Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#46
సారస్వతి
[font=var(--ricos-font-family,unset)][Image: image-2025-01-25-123929607.png][/font]

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



"అగ్నిమీళే పురోహితం... యజ్ఞస్య దేవమృత్విజం.. హోతారం రత్నధాతమమ్" అని నిరంతరం ఋగ్వేద స్తుతుల అలల శబ్ద స్వరాలతో ప్రవహించే పవిత్ర నది సరస్వతీ నది. ఏడు పుణ్య నదులలో సరస్వతీ నదిది ప్రథమ స్థానం. అనేక పాయలుగ ప్రవహించే సరస్వతీ నది తరంగాల శబ్దం వేద పఠనంలోని ఉదాత్తానుదాత్తాది స్వరాలను గుర్తు చేస్తుంది. ఆయా స్వరాల నడుమన ఉన్న గణ చక్రాలను తెలియచేస్తుంది. "అగ్నిమీళే పురో హితం" అనే పాదం 8 అక్షరాలతో 13 మాత్రలతో 18 ఉచ్ఛారణా స్వరాలతో 83 స్థానాన ఉన్నదన్న సత్యం సరస్వతీ నది తరంగాల సుస్వరాలను పరిశీలించే వేద గణితో పాసకులకు సునాయాసంగా తెలిసిపోతుంది.



అలాంటి పుణ్య సరస్వతీ నది బ్రహ్మవర్తం ప్రాంతాన ప్రవహిస్తుంది. అక్కడే దృషద్వతి నదికూడ ఉంది.
దృషద్వతి బ్రహ్మ కుండలంలో జన్మించింది . ఋగ్వేద సంకలన ఋషుల ఆశ్రమ ఛాయలన్నీ రెండు నదుల నడుమనే కనపడతాయి.



సరస్వతీ నది అలల మీద తేలియాడే హంసలు జ్ఞాన కళికలులా ప్రకాశిస్తుంటాయి. కళికలను చూస్తే చాలు. మానవ మేధస్సులోని అమాయకత్వం ఆవిరైపోతుంది. చురుకుదనం చురకత్తుల్లా మారి అజ్ఞాన సంహారం చేస్తుంది. ఆయా అలల మీద నిలిచే నురుగు వివిధ దేవళాల ఆకారాలతో ఆద్యాత్మిక చింతనను పెంచి పోషిస్తుంది.
బ్రహ్మవర్తం ప్రాంతమంటే సరస్వతీ నదికి మహా యిష్టం. అక్కడే సరస్వతీ నది పుణ్యస్త్రీగ అవతారమెత్తింది. ఆమె పుణ్య స్త్రీగా అవతారమెత్తడానికి కారణం ఏమిటంటే... రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.



బ్రహ్మవర్తం లో నివసించే ప్రజలు వేద మంత్రోచ్ఛారణ లోని గణ చక్రాల గణిత తేజస్సును, ఆద్యాత్మిక తేజ స్సును గమనించడానికి సరస్వతీనది పుణ్య స్త్రీ అవతారమెత్తింది అనేది ఒక కథ.  ఇలా మరో నాలుగు కథలు ప్రచారంలో ఉన్నాయి. సరస్వతీ నది పుణ్య స్త్రీ రూపం చూచి దృషద్వతి కూడా పుణ్య స్త్రీ రూపం ధరించింది. ఇద్దరు నదీమ తల్లులు కలిసి అలల మీద ఆడిపాడారు.



అలల కింద ధ్యాన ముద్రలో కొంత కాలం గడిపారు. ఆపై దృషద్వతి సరస్వతి దగ్గర సెలవు తీసుకుంది. సరస్వతీ  బ్రహ్మవర్త ప్రాంతానికి వచ్చే దేవతలకు, మహర్షులకు, బ్రహ్మర్షులకు జ్ఞాన జలాన్ని ఇచ్చి వారి ఆకలిని తీరుస్తుంది. పుణ్య స్త్రీ ని కొందరు ఉభయభారతి అని అంటారు. ఎక్కువమంది మాతా! జ్ఞాన స్వరూపిణీ! సరస్వతీ అనే పిలుస్తారు.



ఒకసారి దేవేంద్రుడు అహల్యాదులకు చేసిన పాప భారంతో కటిక చీకటి ఆకారంగా మారిపోయాడు. ఆకారంతోనే అక్కడికి వచ్చా డు. అప్పుడు జ్ఞాన స్వరూపిణి సరస్వతి దేవేంద్రునికి జ్ఞాన జలాన్ని ప్రసాదించింది. దేవేంద్రుడు జ్ఞాన జలాన్ని స్వీకరించాడు
దేవేంద్రుడు జ్ఞాన జలాన్ని తాగగానే తన స్వస్వరూపాన్ని ధరించి దేదీప్యమానంగా వెలిగిపోయాడు. తను చేసిన తప్పులన్నిటిని తలచుకుని జ్ఞాన స్వరూపిణి సరస్వతి  ముందు తలవంచాడు. అప్పుడు జ్ఞాన స్వరూపిణి సరస్వతి దేవేంద్రుని కరుణించింది. 



