 రోజుల వరకు సత్త్ర యాగం చెయ్యాల్సి ఉంటుంది. అలాగే 12 సంవత్సరాల పాటు చేసే సుదీర్ఘ సత్త్ర యాగం కూడా ఒకటి ఉంది." అని చెప్పడంతో మతి నార మహారాజు సత్త్ర యాగం చేయడానికి మంచి ప్రదేశం సూచించమని మహర్షులను అడిగాడు.
మహర్షులందరు ఏక కంఠంతో, "జ్వాల ఋక్షకుల పుత్ర! మతినార మహారాజ! ఋగ్వేదంలో సరస్వతీ నది రమారమి 50 పర్యాయాలు వివిధ నామ ధేయాలతో స్తుతించబడింది. అందుకే సరస్వతీ నది అలల కదలికలో 50 పవిత్ర కళలు కనపడుతుంటాయి. అందలి ఒక కళ మేథో తేజస్సును పెంచుతుంది. మరో కళ మేథో తేజస్సులో సురత్వాన్ని కలుపుకుని ప్రకాశిస్తుంది. ఇంకా ఆ కళలలో సంగీత కళ, యోగకళ వంటి కళలు ఉన్నాయి. అందుకే సరస్వతీ నది లోని నీటిని జ్ఞాన జలం అని అంటారు. అలాంటి సరస్వతీ నది ఒడ్డున ఉన్న బ్రహ్మవర్త ప్రదేశం నువ్వు చేసే సత్త్ర యాగం కు పవిత్ర ప్రదేశం" అని అన్నారు.
మతినార మహారాజు సరస్వతీ నది ప్రాంతాన ఉన్న బ్రహ్మవర్తం ను తన సత్త్ర యాగ కార్యక్రమానికి ఎంచుకున్నాడు. మతినార మహారాజు సరస్వతీ నది దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న ప్లక్ష వృక్షాన్ని, కామ్యక వనమును సందర్శించాడు. సరస్వతీ దృషద్వతులను చూసాడు. అనేక పాయలతో ప్రవహించే సరస్వతీ నదిని చూసాడు. పాయపాయన ప్రకాశించే ప్రమోద జ్ఞాన కళలను చూసాడు. సురుల జన్మ సుర నదుల జన్మ అతి పవిత్రం అనుకున్నాడు. కొంత కాలం తను అక్కడ ఉండటానికి తగిన కుటీరాలను ఏర్పాటు చేయించాడు.
మహర్షుల ఆదేశానుసారం, వృత్తాకార దీర్ఘచతు రస్రాకార చతురస్రాకార త్రిభుజాకార కూర్మాకార, మత్స్యాకార, వరాహాకారాది యజ్ఞ వేదికలను వేద గణాను సారం కొందరు ఋషులు పదుగురి సహాయంతో నిర్మించారు. మరికొందరు ఋషులు సత్త్ర యాగానికి కావాల్సిన వస్తువులను, ధినుసులను సమస్తం ఏర్పాటు చేయ సాగారు.
ఋషులకు కొందరు రాజ భటులు, కొందరు రాజ్య ప్రజలు సహాయంగా ఉన్నారు. అక్కడి వారం దరికి సరస్వత, సారస్వతీ తగిన విధంగా సహాయం చేయడమేగాక సరస్వతీ నదిలో ఏ ప్రదేశంలో ఎలాంటి నీరు ఉంటుంది అన్న పవిత్ర విషయాలన్నిటిని ఋషులకు, మహర్షులకు చెబుతున్నారు. మతినార మహారాజు సత్త్ర యాగంలో తను పాటించవలసిన నియమాదులను మహర్షుల ద్వారా తెలుసుకుంటూ , సరస్వత, సారస్వతిని గమనించలేదు.
అధ్వరులు , పురోహితులు, ఋషులు, మహర్షుల ఆధ్వర్యంలో సత్త్ర యాగం ప్రారంభమైంది. యజ్ఞ వేదికల నుండి ఎగసి పడే అగ్ని దేవుని కాంతులలో సరస్వతీ నది సరికొత్త కాంతులను సంతరించుకుంది. మహర్షుల మంత్రాలకు అనుకూలంగా సరస్వతీ నది, అలల నృత్యం చేయసాగింది. ఆ నృత్యం నటరా జునే మంత్ర ముగ్దుడిని చేయసాగింది.
మతి నార మహారాజు మండలం పాటు సత్త్ర యాగం చేసాడు.. యాగానంతరం పుణ్య స్త్రీ రూపంలో ఉన్న జ్ఞాన స్వరూపిణి సరస్వతీ నది మతినార మహారాజు కు దర్శనం ఇచ్చింది. మతినార మహారాజు రాజ్యం లో వర్షపు జల్లులు పడ్డాయి. వాతావరణ సమతుల్యత పెరగసాగింది.. అది తెలిసి మతినార మహారాజు మిక్కి లి సంతోషించాడు.
సత్త్ర యాగం మరో పదిరోజులు మరింత విజయవంతంగ ముగిసింది. ఒకనాటి పున్నమి రాత్రి జ్ఞాన జలం తాగుతున్న సారస్వతిని మతినార మహారాజు చూసాడు. సారస్వతి తెల్లని కాంతులు విరజిమ్మే శరత్కాల మేఘంలా ఉంది. శరదృతు చంద్రబింబం లా ఉంది. మతి నార మహారాజు నెమ్మదిగా సారస్వతి దగ్గరకు వెళ్ళా డు. సారస్వతిని అతి దగ్గరగా చూసిన మతినార మహా రాజుకు రాజహంసలు, జాజిపూల దండలు ,కురిసే మంచు గుర్తుకు వచ్చాయి . మతినార మహారాజు సారస్వతిని చూస్తూ , తనని తాను పరిచయం చేసుకున్నాడు. అప్పుడు సారస్వతి తను సరస్వతీ నది కుమార్తె సారస్వతిని అని చెప్పింది.
సారస్వతి మాటలను విన్న మతినార మహారాజు మనసు క్షణం పాటు సుందర జగతిన విహరించింది. మతినార మహారాజు ఆ జగతిలో వెండికొండను, ఆది శేషుని, రెల్లు పూలను, మల్లెపూలను, కల్ప వృ క్షం ను, పాల సముద్రం ను, తెల్ల తారలను, ఆకాశ గంగ ను వాటి నడుమ విహరించే సారస్వతిని చూసాడు. వెంటనే మతినార మహారాజు కు సారస్వతి మీద అభి మానం తో కూడిన అనురాగం జనించింది.
అంతవరకు సత్త్ర యాగం జరుగుతున్నప్పుడు తనూ , తన సోదరుడు సరస్వత, మహర్షులకు ఎలా సహాయపడింది వివరిస్తూ, సత్త్ర యాగం లో వెయ్యవలసిన హయ్యంగ వీనాదులగురించి సారస్వతి మతి నార మహారాజు కు చెప్పింది. సారస్వతి జ్ఞానం మతినార మహారాజు మేథస్సును మరింత పదును చేసింది.
మతినార మహారాజు తన మేథో సామర్థ్యాన్ని అంచనా వేసుకున్నాడు. తన మేథో సామర్థ్యం కొంత పెరగటానికి సారస్వతియే ప్రధాన కారణం అని గమనించాడు. దానితో సారస్వతి మీద అనురాగం అంతకు ముందున్నదానికంటే రెట్టింపయ్యింది. తన ఎదలో సారస్వతి మీద ఉన్న అభిమానం బాధ్యతతో కూడుకున్నదని మతినార మహారాజు మనసులో అనుకున్నాడు.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