దేవేంద్రుడు జ్ఞాన స్వరూపిణి ని సరస్వతిని నదిలా కాకుండా దేవీదేవతగ పూజించాడు. దేవీదేవత దేవేంద్రుని కోరిక మీద తను పుట్టిన పిప్పల వృక్ష చరిత్ర ను చెప్పింది. పిప్పలాది మహర్షుల గురించి చెప్పింది.



అలాగే తన కుమారుడు సరస్వతను, కుమార్తె సారస్వతిని దేవేంద్రునికి పరిచయం చేసింది. 



వేద మంత్రోచ్ఛారణల నడుమ సరస్వతీ నది బ్రహ్మత్వ మథనం నుండి పుట్టిన దేవీదేవత ఇద్దరు బిడ్డలను చూచి దేవేంద్రుడు "అద్భుతం మహాద్భుతం" అని అనుకున్నాడు. బ్రహ్మ సృష్టి ని పలు రీతులలో స్తుతించాడు.



 ఆపై దేవేంద్రుడు సారస్వతి వేద పఠనం విని మహదానంద పడ్డాడు. వేద పఠనంలో శాస్త్రీయంగా పఠించడం ముఖ్యం కానీ స్త్రీపురుష బేధం లేదనుకున్నాడు. మనుషులు సృష్టించే ఆచార నియమాలు వేరు. కా ధర్మం సృష్టించే ఆచార నియమాలు వేరు అనుకున్నాడు.



దేవేంద్రుడు దేవీదేవత దగ్గర సెలవు తీసుకు న్నాడు . ఇంద్రలోకం వెళ్ళాడు . తన ధర్మం తాను నిర్వర్తించ సాగాడు. అలా కొంత కాలం గడిచిపోయింది . ఒకానొకప్పుడు నిశాజ్ఞ అనే రాక్షసుడు దేవేందుని పై దండయాత్ర చేసాడు.



సరస్వత  తల్లి ఆజ్ఞ ను అనుసరించి దేవేంద్రునికి సమరంలో సహాయం చేసాడు. నిశాజ్ఞ సరస్వత ముందు నిలబడలేక పారిపోయాడు. సరస్వత దేవేంద్రునికి ఇంద్రలోకం అప్పగించి బ్రహ్మవర్తం వచ్చేసాడు. సరస్వతను తల్లి జ్ఞాన స్వరూపిణి సరస్వతి , సోదరి సారస్వతి ప్రశంసించారు. 



సారస్వతి ప్రకాశవంతమైన అందాన్ని, పదునైన తెలివితేటలను చూచిన తల్లి జ్ఞాన స్వరూపిణి సరస్వతి, సోదరుడు సరస్వత సారస్వతికి మంచి వరుని చూడాలనుకున్నారు. బ్రహ్మవర్తాన వసించే మహర్షుల, బ్రహ్మర్షుల సేవలు చేస్తూ, సారస్వతి అందరి మన్ననలను పొందసాగింది. జ్ఞానం కోసం అక్కడికి వచ్చిన వారి అభ్యాస సామర్థ్యాన్ని అనుసరించి వారిని జ్ఞానవంతులను చేయసాగింది.



పూరువంశ రాజు మతినారుడు. మంచి పరిపాలనా దక్షుడు. శత్రు రాజుల అహంకారాన్ని అణిచిన మహా పరాక్రమవంతుడు. మానవతావాదాన్ని నెత్తికి ఎత్తుకున్న మహాత్ముడు. ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సని నమ్మిన ప్రజానురంజక పరిపాలకుడు..



ఒకానొక సమయంలో అతని  రాజ్యంలో కరువుకాటకాలు అధికమయ్యాయి. జీవరాశులన్నీ ఆహారం నిమిత్తం అల్లాడసాగాయి. వర్షాలు లేక భూములు బీటలు వారాయి. రాజ్యం లోని భయంకర కరువు ను కళ్ళార చూసిన మతినార మహారాజు "రాజ్యంలో కరువుకాటకాలు నశించాలి అంటే  ఏం చెయ్యాలి?" ని పురోహితులను, మహర్షులను అడిగాడు.



మతినార మహారాజు మాటలను విన్న పురోహితులు, మహర్షులు,"ఋక్షక పుత్ర..  మతినార మహారాజ! ప్రకృతి కాలుష్యం అధిక మైనప్పుడు రాజ్యంలో కరువుకాటకాలు పెరుగుతుంటాయి. అవి తొలగాలంటే సృష్టి రక్షకుడైన విష్ణు మూర్తి ని పూజించాలి. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - శుభాంగి - by k3vv3 - 25-01-2025, 12:44 PM



Users browsing this thread: 1 Guest(s)